న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్-పాక్ మ్యాచ్‌పై యాడ్: వైరల్‌గా మారిన యువకుడి వీడియో

భారత్, పాకిస్థాన్ మ్యాచ్ అంటే యావత్ ప్రపంచం ఆసక్తిగా తిలకిస్తుంది. ఈ రెండు జట్ల మధ్య గత ఐసీసీ వరల్డ్ కప్, టీ20ల మ్యాచ్‌ల సందర్భంగా విడుదలైన ‘మోకా- మోకా’ సిరీస్‌ వీడియోలు భారత్‌లో సంచలనం సృష్టించాయి.

By Nageshwara Rao

హైదరాబాద్: భారత్, పాకిస్థాన్ మ్యాచ్ అంటే యావత్ ప్రపంచం ఆసక్తిగా తిలకిస్తుంది. ఈ రెండు జట్ల మధ్య గత ఐసీసీ వరల్డ్ కప్, టీ20ల మ్యాచ్‌ల సందర్భంగా విడుదలైన 'మోకా- మోకా' సిరీస్‌ వీడియోలు భారత్‌లో ఎంత సంచలనం సృష్టించాయో మనందరికీ తెలిసిందే.

<strong>ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ: 8 జట్ల పూర్తి వివరాలు</strong>ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ: 8 జట్ల పూర్తి వివరాలు

తాజాగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో జూన్ 4వ తేదీన భారత్-పాకిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. ఈ టోర్నీలో భారత్ డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతుంది. ఈ మ్యాచ్ ఎడ్జిబాస్టన్‌లో జరగనుంది. దాదాపు ఏడాది తర్వాత ఇరు జట్లు ఓ అంతర్జాతీయ టోర్నీలో ఢీకొంటున్నాయి.

Champions Trophy 2017: 'Sabse Bada Moh' ad on India-Pakistan clash is a must watch

భారత్-పాక్ మ్యాచ్‌కి సంబంధించిన టిక్కెట్లు అయిపోయినట్లు ఇప్పటికీ ఐసీసీ ఛాంపియన్స ట్రోఫీ నిర్వాహకులు తెలిపారు. ఈ నేపథ్యంలో స్టార్‌స్పోర్ట్స్‌ రూపొందించిన యాడ్ క్యాంపెయిన్ క్రికెట్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

<strong>కివీస్‌తో కోహ్లీసేన తొలి వార్మప్ మ్యాచ్: ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్</strong>కివీస్‌తో కోహ్లీసేన తొలి వార్మప్ మ్యాచ్: ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్

ఈ యాడ్ క్యాంపెయిన్‌కి "#SabseBadaMoh" అని నామకరణం చేశారు. ఈ యాడ్ క్యాంపెయిన్ ఇలా ఉంది. కోటీశ్వరుడైన ఓ బిజినెస్ మ్యాన్ బౌద్ధ సన్యాసిగా మారాలనుకుంటాడు. తన భవంతి, కారు, బోటు, వ్యాపారం, ఆస్తిపాస్తులు అన్నీ తనకింద పనిచేసే వారికి ఇస్తాడు.

ఆ తర్వాత బౌద్ధ గురువు వద్దకు వెళ్లిన తర్వాత క్షవరం చేసేందుకు తలపై కత్తి పెడుతుండగా అతడికి జూన్‌ 4న మ్యాచ్‌ ఉన్న సంగతి పేపర్‌ ప్రకటనలో కనిపిస్తుంది. అప్పుడు ఆ యువకుడు ఏం చేశాడో తెలుసుకోవాలంటే వీడియోని చూడాల్సిందే.

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X