న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పాక్‌పై భారత్ ఘన విజయం: క్రికెటర్లు ఇలా స్పందించారేంటి?

By Nageshwara Rao

హైదరాబాద్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఎడ్జిబాస్టన్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 124 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌ ప్రారంభం నుంచే టీమిండియా తన ఆధిపత్యాన్ని కొనసాగించింది.

ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్ , ఫోటోలు , స్కోరు కార్డు

ప్రత్యర్ధి జట్టు ఏ దశలో కూడా సత్తా చాటలేకపోయింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోహ్లీసేన 48 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 319 పరుగులు చేసింది. ఆ తర్వాత భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ మ్యాచ్‌కి వర్షం అడ్డంకిగా మారింది.

Champions Trophy: Cricketers react to India's win over Pakistan

వర్షం కారణంగా డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో 41 ఓవర్లకు 289 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. ఈ లక్ష్య చేధనలో 33.4 ఓవర్లలో 164 పరుగులకే పాక్‌ ఆలౌట్‌ అయింది. 32 బంతుల్లో 53 పరుగులు చేసిన యువీకి మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ లభించింది.

ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌లు అద్భుత మైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఛాంపియన్స్ ట్రోఫీలో వీరిద్దరూ తొలి వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యాన్ని మూడోసారి నెలకొల్పి అరుదైన రికార్డుని సాధించారు. పాక్‌పై తొలి వికెట్‌కు 136 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

ఆ తర్వాత క్రీజులోకి దిగిన కెప్టెన్ కోహ్లీ, యువరాజ్ సింగ్‌లు అద్భుత ప్రదర్శన చేయడంతో టీమిండియా 300కు పైగా పరుగులు చేసింది. చివరి ఓవర్‌లో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా మూడు బంతుల్లో మూడు హ్యాట్రిక్ సిక్సులతో చెలరేగాడు.

ఈ విజయంతో టీమిండియాపై క్రికెట్ అభిమానులు ప్రశంసల వర్షం కురిపించారు. అభిమానులు కోహ్లీసేన విజయంపై స్పందించారు. వారి ఆనందాన్ని సోషల్‌మీడియా ద్వారా ఇతరులతో పంచుకున్నారు.

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X