న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కల నెరవేరింది: దక్షిణాఫ్రికా టు ఇంగ్లాండ్ ఇలా (ఫోటోలు)

కీటన్‌ జెన్నింగ్స్‌.. వయసు ఇరవై నాలుగు. వరుసగా రెండు పరాజయాలతో తీవ్ర ఒత్తిడి మధ్య ముంబై టెస్టులో అడుగుపెట్టిన ఇంగ్లాండ్‌ జట్టులో మళ్లీ కొత్త ఉత్సాహాన్ని నింపాడు.

By Nageshwara Rao

హైదరాబాద్: కీటన్‌ జెన్నింగ్స్‌.. వయసు ఇరవై నాలుగు. వరుసగా రెండు పరాజయాలతో తీవ్ర ఒత్తిడి మధ్య ముంబై టెస్టులో అడుగుపెట్టిన ఇంగ్లాండ్‌ జట్టులో మళ్లీ కొత్త ఉత్సాహాన్ని నింపాడు. అరంగేట్రం చేసి తొలిటెస్టులోనే సెంచరీ సాధించాడు. అంతేకాదు అరంగేట్రంలోనే సెంచరీ చేసిన ఎనిమిదో ఇంగ్లాండ్ ఓపెనర్.

ముంబై టెస్టు: తొలి టెస్టులో సెంచరీ, ఎవరీ కీనట్ జెన్నింగ్స్

మొత్తంగా ఈ ఘనత సాధించిన 19వ ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్. తొలి రోజు ఆట ముగిసిన అనంతరం జెన్నింగ్స్ మీడియాతో మాట్లాడాడు. 'నా కల నెరవేరింది. దేశం తరఫున బరిలోకి దిగిన తొలి మ్యాచ్‌లోనే సెంచరీ సాధించడం మరిచిపోలేని సందర్భం. రెండుసార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న నాకు అదృష్టం కలిసొచ్చింది' అని జెన్నింగ్స్ తెలిపాడు.

కల నెరవేరింది

కల నెరవేరింది

'పరుగుల ఖాతా తెరువకుండానే ఔటయ్యే సందర్భం నుంచి బయటపడి సెంచరీ సాధించడం కలగా భావిస్తున్నా. గురువారం ఉదయం నాకు ఒక కల వచ్చింది. నేను నడుచుకుంటూ వెళ్తుంటే ఈ మ్యాచ్‌లో సెంచరీ సాధిస్తావని నాతో ఎవరో చెప్పినట్టు అనిపించింది. ఒక్కసారిగా ఆగి.. అయ్యో టీమ్‌ బస్‌ మిస్సయ్యానే అనుకుంటున్నాను' అని తెలిపాడు.

 అరంగేట్రం మ్యాచ్‌లో సెంచరీ సాధించాను

అరంగేట్రం మ్యాచ్‌లో సెంచరీ సాధించాను

'ఇంతలో హఠాత్తుగా మెలకువ వచ్చింది. వెంటనే బెడ్‌ మీద నుంచి లేచి టైమ్‌ చూసుకుంటే ఉదయం 5 గంటలైంది. దీంతో కాస్త కుదుటపడ్డాను. ఈరోజు నా కల నిజమైంది. కలగన్నట్టుగానే అరంగేట్రం మ్యాచ్‌లో సెంచరీ సాధించాను' అని ఎంతో సంతోషంగా జెన్నింగ్స్ తెలిపాడు.

నిజానికి తొలి మ్యాచ్‌లో డకౌట్ కావాలి

నిజానికి తొలి మ్యాచ్‌లో డకౌట్ కావాలి

అరంగేట్రం చేసిన తొలి టెస్టులోనే సెంచరీ చేసిన జెన్నింగ్స్ నిజానికి తొలి మ్యాచ్‌లోనే డకౌట్ కావాల్సింది. ఖాతా తెరవకముందే అతను ఉమేశ్‌ యాదవ్‌ బౌలింగ్‌లో ఇచ్చిన క్యాచ్‌ని కరుణ్‌ నాయర్‌ ఎడమవైపు దూకుతూ బంతిని అడ్డుకున్నాడు ఈ క్రమంలో దానిని క్యాచ్‌ రూపంలో ఒడిసి పట్టలేకపోయాడు.

నలుగురు దక్షిణాఫ్రికాలోనే పుట్టినవారే

నలుగురు దక్షిణాఫ్రికాలోనే పుట్టినవారే

ఇంగ్లాండ్ తరఫున తొలి టెస్టులోనే సెంచరీ చేసిన గత ఐదుగురు ఆటగాళ్లలో నలుగురు దక్షిణాఫ్రికాలోనే పుట్టినవారే కావడం విశేషం. అందుకే కీటన్ సెంచరీ తర్వాత ‘మా వ్యవస్థ నుంచి చేజారిపోయిన మరో ప్రతిభావంతుడు' అని దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ కల్లిస్ కొనియాడాడు. దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్‌బర్గ్‌లో పుట్టిన కీటన్, ప్రముఖ కోచ్ రే జెన్నింగ్స్ చిన్న కుమారుడు.

చిన్న కొడుకుని బ్యాట్స్‌మన్‌గా తీర్చిదిద్దిన రే జెన్నింగ్స్

చిన్న కొడుకుని బ్యాట్స్‌మన్‌గా తీర్చిదిద్దిన రే జెన్నింగ్స్

తనలాగే పెద్ద కొడుకు డైలాన్ కూడా వికెట్ కీపింగ్‌నే ఇష్టపడటంతో చిన్నవాడిని మాత్రం కీపింగ్‌కు దూరంగా బ్యాట్స్‌మన్‌గా రే జెన్నింగ్స్ తీర్చిదిద్దారు. వేర్వేరు వయో విభాగాల్లో రాణించి గుర్తింపు తెచ్చుకున్న కీటన్, 2011లో ఇంగ్లండ్‌తో జరిగిన ఏడు వన్డేల సిరీస్‌లో దక్షిణాఫ్రికా అండర్-19 జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు.

ఇంగ్లాండ్‌కు వలస

ఇంగ్లాండ్‌కు వలస

జెన్నింగ్స్ తల్లి ఇంగ్లాండ్ యువతి కావడంతో అతడు ఇంగ్లాండ్‌కు వలసవెళ్లాడు. డర్హమ్ కౌంటీ తరఫున నిలకడగా రాణించిన కీటన్, 2016లో 7 సెంచరీలు సహా 1548 పరుగులు చేసి ఇంగ్లాండ్ జట్టు సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. నిబంధనల ప్రకారం నాలుగేళ్లు పూర్తి చేసుకొని ఇంగ్లాండ్ జట్టు తరఫున ఎంపికయ్యేందుకు అర్హత సాధించాడు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X