కోట్ల 'కోటీశ్వరుడైన' కోహ్లీ: ఖాతాలో మరో రూ. 100 కోట్ల డీల్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: మోడ్రన్ క్రికెట్ దిగ్గజాల్లో ఒకడైన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రూ.100 కోట్ల డీల్‌ చేరింది. 8 సంవత్సరాల కాలానికి తమ ఉత్పత్తులను ప్రచారం చేసి పెట్టేందుకు ప్రముఖ టైర్ల సంస్థ ఎంఆర్ఎఫ్ కోహ్లీతో రూ. 100 కోట్ల ఒప్పందాన్ని పునరుద్ధరించుకుంది.

8 ఏళ్ల కాలానికి రూ.100 కోట్ల విలువైన ఒప్పందం

8 ఏళ్ల కాలానికి రూ.100 కోట్ల విలువైన ఒప్పందం

1990, 2000 దశకంలో వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా, సచిన్ టెండూల్కర్‌లకు స్పాన్సర్ చేసిన ఎంఆర్ఎఫ్, ప్రస్తుతం టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్, దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డివిలియర్స్‌లను స్పాన్సర్ చేస్తోంది. ఇంతకముందు కోహ్లీ పూమా సంస్థతో 8 ఏళ్ల కాలానికి రూ.100 కోట్ల విలువైన ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.

ఈ ఏడాది కోహ్లీకి ఇది రెండో 100 కోట్ల డీల్

ఈ ఏడాది కోహ్లీకి ఇది రెండో 100 కోట్ల డీల్

ఈ ఏడాది కోహ్లీకి ఇది రెండో 100 కోట్ల డీల్ కావడం విశేషం. కాగా ఇటీవలే ఫోర్బ్స్ ఫోర్బ్స్‌ విడుదల చేసిన ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ఆదాయం ఆర్జిస్తున్న టాప్‌ 100 క్రీడాకారుల జాబితాలో కోహ్లీ 89వ స్థానాన్ని దక్కించుకున్నాడు. తాజాగా ఎంఆర్ఎఫ్ డీల్‌తో కోహ్లీ తన ర్యాంకుని మరింత మెరుగుపరచుకోనున్నాడు.

పెప్సీకో తీవ్ర ప్రయత్నాలు

పెప్సీకో తీవ్ర ప్రయత్నాలు

ఇదిలా ఉంటే ఇటీవలే పెప్సీకోతో తన ఒప్పందాన్ని తెంచుకున్నానని కోహ్లీ ప్రకటించాడు. భారీ మొత్తం చెల్లించి కోహ్లీతో డీల్ కుదుర్చుకోవాలని పెప్సీకో తన ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, తాను సేవించని శీతల పానీయాలకు ప్రచారం చేయలేనని కోహ్లీ తెగేసి చెప్పిన సంగతి తెలిసిందే.

రెండో సెమీ పైనల్‌లో బంగ్లాతో ఢీ

రెండో సెమీ పైనల్‌లో బంగ్లాతో ఢీ

ప్రస్తుతం కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడుతోంది. జూన్‌ 15న టీమిండియా...బంగ్లాదేశ్‌తో తలపడుతుంది. ఛాంపియన్స్‌ ట్రోఫీ లీగ్‌ ప్రారంభానికి ముందు నిర్వహించిన వార్మప్ మ్యాచ్‌ల్లో బంగ్లాదేశ్‌పై టీమిండియా ఘన విజయం సాధించింది.

English summary
Virat Kohli will be getting more than Rs. 100 crores for 8 years under contract . Previously, Kohli received Rs. 8 crores for sporting MRF’s name on his weapon and for endorsing their product for three years. On an average, it was less than Rs. 3 crores per year.
Please Wait while comments are loading...