న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అంతా బౌలర్ల వల్లే: సెమీస్ బెర్తుపై ఇంగ్లాండ్ కెప్టెన్

న్యూజిలాండ్‌పై విజయం సాధించడంలో ఇంగ్లాండ్ బౌలర్లు సమిష్టిగా రాణించారని కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ పేర్కొన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా కార్డిఫ్ వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై 87 పరు

By Nageshwara Rao

హైదరాబాద్: న్యూజిలాండ్‌పై విజయం సాధించడంలో ఇంగ్లాండ్ బౌలర్లు సమిష్టిగా రాణించారని కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ పేర్కొన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా కార్డిఫ్ వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై 87 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్ | ఫోటోలు | స్కోరు కార్డు

అంతేకాదు టోర్నీలో వరుసగా రెండో విజయం సాధించి సెమీస్‌కు అర్హత సాధించిన తొలి జట్టుగా ఇంగ్లాండ్ నిలిచింది. దీంతో, 4 పాయింట్లతో సెమీస్‌ బెర్తు సాధించింది. గ్రూప్‌-ఎలో మిగతా జట్లలో 4 పాయింట్లు సాధించే అవకాశం ఒక్క ఆస్ట్రేలియాకు మాత్రమే ఉండటంతో ఇంగ్లాండ్‌‌కు సెమీస్‌ బెర్తు ఖాయమైంది.

Champions Trophy: Eoin Morgan lauds 'outstanding' England bowling attack

మ్యాచ్ అనంతరం కెప్టెన్ మోర్గాన్ మీడియాతో మాట్లాడాడు. ఇటీవల కాలంలో ఇంగ్లాండ్ 300కు పైగా పరుగులు చేస్తున్న తరుణంలో ఈ మ్యాచ్‌లో 10 లేదా 15 పరుగులు తక్కువ అవుతాయని తాను భావించినట్లు మోర్గాన్ తెలిపాడు. ఈ మ్యాచ్‌లో వుడ్ అద్భుత ప్రదర్శన చేశాడని కొనియాడాడు.

ఇక బౌలర్లు కూడా తమ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారని మోర్గాన్ ప్రశంసలు కురిపించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 49.3 ఓవర్లలో 310 పరుగులు చేసి అలౌటైంది. ఇంగ్లాండ్ ఆటగాళ్లలో జో రూట్‌ (64), జోస్‌ బట్లర్‌ (61 నాటౌట్‌), అలెక్స్‌ హేల్స్‌ (56) పరుగులతో అర్ధసెంచరీలు చేశారు.

బెన్‌స్టోక్స్‌ (48; 53 బంతుల్లో 4 ఫోర్లు 2 సిక్సులు) పరుగులతో ఆకట్టుకున్నారు. 311 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌కు మంచి అవకాశం లభించినా సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఓపెనర్‌ రాంకి (0) ఆరంభంలోనే వెనుదిరిగినా.. మరో ఓపెనర్‌ గప్తిల్‌ (27), రాస్‌ టేలర్‌ (39)లతో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పారు.

<strong>కివీస్‌పై ఘన విజయం: సెమీస్‌కు చేరిన తొలి జట్టుగా ఇంగ్లాండ్</strong>కివీస్‌పై ఘన విజయం: సెమీస్‌కు చేరిన తొలి జట్టుగా ఇంగ్లాండ్

ఇక కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ (87; 98 బంతుల్లో 8 ఫోర్ల)తో చక్కని పోరాటం చేశాడు. అతడు ఉన్నంత సేపు కివీస్ లక్ష్యం వైపు సాగింది. 30 ఓవర్లకు 158/2తో కివీస్‌ లక్ష్యం దిశగా సాగింది. ఆ తర్వాత విలియమ్స్ నిష్క్రమణతో అంతా మారిపోయింది. ఇంగ్లాండ్‌ బౌలర్లు వరుసగా వికెట్లు తీసి కివీస్‌ను లక్ష్యానికి దూరం చేశారు.

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X