న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'గాంధీ, మండేలాను ఉంచిన జైలు ఊచలతో ఫ్రీడం ట్రోఫీ'

By Nageswara Rao

పూణె: గాంధీ-మండేలా సిరిస్ పేరిట భారత్, దక్షిణాఫ్రికా దేశాల మధ్య టెస్టు సిరిస్‌ను బీసీసీఐ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ టెస్టు సిరిస్‌లో విజేతలకు ఇచ్చే 'ఫ్రీడం ట్రోఫీ' వినూత్నంగా ఉండాలని బీసీసీఐ భావిస్తోంది.

ఈ సిరిస్ మహాత్మా గాంధీ, నెల్సన్ మండేలాలను గుర్తు చేసుకుంటూ సాగుతున్న నేపథ్యంలో 'ఫ్రీడం ట్రోఫీ' తయారీ కోసం వారిద్దరిని బందీలుగా చేసి ఉంచిన జైలు గదుల ఊచలను ఒక చోటికి చేర్చి 'ఫ్రీడం ట్రోఫీ'కి మెరుగులు దిద్దాలనేది బీసీసీఐ ప్రతిపాదన.

ఈ విషయాన్ని చెబుతూ తమకు రెండు ఊచలు ఇప్పించాల్సిందిగా బీసీసీఐ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ స్వయంగా అక్టోబర్ 7వ తేదీన పుణేలోని జైళ్ల డీజీకి లేఖ రాశారు. తాను ఈ లేఖను అందుకున్నట్లు జైళ్ల డీజీ బీకే ఊపాధ్యయ వెల్లడించారు.

BCCI wants to make trophy out of jail rods of Mahatma Gandhi's cell in Yerwada jail


భారత్‌కు స్వాతంత్ర్యం కోసం ఉద్యమిస్తున్న వేళ గాంధీని పూణెలోని ఎరవాడ జైలులో బందీగా, అదే విధంగా మండేలాను చాలా ఏళ్ల పాటు రాబిన్ ఐలాండ్ జైలు గదిలో ఉంచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ జైలు గదులకు సంబంధించిన ఊచలను ఇవ్వాలని బీసీసీఐ ఇప్పటికే లేఖలు రాసింది.

కాగా, ఈ లేఖపై ఇప్పటికింకా నిర్ణయం తీసుకోనప్పటికీ, టెస్టు మ్యాచ్ ట్రోఫీ గాంధీ, మండేలా నివసించిన జైలు గదుల ఊచలతోనే తయారవుతుందని సమాచారం. కాగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య నవంబర్ 5 నుంచి టెస్టు సిరిస్ ప్రారంభం కానుంది.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X