న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్లాన్ రెడీ: మోడీతో మీటింగ్, మిథాలీ సేనకు భారీ సత్కారం

వరల్డ్ కప్‌లో రన్నరప్‌గా నిలిచిన మిథాలీ సేనను ఘనంగా సన్మానించేందుకు బీసీసీఐ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. లార్డ్స్ వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్లో ఆతిథ్య ఇంగ్లాండ్‌ చేతిలో భారత్‌ 9 పరుగుల తేడాతో ఓటమి.

By Nageshwara Rao

హైదరాబాద్: వరల్డ్ కప్‌లో రన్నరప్‌గా నిలిచిన మిథాలీ సేనను ఘనంగా సన్మానించేందుకు బీసీసీఐ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. లార్డ్స్ వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్లో ఆతిథ్య ఇంగ్లాండ్‌ చేతిలో భారత్‌ 9 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే.

యితే మిథాలీ సేన ఓడిపోయినా... చిరస్మరణీయ ప్రదర్శనతో, అద్భుతమైన పోరాటపటిమతో కోట్లాది భారతీయుల మనసులను గెలుచుకుంది. ప్రధాని మోడీ దగ్గర నుంచి ప్రస్తుత, మాజీ క్రికెటర్లు, అభిమానులు సోషల్‌ మీడియా ద్వారా మిథాలీ సేనపై ప్రశంసల వర్షం కురిపించారు.

BCCI plans grand felicitation for Mithali Raj & Co for good show at World Cup 2017

తమ అద్భుత పోరాట ప్రదర్శనతో సగటు భారత క్రికెట్ అభిమాని మనసులను గెలుచుకున్నారని పలువురు పేర్కొన్నారు. జట్టు సభ్యులు బుధవారం నుంచి విడతలు విడతలుగా భారత్‌‌కు తిరిగి రానున్నారు. దీంతో మిథాలీసేనకు స్వాగతం పలకడంతో పాటు ఘనంగా సన్మానించాలని బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది.

అయితే ఈ సన్మాన కార్యక్రమానికి సంబంధించి వేదికతో పాటు తేదీని బీసీసీఐ అధికారికంగా ప్రకటించలేదు. ప్లేయర్లు అందుబాటుని దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ త్వరలో ఈ సన్మాన కార్యక్రమంపై ఓ నిర్ణయం తీసుకోనుంది. ఈ సన్మాన కార్యక్రమంలో బీసీసీఐ ఆటగాళ్లతో పాటు సహాయక సిబ్బందికి నగదు ప్రోత్సహాకాలను అందించనుంది.

పైనల్‌కు ముందు బీసీసీఐ ఆటగాళ్లుకు ఒక్కొక్కరికి రూ. 50 లక్షలు, సహాయక సిబ్బందికి రూ. 25 లక్షలు నజరానాను ప్రకటించిన సంగతి తెలిసిందే. 12 ఏళ్ల తర్వాత వరల్డ్ కప్ ఫైనల్‌కు చేరిన భారత మహిళల జట్టుకి ప్రధాన మోడీ సైతం శుభాకాంక్షలు తెలియజేశారు.

"పైనల్లో ఓటమి పాలైనా... దేశం మొత్తం గర్వించేలా అద్భుత ప్రదర్శన చేశారు. మహిళా క్రికెటర్లకు బీసీసీఐ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడంతో పాటు ప్రధాని నరేంద్రమోడీతో మీటింగ్ కూడా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది" అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.

Story first published: Monday, November 13, 2017, 12:16 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X