న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇంగ్లాండ్‌లో ధావన్ రికార్డు: భారత్-పాక్ మ్యాచ్ స్టాటస్టికల్ హైలెట్స్

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఎడ్జిబాస్టన్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 124 పరుగుల తేడాతో భారత్‌ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

By Nageshwara Rao

హైదరాబాద్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఎడ్జిబాస్టన్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 124 పరుగుల తేడాతో భారత్‌ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోహ్లీసేన 48 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 319 పరుగులు చేసింది.

ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్, ఫోటోలు , స్కోరు కార్డు

ఆ తర్వాత భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ మ్యాచ్‌కి వర్షం అడ్డంకిగా మారింది. వర్షం కారణంగా డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో 41 ఓవర్లకు 289 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. ఈ లక్ష్య చేధనలో 33.4 ఓవర్లలో 164 పరుగులకే పాక్‌ ఆలౌట్‌ అయింది. 32 బంతుల్లో 53 పరుగులు చేసిన యువీకి మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ లభించింది.

Champions Trophy: Statistical highlights from India-Pakistan match

భారత్-పాక్ మ్యాచ్ స్టాటస్టికల్ హైలెట్స్:

* పాక్‌పై భారత్ 124 పరుగుల తేడాతో ఘన విజయం. ఈ విజయం వన్డేల్లో భారత్‌కు రెండో అతి పెద్ద విజయం. 2008లో ఢాకా వేదికగా జరిగిన మ్యాచ్‌లో పాక్‌పై భారత్ 140 పరుగుల తేడాతో నెగ్గింది.
* ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్‌కు ఇది అతి పెద్ద విజయం. ఇంతకముందు ఇదే టోర్నీలో సెప్టెంబర్ 11, 2004న కెన్యాపై భారత్ 98 పరుగుల తేడాతో నెగ్గింది.
* ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2017లో భారత్ చేసిన 319 పరుగులే ఇప్పటివరకు అత్యధికం. జూన్ 1న బంగ్లాపై ఇంగ్లాండ్ 308 పరుగులు చేసింది.
* టీమిండియా నమోదు చేసిన 319 పరుగులు ఛాంపియన్స్ ట్రోఫీలో రెండో అత్యధికం. అంతకముందు 2013లో కార్డిఫ్‌లో దక్షిణాఫ్రికా 331 పరుగులు చేసింది.
* ఇంగ్లాండ్‌లో జరిగిన వన్డేల్లో ఓపెనర్ శిఖర్ ధావన్ అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లాండ్ వేదికగా ఆడిన 10 ఇన్నింగ్స్‌ల్లో 586 పరుగులు నమోదు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, మూడు అర్ధసెంచరీలు ఉన్నాయి.
* రోహిత్ శర్మ-శిఖర్‌‌లు తొలి వికెట్‌కు 136 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించారు. దీంతో మొత్తంగా ఛాంపియన్స్ ట్రోఫీలో మూడో సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు.
* తద్వారా అత్యధిక సెంచరీల భాగస్వామ్యాలు నమోదు చేసిన జోడిగా అరుదైన ఘనత సాధించారు. వీరి తర్వాత క్రిస్ గేల్-చందర్ పాల్(వెస్టిండీస్), గిబ్స్-గ్రేమ్ స్మిత్(దక్షిణాఫ్రికా)లు రెండేసి సెంచరీ భాగస్వామ్యాలతో సంయుక్తంగా రెండో స్థానంలో కొనసాగుతున్నారు.
* ఇంగ్లాండ్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ (91) తన కెరీర్‌లోనే అత్యధిక స్కోరు నమోదు చేశాడు.
* ఇంగ్లాండ్‌లో జరిగిన ఎనిమిది ఇన్నింగ్స్‌ల్లో రోహిత్ శర్మ నాలుగు అర్ధసెంచరీలు (పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, వెస్టిండిస్, ఇంగ్లాండ్) నమోదు చేశాడు.
* పాకిస్థాన్‌పై రోహిత్ శర్మ నమోదు చేసిన అర్ధసెంచరీ తన కెరీర్‌లో 30వ అర్ధ సెంచరీ కావడం విశేషం.
* 29 బంతుల్లో యువరాజ్ సింగ్ అర్ధసెంచరీ సాధించాడు. వన్డేల్లో యువీకి ఇది 52వ అర్ధసెంచరీ.
* ఛాంపియన్స్ ట్రోఫీలో ఓ భారతీయ బ్యాట్స్‌మెన్ అత్యంత వేగంగా సాధించిన అర్ధసెంచరీ.

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X