న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఛాంపియన్స్ ట్రోఫీ: కోహ్లీసేన బలం, బలహీనతలివే (ఫోటోలు)

జూన్ 1 నుంచి 18 వరకు ఇంగ్లాండ్‌లో ఛాంపియన్ ట్రోఫీ జరగనున్న సంగతి తెలిసిందే. ఐసీసీ వరల్డ్ కప్ తర్వాత అత్యంత ప్రజాకర్షణ కలిగిన టోర్నీల్లో ఇదొకటి.

By Nageshwara Rao

హైదరాబాద్: జూన్ 1 నుంచి 18 వరకు ఇంగ్లాండ్‌లో ఛాంపియన్ ట్రోఫీ జరగనున్న సంగతి తెలిసిందే. ఐసీసీ వరల్డ్ కప్ తర్వాత అత్యంత ప్రజాకర్షణ కలిగిన టోర్నీల్లో ఇదొకటి. ఈ టోర్నీలో టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతుంది.

ఛాంపియన్స్ ట్రోఫీలో మొత్తం 8 జట్లు రెండు గ్రూపులుగా విడిపోయి పోటీ పడుతున్నాయి. తాజాగా ఐసీసీ ప్రకటించిన వన్డే ర్యాంకుల్లో టీమిండియా మూడో స్ధానంలో ఉంది. టీమిండియా తన తొలి మ్యాచ్‌లో భాగంగా దాయాది దేశమైన పాకిస్థాన్‌తో జూన్ 4వ తేదీన తలపడనుంది.

టోర్నీకే ఈ మ్యాచ్ హైలెట్‌గా నిలవనుంది. ఈ క్రమంలో ఛాంపియన్స్‌ ట్రోఫీలో బరిలోకి దిగుతున్న భారత జట్టుకు కెప్టెన్‌ కోహ్లీ, పటిష్టమైన పేస్‌ విభాగం, ఫామ్‌‌లో ఉన్న ఆల్‌ రౌండర్లు బలం కానున్నారు. ఇక టీమిండియా బలాలను, బలహీనతలను ఒక్కసారి పరిశీలిస్తే...

కెప్టెన్ కోహ్లీ

కెప్టెన్ కోహ్లీ

కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా ఇప్పటివరకు 20 వన్డే మ్యాచ్‌లు ఆడగా అందులో 16 నెగ్గింది. ఇక ఇంగ్లాండ్‌ కోహ్లీకి మంచి రికార్డు ఉంది. ఇక్కడ 14 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ ఒక సెంచరీతో 424 పరుగులు చేశాడు. ఈ అనుభవం జట్టుకు కలిసి రానుంది. పదో సీజన్‌లో పెద్దగా రాణించని కోహ్లీ... ఛాంపియన్స్ ట్రోఫీలో సత్తా చాటాలని భావిస్తున్నాడు. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్‌ ధోని సలహాలు కూడా విరాట్ కోహ్లీతో పాటు జట్టుకు లాభం చేకూర్చనున్నాయి.

పటిష్టమైన ఫేస్‌ విభాగం

పటిష్టమైన ఫేస్‌ విభాగం

ఛాంపియన్స్‌ ట్రోఫికి ఎంపికైన పేస్‌ బౌలర్లందరూ ఐపీఎల్‌ అద్భుత ప్రతిభ కనబర్చిన వారు కావడం జట్టు కలిసొచ్చే అంశం. భువనేశ్వర్‌ కుమార్‌ (21) వికెట్లతో టాప్‌‌లో నిలవగా, జస్ప్రిత్‌ బూమ్రా (20), ఉమేశ్‌ యాదవ్‌ (17) లు మంచి ఫామ్‌లో ఉన్నారు. ముఖ్యంగా డెత్‌ ఓవర్ల స్పెషలిస్టుగా బుమ్రా రాణించడం జట్టుకు అదనపు బలం.

