న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సెక్సిస్ట్ వ్యాఖ్యలు: ఐపిఎల్‌ల్లోనూ గేల్ చిక్కులు!

బెంగళూరు: వెస్టిండీస్ విధ్వంక ఆటగాడు తన ఆటతోనే గాక తన సెక్సిస్ట్ వ్యాఖ్యలతో ఎక్కువ ప్రచారం పొందుతున్నాడు. అంతేగాక, తన అభ్యంతకర వ్యాఖ్యలతో ఇక్కట్లను కూడా కోరితెచ్చుకుంటున్నాడు. అయినా అతని ప్రవర్తనలో మార్పు రాకపోవడం విచారకరం.

గతంలో బిగ్‌ బాష్ లీగ్‌(బీబీఎల్‌) సందర్భంగా టీవీ యాంకర్‌ను డేటింగ్‌కు వస్తావా? అని ప్రత్యక్ష ప్రసారంలో అడిగి ఇబ్బందులు కొనితెచ్చుకున్న గేల్‌.. తాజాగా బ్రిటన్‌ మహిళా జర్నలిస్టుతో అసభ్యంగా ప్రవర్తించాడు. కాగా, ఆస్ట్రేలియా యాంకర్‌ మెల్‌ మెక్‌లాలిన్‌‌తో అసభ్యంగా ప్రవర్తించినందుకు బీబీఎల్‌‌లో మెల్‌బోర్న్‌ జట్టు తరఫున అతని కాంట్రాక్టును పునరుద్ధరించేందుకు ఆస్ట్రేలియా నిరాకరించింది.

తమ జర్నలిస్టుతో అభ్యంతరకరంగా మాట్లాడినందుకు ఇంగ్లాండ్‌ కూడా అతని చర్యలు తీసుకొనేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్‌)లోనూ క్రిస్‌ గేల్‌కు చిక్కులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. నిత్యం అసభ్యకర వ్యాఖ్యలతో వివాదాస్పదుడిగా మారిన గేల్‌పై ఐపీఎల్‌లోనూ చర్యలు తీసుకునే అవకాశముందని ఐపీఎల్‌ చైర్మన్‌ రాజీవ్ శుక్లా సంకేతాలు పంపారు.

Chris Gayle the 'Romeo' May Invite IPL Sanction: Report

భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) బెంగళూరు రాయల్‌ ఛాలెంజర్స్‌ తరఫున ఆడుతున్న గేల్‌ విషయంలో ఆంక్షలు కొరఢా ఝళిపించే అవకాశముందని శుక్లా చెప్పారు. 'ఆటగాళ్లు సభ్యతతో ప్రవర్తించాల్సిన అవసరముంది. టోర్నమెంటు జరుగుతున్నప్పుడు ఆటగాళ్లు ప్రవర్తనా నియామళికి లోబడి సభ్యంగా నడుచుకుంటారని మేం భావిస్తాం' అని తెలిపారు.

అంతేగాక, 'లీగ్‌ ప్రతిష్టను ఆటగాళ్లు కాపాడాల్సిన అవసరముంది. బహిరంగంగా అతను(కోహ్లీ) ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పూర్తి అవాంఛనీయం. ఈ విషయాన్ని బీసీసీఐ దృష్టికి తీసుకెళుతాం' అని శుక్లా ఓ ఇంగ్లీష్ డెయిలీకి తెలిపారు. మరోవైపు ఇది ఇద్దరు విదేశీయుల మధ్య జరిగిన అంశమే అయినా.. ఎవరైనా ఫిర్యాదు చేస్తే ఈ విషయంలో చర్యలు తీసుకుంటామని బీసీసీఐ కార్యదర్శి అజయ్‌ షిర్కే స్పష్టం చేశారు.

ఇటీవల గేల్ చేసిన అభ్యంతరక వ్యాఖ్యలను గమనించినట్లమితే.. 'ప్రస్తుతం మనం టీ20ల యుగంలో ఉన్నాం. ఇది టెస్టు క్రికెట్‌ కాదు. ఇప్పుడు ఏదైనా భిన్నంగా చేయాలి. నేను సరదాగా జోక్‌ చేశానంతే. ఎవరినో అగౌరవపరచాలని కాదు' అని పేర్కొన్నాడు.

అంతేగాక, 'మ్యాచ్‌ల మధ్యలో వయాగ్రా మాత్రలు వాడే ఫ్లింటాఫ్‌ నాకు పాఠాలు చెప్పడమేంటి? అతనెప్పుడైనా నాకు షార్ట్‌ పిచ్‌ బంతి వేస్తే అది బ్యాక్‌వర్డ్‌ పాయింట్లో బౌండరీగా తేలేది. అతనో పిల్లవాడు. ఇక వెస్టిండీస్‌లో క్రికెట్‌ ఆడుతూ ఓ అధికారిని కొట్టి దోషిగా తేలిన ఇయాన్‌ చాపెల్‌ నన్ను క్రికెట్‌ నుంచి నిషేధించాలని డిమాండ్‌ చేస్తాడా? అతను మొత్తం క్రికెట్‌నే నిషేధించాలని కూడా అనగలడు' అని గేల్‌ విమర్శలు గుప్పించాడు.

ఇది ఇలా ఉండగా, క్రిస్ రోజర్స్ పైనా తీవ్ర వ్యాఖ్యలు చేశాడు గేల్. తన గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకునేది లేదని అన్నారు. తాను ఎక్కువగా బార్లలోనే గడుపుతానని అతను ఎలా అంటాడని నిలదీశాడు. మరోసారి తనపై ఆరోపణలు చేస్తే అతని నోట్లో చుయింగ్ గమ్ బదులు క్యారెట్ ఉంటుందని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. ఓ ఇంటర్వ్యూలో లేడీ యాంకర్‌తో మాట్లాడుతూ.. తన బ్యాట్ చాలా పెద్దదని, దాన్ని పట్టుకోవాలంటే రెండు చేతులు కావాలని వ్యాఖ్యానించాడు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X