న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఫ్లింటాఫ్! వయాగ్రా వాడేవాడివి.. నువ్వా చెప్పేది: గేల్ బూతులు

మెల్‌బోర్న్‌: వెస్టిండీస్ సిక్సర్ల వీరుడు క్రిస్ గేల్ మరోసారి తన నోటికి పని చెప్పాడు. ఈసారి తీవ్ర స్థాయిలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. కొన్ని నెలల కిందట బిగ్‌బాష్‌ టీ20 లీగ్‌ సందర్భంగా మ్యాచ్‌ మధ్యలో తనను ఇంటర్వ్యూ చేస్తున్న అమ్మాయితో షికారుకెళ్దామా అంటూ గేల్‌ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపిన విషయం తెలిసిందే.

కాగా, ఇయాన్‌ చాపెల్‌, ఆండ్రూ ప్లింటాఫ్‌ తదితరులు ఆ వ్యాఖ్యలపై విమర్శలు గుప్పించారు. గేల్‌కు అతడి జట్టు 10 వేల డాలర్ల జరిమానా కూడా విధించింది. ఓ దశలో అతణ్ని లీగ్‌కు దూరం పెట్టే ఆలోచన కూడా చేసింది క్రికెట్‌ ఆస్ట్రేలియా.

అయితే, అప్పటి తన వ్యాఖ్యలపై త్వరలో విడుదల కానున్న ఆత్మకథలో వివరణ ఇస్తూ.. విమర్శకులపై విరుచుకుపడ్డాడు గేల్‌. 'ప్రస్తుతం మనం టీ20ల యుగంలో ఉన్నాం. ఇది టెస్టు క్రికెట్‌ కాదు. ఇప్పుడు ఏదైనా భిన్నంగా చేయాలి. నేను సరదాగా జోక్‌ చేశానంతే. ఎవరినో అగౌరవపరచాలని కాదు' అని పేర్కొన్నాడు.

Chris Gayle blasts Ian Chappell, Andrew Flintoff over sexism criticism

అంతేగాక, 'మ్యాచ్‌ల మధ్యలో వయాగ్రా మాత్రలు వాడే ఫ్లింటాఫ్‌ నాకు పాఠాలు చెప్పడమేంటి? అతనెప్పుడైనా నాకు షార్ట్‌ పిచ్‌ బంతి వేస్తే అది బ్యాక్‌వర్డ్‌ పాయింట్లో బౌండరీగా తేలేది. అతనో పిల్లవాడు. ఇక వెస్టిండీస్‌లో క్రికెట్‌ ఆడుతూ ఓ అధికారిని కొట్టి దోషిగా తేలిన ఇయాన్‌ చాపెల్‌ నన్ను క్రికెట్‌ నుంచి నిషేధించాలని డిమాండ్‌ చేస్తాడా? అతను మొత్తం క్రికెట్‌నే నిషేధించాలని కూడా అనగలడు' అని గేల్‌ విమర్శలు గుప్పించాడు.

తానో టెస్టు మ్యాచ్‌ సందర్భంగా వయాగ్రా మాత్రలు వాడి చాలా ఇబ్బంది పడ్డానని ఫ్లింటాఫ్‌ గతంలో అన్న నేపథ్యంలో గేల్‌ ఇలా చురకలంటించాడు. ఇది ఇలా ఉండగా, క్రిస్ రోజర్స్ పైనా తీవ్ర వ్యాఖ్యలు చేశాడు గేల్. తన గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకునేది లేదని అన్నారు. తాను ఎక్కువగా బార్లలోనే గడుపుతానని అతను ఎలా అంటాడని నిలదీశాడు. మరోసారి తనపై ఆరోపణలు చేస్తే అతని నోట్లో చుయింగ్ గమ్ బదులు క్యారెట్ ఉంటుందని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X