హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేలం సోమవారం బెంగుళూరులో ముగిసింది. రూ. 17.50 కోట్లతో ఈ వేలం బరిలోకి దిగిన పూణె సూపర్ జెయింట్స్ ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్‌ను రూ. 14.50 కోట్లకు కొనుగోలు చేసి అందరిని ఆశ్చర్య పరిచింది.
66: ఐపీఎల్ 2017 వేలంలో అమ్ముడుపోయిన క్రికెటర్ల వీరే
ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ కోసం హోరాహోరీ సాగుతుందని ముందే అందరూ ఊహించారు. బెన్ స్టోక్స్‌ను దక్కించుకోవడానికి ముంబై, బెంగుళూరు ప్రాంఛైజీల మధ్య హోరా హోరీ బిడ్డింగ్ సాగింది. అయితే మధ్యలో బిడ్డింగ్‌లో పాల్గొన్న పూణె స్టోక్స్‌కు రికార్డు ధర చెల్లించి కొనుగోలు చేసింది.
ఈ క్రమంలో బెన్ స్టోక్స్ 14.50 కోట్లకు అమ్ముడుపోయాడు. తద్వారా ఐపీఎల్ చరిత్రలోనే యువరాజ్ సింగ్ (రూ.16 కోట్లు) తర్వాత అత్యధిక ధర పలికిన ఆటగాడిగా బెన్ స్టోక్స్ రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
అయితే బెన్ స్టోక్స్‌ని అంత పెద్ద మొత్తం వెచ్చించి కొనుగోలు చేయడాన్ని ఆ జట్టు కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ సమర్ధించుకున్నాడు. గతేడాది ఐపీఎల్ ద్వారా అరంగేట్రం చేసిన పూణె ఆ సీజన్లో పెద్దగా ఆకట్టుకోలేకపోవడం చాలా నిరాశకు గురి చేసిందన్నాడు. తమ జట్టులో స్టార్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ అది కేవలం కాగితాల వరకే పరిమితమైందన్నాడు.
ఐపీఎల్ 2017 వేలం: 14.5 కోట్లతో రికార్డు ధర పలికిన బెన్ స్టోక్స్
'ఇది కచ్చితంగా రిస్క్ తో కూడిన అంశమే. బెన్ స్టోక్స్‌కు రూ.14.5 కోట్లు పెట్టడం అంటే అది చాలా పెద్ద సాహసమే. ఇక్కడ మా ఫ్రాంచైజీ యాజమాన్యం స్టోక్స్ కొనుగోలు విషయంలో భారీగా రిస్క్ చేసింది. కొంతమంది కీలక ఆటగాళ్లు అవసరమని భావించే రిస్క్ చేశాం. మా జట్టులో యువ ఆటగాళ్లకు కొదవలేదు. దాంతో సీనియర్ ఆటగాళ్లు అవసరం కూడా ఉంది. జట్టును సమతుల్యం చేయడం కోసమే ఆటగాళ్ల కొనుగోలులో కొంతవరకూ రిస్క్ చేయాల్సి వచ్చింది. అత్యధికంగా డబ్బు పెట్టడం అంటే రిస్క్ కదా. ఆ రిస్క్ చేయడానికి పుణె సిద్ధంగా ఉంది కాబట్టే అలా చేసింది' అని ఫ్లెమింగ్ పేర్కొన్నాడు.