న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

దిగొచ్చిన బ్రాడ్ హాగ్: 'ఐపీఎల్' వ్యాఖ్యలపై కోహ్లీకి క్షమాపణ

ఐపీఎల్‌లో ఆడేందుకే ధర్మశాల టెస్టుకు కోహ్లీ దూరమయ్యాడని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు బ్రాడ్ హాగ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించాడు. తాను చేసిన వ్యాఖ్యలు కోహ్లీని కించపరచడానికి కాదని బ్రాడ్ హాగ్ స్పష్టం చేశాడు.

By Nageshwara Rao

హైదరాబాద్: ఐపీఎల్‌లో ఆడేందుకే ధర్మశాల టెస్టుకు కోహ్లీ దూరమయ్యాడని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు బ్రాడ్ హాగ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించాడు. తాను చేసిన వ్యాఖ్యలు కోహ్లీని కించపరచడానికి కాదని బ్రాడ్ హాగ్ స్పష్టం చేశాడు. నాలుగు టెస్టుల సిరిస్‌లో నిర్ణయాత్మక టెస్టు అయిన ధర్మశాల టెస్టు నుంచి కోహ్లీ వైదొలగడాన్ని తాను అలానే అర్ధం చేసుకున్నట్లు చెప్పాడు.

<strong>ఐపీఎల్ కోసం చివరి టెస్టుకు దూరం: కోహ్లీపై హాగ్ సంచలన ఆరోపణ</strong>ఐపీఎల్ కోసం చివరి టెస్టుకు దూరం: కోహ్లీపై హాగ్ సంచలన ఆరోపణ

అయితే తాను చేసిన వ్యాఖ్యలు ఎవరినైనా గాయపరిచి ఉంటే క్షమించమని విజ్ఞప్తి చేశాడు. 'నా ఉద్దేశం ఏ ఒక్క ఆటగాడిని గాయపరచాలని కాదు. చాలా మంది ఆటగాళ్లు క్యాష్ రిచ్ టోర్నమెంట్ అయిన ఐపీఎల్‌కు ముందు నుంచే సిద్ధమవుతారు. గతంలో కూడా ఐపీఎల్ కారణంగా పలువురు ఆటగాళ్లు దేశం తరపున ఆడే మ్యాచ్‌లను వదులుకున్న సంగతి తెలిసిందే' అని అన్నాడు.

Brad Hodge apologises to Virat Kohli, fans for comments against India skipper

'ఈ నేపథ్యంలో కోహ్లీ చివరి టెస్టుకు దూరమవడాన్ని తప్పుబట్టా. అంతేతప్ప కోహ్లీని కించపరచాలని కాదు. నా వ్యాఖ్యలు కోహ్లీతో పాటు భారత క్రికెట్ ఫ్యాన్స్‌ని, జాతీయ జట్టు ఆటగాళ్లను‌ నిరాశపరిచినట్లు ఉన్నాయి. వాటిని వెనక్కి తీసుకుంటున్నా. కోహ్లీకి కూడా క్షమాపణలు తెలియజేస్తున్నా'అని హాగ్ తన ట్విటర్‌లో పోస్టు చేశాడు.

భుజం గాయం తీవ్రత కారణంగా నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ధర్మశాల టెస్టుకు కోహ్లీ దూరమైన సంగతి తెలిసిందే. ఐపీఎల్‌లో ఆడేందుకే ధర్మశాల టెస్టుకు కోహ్లీ దూరమయ్యాడని వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం బ్రాడ్ హాగ్ గుజరాత్‌ లయన్స్‌ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X