న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

క్రికెట్లో చైనామ్యాన్: అప్పట్లో ఒక్కడుండేవాడు, ఇప్పుడు కుల్దీప్

భారత క్రికెట్ చరిత్రలో చైనా మ్యాన్ సంచలనం సృష్టించాడు. అతను కులదీప్ యాదవ్. క్రికెట్‌లో చైనా మ్యాన్ అంటే ఏమిటి, ఆ పేరు ఎలా వచ్చింది....

By Pratap

ధర్మశాల: ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్‌ తొలి రోజు ఆటలో నాలుగు వికెట్లు తీసిన భారత బౌలర్ కుల్దీప్ యాదవ్ విశేషంగా చర్చలోకి వచ్చాడు. ఇది అతని తొలి టెస్ట్ మ్యాచ్ కావడమే అతను చర్చలోకి వచ్చాడని కాదు, భారత క్రికెట్‌లో అతను చైనామ్యాన్.

డేవిడ్ వార్నర్(56), పీటర్ హ్యాండ్స్‌కోంబ్(8), గ్లేన్ మాక్స్‌వెల్(8), ప్యాట్ కమ్మిన్స్(21)ను కుల్దీప్ యాదవ్ ఔట్ చేసి సత్తా చాటాడు. కుల్దీప్ యాదవ్ ఎడమ చేతితో లెగ్ స్పిన్ వేస్తున్నాడు. ఇలాంటి బౌలర్లను లెఫ్ట్ ఆర్మ్ అన్‌ ఆర్థోడాక్స్ స్పిన్నర్‌గా పిలుస్తారు. అయితే 'చైనామ్యాన్' అని కూడా అంటారు.

వీరి బౌలింగ్ కుడి చేత్తో ఆఫ్ స్పిన్ వేసే బౌలర్ బౌలింగును పోలి ఉంటుంది. బంతిని వేళ్లతో స్పిన్ చేయడానికి బదులు ఎడమ చేతి మణికట్టుతో స్పిన్ చేస్తారు. 85 ఏళ్ల భారత క్రికెట్ చరిత్రలో ఇంతకు ముందు ఒక్కడంటే ఒక్కడే ఉండేవాడు. అయితే, బిషన్ సింగ్ బేడీ కారణంగా అతనికి జాతీయ జట్టులో స్థానం లభించలేదు.

Chinaman in Indian cricket: Kuldeep Yadav


అంతర్జాతీయ క్రికెట్‌లో చైనా మేన్ ఇప్పటివరకూ 28 మంది ఆ విధమైన బౌలర్లు ఉన్నారు. దీంతో కుల్దీప్ యాదవ్ భారత్‌ తరుపున అంతర్జాతీయ క్రికెట్ ఆడిన మొట్టమొదటి ఆటగాడయ్యాడు. ఆసియా తరుపున కూడా మొదటి బౌలర్. ఇలాంటి ప్రత్యేకత ఉన్న బౌలర్లలో ప్రముఖులు ఆస్ట్రేలియాకు చెందిన బ్రాడ్ హాగ్, మైఖేల్ బీవాన్, సౌతాఫ్రికాకు చెందిన పాల్ ఆడమ్, వెస్టిండీస్‌కు చెందిన సర్ గ్యారీ సోబర్స్, ఇంగ్లండ్‌కు చెందిన జానీ వర్డ్‌లే, డెనీస్ కాంప్టన్ ఉన్నారు.

చైనామ్యాన్ బౌలర్ ప్రత్యేకత ఏమిటి...

క్రికెట్‌లో చైనామ్యాన్ అనే పేరు ఎలా వచ్చింది. ఇంతకు ముందు జాతీయ జట్టులో స్థానం లభించని భారత చైనా మ్యాన్ ఎవరు అనే విషయాలను క్రికెట్ క్రీడా విశ్లేషకుడు సిహెచ్. వెంకటేష్ ఓ ఆర్టికల్ రాశారు. ఆయన దేశవ్యాప్తంగా ప్రఖ్యాతి వహించిన క్రికెట్ విశ్లేషకుల్లో ఒకరు.

