న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వారితో దడ, క్రికెటే కాదు: సచిన్‌ని గుర్తుచేసిన ద్రావిడ్

By Srinivas

న్యూఢిల్లీ: తాను ఇద్దరు బౌలర్లను ఎదుర్కొనేందుకు ఇబ్బందులు పడ్డానని మాజీ క్రికెటర్, టెస్ట్ క్రికెట్లో సెషన్‌ల కొద్దీ ఓపిగ్గా ఆడిన రాహుల్ ద్రావిడ్ చెప్పారు. ఆస్ట్రేలియా బౌలర్ మెక్‌గ్రాత్, శ్రీలంక స్పిన్నర్ మురళీధరన్‌ల బౌలింగులో ఇబ్బంది పడినట్లు చెప్పారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు.

భారత జట్టులో ఓపెనర్‌గా కొనసాగుతున్న మురళీ విజయ్ పైన ద్రావిడ్ ప్రశంసలు కురిపించారు. బంతి గమనాన్ని అంచనా వేయడంలో విజయ్ అమోఘ ప్రతిభ చూపుతున్నాడన్నారు. అశ్విన్ బౌలింగులో అద్భుతంగా క్యాచ్‌లు అందుకున్న రహానేను చూస్తుంటే అప్పట్లో కుంబ్లే బౌలింగులో తన కాంబినేషన్ గుర్తుకు వచ్చిందన్నారు.

రాహుల్ ద్రావిడ్ మంగళవారం టైగర్‌ పటౌడీ స్మారక ఉపన్యాసంలో భాగంగా కూడా పలు అంశాలపై తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. క్రికెట్‌ ఇప్పటి తరం చిన్నారులకు తొలి ప్రాధామ్యం కాదన్నారు. నగరాల్లో చిన్నారులు వేరే క్రీడల వైపు మళ్లుతున్నారని దేశంలో క్రీడా సమతుల్యానికిది మంచిదే అయినప్పటికీ, క్రికెట్‌ పాలకులు ఈ విషయంలో అప్రమత్తం కావాలని ద్రావిడ్ పిలుపునిచ్చారు.

 BCCI needs to formulate a blueprint for junior cricket: Rahul Dravid

వయసు ధ్రువీకరణలో మోసం, అక్రమ బౌలింగ్‌ శైలి జూనియర్‌ క్రికెట్లో ప్రమాదకర పరిణామాలని వీటిని నివారించడంతో పాటు యువ క్రికెటర్లను సవ్య దిశలో నడిపే దిశగా బీసీసీఐ మేలుకోవాలన్నాడు. క్రికెట్‌ విషయంలో మన చిన్నారులు, తల్లిదండ్రుల దృక్పథం వేగంగా మారుతోందన్నారు.

ప్రతి భారతీయ చిన్నారీ చేతిలో బ్యాట్‌తో పుట్టే రోజులు పోయాయని, ముఖ్యంగా నగరాల్లోని చిన్నారులు వేరే క్రీడల్నే ఎంచుకుంటున్నారని, క్రికెట్‌ వారికి నెంబర్‌వన్‌ క్రీడ కాదన్నారు. గత నాలుగైదేళ్లలో క్రికెట్‌తో పోలిస్తే ఫుట్‌బాల్‌, టేబుల్‌ టెన్నిస్‌, బ్యాడ్మింటన్‌, స్విమ్మింగ్‌కు సంబంధించిన పరికరాలు, ఆట వస్తువులు ఎక్కువగా అమ్ముడుబోతున్నట్లు ఓ సంస్థ తెలిపిందన్నారు.

ఈ తరం ఇలా వేరే క్రీడల మీద కూడా దృష్టిపెడుతుండటం మంచిదేనని, ఇది దేశంలో క్రీడా సమతుల్యానికి ఉపయోగపడుతుందన్నారు. కానీ ఓ క్రికెటర్‌గా తనకు ఇది ఆందోళన కలిగించే విషయమన్నారు. క్రికెట్‌ వైపు చిన్నారుల్ని ఆకర్షించడానికి మనం చేయాల్సినంత చేయట్లేదేమోనని అభిప్రాయపడ్డారు.

తప్పుడు జన్మదిన ధ్రువీకరణ పత్రాలతో తమ వయసు కంటే తక్కువ విభాగాల్లో ఆడే క్రికెటర్ల సంఖ్య పెరిగిపోతోందని, ఇది ప్రమాదకర పరిణామని, ఈ విషయంలో కోచ్‌లు, తల్లిదండ్రులే దగ్గరుండి తప్పులు చేయిస్తున్నారన్నారు.

తమ పిల్లలకు అవకాశాలు కల్పిస్తున్నారు కాబట్టి తల్లిదండ్రులు సంతోషంగా దీనికి అంగీకరిస్తున్నారని, ఐతే పెద్దవాళ్లే దగ్గరుండి తప్పులు చేయడం నేర్పిస్తే అది ఓ పిల్లాడిపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? పెద్దయ్యాక ఇంకా పెద్ద తప్పులు చేయడానికి దారితీయదా? అన్నారు.

ఓ యువ బౌలర్‌ అండర్‌-19 స్థాయిలో అక్రమ బౌలింగ్‌ శైలి కారణంగా సస్పెన్షన్‌కు గురయ్యాడంటే అందుకు బాధ్యత... అతడికి బౌలింగ్‌ నేర్పించిన కోచ్‌‌దేనని అభిప్రాయపడ్డారు. వికెట్లు తీస్తున్నాడని, మ్యాచ్‌లు గెలిపిస్తున్నాడని తేలిగ్గా తీసుకుంటే ఆ తర్వాత ఆ కుర్రాడి కెరీరే నాశనమవుతుందన్నారు.

జూనియర్‌ ప్రపంచకప్‌ ఆడాల్సిన వాడిని బౌలింగ్‌ శైలి సరిదిద్దుకోమంటూ వెనక్కి పంపిస్తే అతడి పరిస్థితి ఏమవుతుందని, ఇలాంటి దగ్గరి దారులు, అక్రమ పద్ధతుల్లో వెళ్లడం సరికాదన్నారు. సచిన్ టెండుల్కర్ అసాధారణ ప్రతిభతో చాలా త్వరగా భారత జట్టులోకి వచ్చాడన్నారు.

అతడికి చిన్నతనం నుంచి ఎంత ప్రోత్సాహం లభించిందని, ఆ ప్రోత్సాహమే లేకుంటే సచిన్‌ ఈ స్థాయికి వచ్చేవాడని నేననుకోనని, తల్లిదండ్రులు ప్రోత్సహించారని, అన్నయ్య అండగా నిలిచాడని, కోచ్‌ అచ్రేకర్‌ అతడికి ఆట పరంగానే కాకుండా జీవితం విషయంలోనూ మార్గ నిర్దేశం చేశాడన్నారు.

ఇందుకు సచిన్‌ అదృష్టవంతుడని, ప్రతిభ ఉన్న ప్రతి ఒక్కరికీ ఇలాంటి ప్రోత్సాహం లభించదన్నారు. అందుకే జూనియర్‌ క్రికెట్‌ విషయంలో బీసీసీఐ చేయాల్సింది చాలా ఉందని, క్రికెట్‌ అకాడమీల్లో ప్రమాణాలు అత్యుత్తమంగా, జవాబుదారీతనం ఉండేలా చూడాలన్నారు. ప్రమాణాలు పాటించని అకాడమీలపై వేటు వేయాలన్నారు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X