రాంచీ టెస్టు: కెప్టెన్‌గా క్లార్క్ రికార్డుని బద్దలు కొట్టిన స్మిత్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: రాంచీ వేదికగా భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టు రెండో రోజైన శుక్రవారం ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. తొలిరోజు తన కెరీర్‌లో 19వ టెస్టు సెంచరీ చేసిన స్మిత్ ఆసీస్‌ను భారీ స్కోరు దిశగా తీసుకెళ్తున్నాడు.

299/4 ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ఇన్నింగ్స్‌ను కొనసాగించిన స్టీవ్ స్మిత్ అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన ఆసీస్ కెప్టెన్‌గా నిలిచాడు. రెండో రోజు 130 పరుగుల వ్యక్తిగత స్కోరును దాటిన అనంతరం ఆసీస్ మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ రికార్డును స్టీవ్ స్మిత్ చెరిపేశాడు.

2012-13 సీజన్‌లో భారత్‌ పర్యటనకు వచ్చిన క్లార్క్ అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన ఆసీస్ కెప్టెన్ అరుదైన ఘనతను సాధించాడు. ఇప్పుడు ఆ రికార్డుని స్టీవ్ స్మిత్ అధిగమించాడు. దీంతో పాటు భారత్లో ఒక సిరీస్‌లో రెండు అంతకంటే ఎక్కువ సెంచరీలు సాధించిన మూడో కెప్టెన్‌గా స్మిత్ గుర్తింపు సాధించాడు.

పూణె టెస్టులో సెంచరీ చేసిన స్మిత్

పూణె టెస్టులో సెంచరీ చేసిన స్మిత్

ఈ సిరీస్‌లో తొలి టెస్టు జరిగిన పూణెలో రెండో ఇన్నింగ్స్‌లో స్మిత్ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. అంతకుముందు ఈ ఘనతను సాధించిన వారిలో క్లైవ్ లాయిండ్(1974-75), అలెస్టర్ కుక్ (2012-13)లు ఉన్నారు. మరోవైపు ఈ సిరిస్‌లో కెప్టెన్‌గా స్మిత్ 5వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఇప్పటివరకు తన కెరీర్‌లో 53 టెస్టు మ్యాచ్‌లాడిన 97 ఇన్నింగ్స్‌ల్లో స్మిత్ అరుదైన ఘనతను సాధించాడు. త

రాంచీ టెస్టులో ఐదు వేల పరుగులు

రాంచీ టెస్టులో ఐదు వేల పరుగులు

ద్వారా టెస్టుల్లో అత్యంత వేగంగా ఐదు వేల పరుగులు పూర్తి చేసిన ఏడో ఆటగాడిగా స్మిత్ రికార్డు సృష్టించాడు. రాంచీ టెస్టు తొలి ఇన్నింగ్స్‌ 57.5వ ఓవర్లో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా వేసిన తొలి బంతిని ఎదుర్కొన్న స్టీవ్ స్మిత్‌ ఒక పరుగు తీసి ఐదు వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. టెస్టు బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్న స్మిత్ 27 సంవత్సరాల 287 రోజుల వయసులో ఈ ఘనత సాధించాడు.

రిక్కీ పాంటింగ్ రికార్డు బద్దలు

రిక్కీ పాంటింగ్ రికార్డు బద్దలు

ఇప్పటి వరకూ ఈ రికార్డు ఆసీస్ మాజీ కెప్టెన్ రిక్కీ పాంటింగ్ పేరిట ఉండేంది. పాంటింగ్ 28 ఏళ్ల 303 రోజుల వయసులో టెస్టుల్లో 5 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. తర్వాతి స్థానాల్లో డాన్ బ్రాడ్‌మ్యాన్ (29 ఏళ్ల 330 రోజులు), అలెన్ బోర్డర్ (29 ఏళ్ల 340 రోజులు)లు ఉన్నారు.

చిన్న వయసులో 5 వేల పరుగులు

చిన్న వయసులో 5 వేల పరుగులు

ఇక మొత్తం ప్రపంచ క్రికెటర్ల విషయానికి వస్తే చిన్న వయసులో 5 వేల పరుగులు పూర్తి చేసుకున్న బ్యాట్స్‌మెన్ రికార్డు క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. సచిన్ 25 ఏళ్ల 298 రోజుల వయసులో ఈ ఘనత సాధించాడు. ఆ తర్వాతి స్థానంలో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ అలెస్టర్ కుక్ (26 ఏళ్ల 9 రోజులు) ఉన్నాడు. అతడి తర్వాత గ్రేమ్ స్మిత్ (27 ఏళ్ల 29 రోజులు), జావెద్ మియాందాద్ (27 ఏళ్ల 242 రోజులు) ఉన్నారు.

English summary
Steve Smith continues to bring up remarkable milestones, having passed 5000 Test runs in Ranchi.
Please Wait while comments are loading...