ఆల్‌ రౌండర్లు

ఆల్‌ రౌండర్లు

జట్టుకు ఎంపికైన ఆల్‌ రౌండర్లు రవీంద్ర జడేజా, హార్దిక్‌ పాండ్యాలు విరాట్ కోహ్లీకి అదనపు బలంగా చెప్పొచ్చు. ఈ సీజన్‌లో స్వదేశంలో జరిగిన టెస్టు సిరిస్‌లో రవీంద్ర జడేజా అద్భుత ప్రదర్శన చేశాడు. ముఖ్యంగా ఆసీస్‌ టెస్టు సిరీస్‌‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడు. ఇంగ్లాండ్‌లోనే జరిగిన గత చాంపియన్స్‌ ట్రోఫిలో అద్భుత ప్రదర్శన కనబర్చిన జడేజా టైటిల్‌ గెలవడంలో ముఖ్య పాత్ర పోషించాడు. 12 మ్యాచ్‌లాడిన జడేజా 266 పరుగులతో సత్తా చాటడమే కాదు, బౌలింగ్‌లో కూడా 23 వికెట్లు తీశాడు.

బలహీనతలు

బలహీనతలు

ఆల్‌ రౌండర్‌ అశ్విన్‌, పేసర్‌ మహ్మద్‌ షమీ ఫిట్‌నెస్‌లపై అనుమానాలు నెలకొన్నాయి. గాయంతో ఈ సీజన్‌ ఐపీఎల్‌ మొత్తానికి దూరమైన అశ్విన్‌ ధర్మశాల టెస్టు అనంతరం ఒక్క అంతర్జాతీయ మ్యాచ్‌‌లో పాల్గొనకపోవడం భారత్‌ను కొంత కలవరపెడుతుంది. ఇక షమీ ఐపీఎల్‌‌లో రాణించకపోవడం కూడా జట్టుకు ఇబ్బందిగా మారింది. ఢిల్లీ తరుపున 8 మ్యాచ్‌లు ఆడిన షమీ కేవలం 5 వికెట్ల తీసి పరుగులు బాగా సమర్పించుకున్నాడు.

ఫామ్‌లో లేని బ్యాట్స్‌మెన్

ఫామ్‌లో లేని బ్యాట్స్‌మెన్

ప్రపంచంలో అత్యుత్తమ బ్యాటింగ్ లైనప్ కలిగిన జట్లలో టీమిండియా ఒకటి. అయితే ఈ మధ్య కాలంలో భారత బ్యాటింగ్ లైనప్ అంత పటిష్టంగా లేదు. అంతేకాదు ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపికైన ఆటగాళ్లలో కొందరు ఫామ్‌లో లేకపోవడం కూడా జట్టుకి ఇబ్బంది కలిగించే అంశమే. ఐపీఎల్‌లో భారత్‌ బ్యాట్స్‌‌మెన్‌ ఏ ఒక్కరు టాప్‌లో లేరు.

భారత ట్రంప్ కార్డు

భారత ట్రంప్ కార్డు

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో జస్ప్రీత్ బుమ్రాని భారత ట్రంప్ కార్డుగా క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా బుమ్రా అద్బుతమైన ప్రదర్శన చేస్తున్నాడు. దేశవాళీతో పాటు అంతర్జాతీయ క్రికెట్‌లో కూడా బుమ్రా రాణించడం జట్టుకు లాభించే విషయమే. ముఖ్యంగా బుమ్రాకు డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌గా పేరుంది.

ఛాంపియన్స్ ట్రోఫికి భారత జట్టు

ఛాంపియన్స్ ట్రోఫికి భారత జట్టు

Virat Kohli (captain), Shikhar Dhawan, Rohit Sharma, Ajinkya Rahane, Yuvraj Singh, MS Dhoni (wk), Kedar Jadhav, Dinesh Karthik (wk), Ravindra Jadeja, R Ashwin, Jasprit Bumrah, Bhuvneshwar Kumar, Hardik Pandya, Umesh Yadav, Mohammed Shami

ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా షెడ్యూల్

ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా షెడ్యూల్

June 4: India v Pakistan, Birmingham, 3:00 PM IST (Group B)

June 8: India v Sri Lanka, London, 3:00 PM IST (Group B)

June 11: India v South Africa, London, 3:00 PM IST (Group B)

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X