అసభ్యంగా ప్రవర్తించాడు: అండర్-19 క్రికెటర్ అరెస్ట్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కేసులో అండర్-19 క్రికెటర్‌ శివ్ థాకూర్‌ని అక్కడి స్ధానిక పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఏడాది జూన్ నెలలో వేర్వేరు ఘటనల్లో శివ్ థాకూర్ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు అభియోగాలు వచ్చాయి.

దీంతో అతడు ప్రాతినిథ్యం వహిస్తున్న క్రికెట్ క్లబ్ తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. ర్యాడ్ బోర్న్ లేన్, మ్యాక్ వర్త్ ప్రదేశాల్లో శివ్ థాకూర్ మహిళల పట్ల అసభ్యకర రీతిలో ప్రవర్తించినట్లు ఫిర్యాదులు అందాయి. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు తాజాగా అతడిని అరెస్ట్ చేశారు.

Cricketer Shiv Thakor arrested over indecent exposure claim

'అతను మా క్లబ్ కు గతంలో ఆడిన మాట వాస్తవమే. ఇప్పుడు సదరు క్రికెటర్ తో మాకు ఎటువంటి సంబంధం లేదు. అతను మా క్లబ్ తరపును ఆడటం లేదు' అని డెర్బీసైర్ ఒక ప్రకటన విడుదల చేసింది. 2014 నుంచి 2016 వరకూ శివ్ థాకూర్ డెర్బీషైర్ తరపున ఆడాడు.

Mithali Raj Appreciated By CM KCR
English summary
Mr Thakor, 23, has been suspended on full pay over two allegations said to have happened in June. Police confirmed a 23-year-old had been arrested in connection with "an ongoing investigation into incidents of sexual exposure".
Please Wait while comments are loading...