న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పెద్ద సవాళ్లు ముందున్నాయ్: కుంబ్లేకు సెహ్వాగ్, కోచ్ పదవిపై ఇలా

న్యూఢిల్లీ: వెస్టిండీస్ సిరీస్ టీమిండియాకు పెద్ద సవాల్ కాదని టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. ఢిల్లీలో సెహ్వాగ్ మాట్లాడుతూ.. టీమిండియాకు కుంబ్లే అద్భుతమైన కోచ్ అని కొనియాడాడు.

టెస్టుల్లో సెంచరీతో పాటు 600కుపైగా వికెట్లు తీసిన ఆటగాడిగా కుంబ్లేపై అంతులేని అభిమానం ఉందని తెలిపాడు. కుంబ్లే సానుకూల స్వభావం కలిగిన వ్యక్తి అని సెహ్వాగ్ తెలిపాడు.

కుంబ్లేది ఓటమిని అంగీకరించే తత్వం కాదని చెప్పాడు. అతని నుంచి టీమిండియా యువ ఆటగాళ్లు విలువైన విషయాలు నేర్చుకునే అవకాశం ఉందని అన్నాడు. అతని నేతృత్వంలో టీమిండియా అత్యధిక విజయాలు సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.

Biggest task for Anil Kumble is to beat tough teams in Test, says Virender Sehwag

అయితే కుంబ్లేకు అసలు సవాల్ ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ సిరీస్‌లలో ఎదురయ్యే అవకాశం ఉందని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా టీమిండియాకు కోచ్‌గా చేసే అవకాశం వచ్చినా చేసేంత తీరిక తనకు లేదని సెహ్వాగ్ తెలిపాడు.

అంతేగాక, టీమిండియాకు బ్యాటింగ్ కోచ్ అవసరం లేదని స్పష్టం చేశాడు. కోహ్లీ లాంటి ప్రతిభ గల ఆటగాళ్లు టీమిండియాలో ఉన్నారని తెలిపారు. కుంబ్లే నేతృత్వంలో టీమిండియా విజయావకాశాలు మెరుగవుతాయని మరోసారి స్పష్టం చేశాడు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X