ఆయన ఆర్టికల్ ఆధారంగా - కొత్త కుర్రాడు కులదీప్ యాదవ్ రంగంలోకి వచ్చాక చైనామన్ బౌలర్ అనే పదం అందరూ తరచుగా వాడుతున్నారు. సాధారణంగా లెఫ్టార్మ్ స్పిన్నర్లంటే ఎడమ చేతి వాటం ఆఫ్ స్పిన్ బౌలర్లే. కానీ చాలా అరుదుగా ఎదమ చేత్తో లెగ్ స్పిన్ బౌలింగ్ చేసే వారు ఎదురవుతారు. వారే ఈ చైనామన్ బౌలర్లు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే షేన్ వార్న్ గానీ అనిల్ కుంబ్లే కానీ బౌలింగ్ చేయడాన్ని అద్దంలో చూస్తే చైనామన్ బౌలర్ మన కళ్ళ ముందుంటాడన్న మాట. ఆఫ్ స్పిన్నర్లందరు తమ వేళ్ళు ఉపయోగించి బంతిని స్పిన్ తిప్పుతారు. మామూలు ఎడమ చేతి వాటం స్పిన్నర్లు కూడా అంతే.

కానీ, కుడి చేత్తో బౌలింగ్ చేసే లెగ్ బ్రేక్, గుగ్లీ బౌలర్ల మాదిరిగానే చైనామన్ బౌలర్లు కూడా మణికట్టు కదలికలతో బంతిని సుడి తిప్పుతారు. అన్నట్టు, వీళ్ళు కూడా మధ్య మధ్యలో 'గుగ్లీ' లు సంధిస్తుంటారు. మామూలు లెఫ్టార్మ్ స్పిన్నర్ బంతి లెగ్ స్టంప్ వైపు నుంచి ఆఫ్ స్టంప్ వైపు స్పిన్ తిరుగుతుంది (రైట్హ్యాండ్ బ్యాట్స్మన్కు). కానీ చైనామన్ బౌలర్ వేసే బంతి ఆఫ్ స్టంప్ నుంచి లెగ్ స్టంప్ వైపు వెళ్తుంది.

ఆ పేరు ఎలా వచ్చింది...

1930 దశకంలో వెస్టిండీస్ తరఫున ఆడిన చైనా సంతతి బౌలర్ ఎల్లిస్ చాంగ్ వల్ల చైనామన్ బౌలింగ్‌కు ఆ పేరు వచ్చింది. చైనా సంతతికి చెందిన చాంగ్‌కు పూర్వం కూడా ఈ తరహా బౌలింగ్ వుండేది కానీ ఆ చైనీయుడితోనే ఈ బౌలింగ్ పాప్యులర్ అయింది. 1933 ఓల్డ్ ట్రాఫోర్డ్ టెస్ట్లో చాంగ్ వెరైటీ బౌలింగ్ అర్ధంగాక వాల్టర్ రాబిన్స్ ఆనే ఇంగ్లండ్ ఆటగాడు స్టంప్ ఔట్ అయ్యాడు. 'ఆఖరికి ఓ చైనావాడికి దొరికిపోయానే' అని రాబిన్స్ చేసిన వ్యాఖ్య తోనే ఈ బౌలింగ్‌కు 'చైనామన్ ' అన్న పేరు వచ్చింది.

అప్పట్లో హైదరాబాదీయే, గవాస్కర్ గుర్తు చేసుకున్నాడు

మన దేశంలో చైనామన్ బౌలర్లు అరుదు. అయితే మన హైదరాబాదీ ముంతాజ్ హుస్సైన్ ఒక్కడే వెంటనే గుర్తుకొచ్చే పేరు. ఈ టైపు బౌలింగ్‌తో ఒకప్పుడు అతను బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెట్టేవాడు. 1966-1978 మధ్య హైదరాబాద్ తరఫున రంజీ ట్రోఫీలో ఆడిన ముంతాజ్, 69 ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో మొత్తం 213 వికెట్లు పడగొట్టాడు.(బౌలింగ్ సగటు 20 లోపే).

అయితే యూనివర్సిటీ స్థాయిలో ఆడేటప్పుడు ముంతాజ్ మరింత వెరైటీతో బౌలింగ్ చేసేవాడు. 1966-67 సంవత్సరం రోహింటన్ బారియా టోర్నమెంట్లో 48 వికెట్లు పడగొట్టి ఉస్మానియా యూనివర్సిటీకి తొలిసారి ఆ ట్రోఫీ గెలిపించిపెట్టాడు.

ఆ టోర్నమెంట్ ఫైనల్లో బొంబాయి యూనివర్సిటీ తరఫున ఆడిన సునిల్ గవాస్కర్‌కు కూడా ముంతాజ్ హుస్సైన్ బౌలింగ్ ఏ మాత్రం కొరుకుడు పడలేదు. తన ఆత్మ కథ 'సన్నీ డేస్ ' పుస్తకంలో ఈ విషయాన్ని గవాస్కర్ ప్రత్యేకంగా ప్రస్తావించాడు. అయితే బిషన్ సింగ్ బేడి సమకాలీనుడు కావడంతో ముంతాజ్కు టెస్ట్ చాన్స్ రాలేదు.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X