న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వివాదాల నుంచి విజేతగా: వార్నర్‌లో అనూహ్య మార్పులు

హైదరాబాద్/బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్-9 టైటిల్‌ను చేజిక్కించుకోవడం కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఎంతగా శ్రమించాడో అందరికీ తెలిసిందే. అతని ప్రతిభ, జట్టు సమష్టిగా రాణించడంతో ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఓడించి ట్రోఫీని సొంతం చేసుకుంది. అయితే వార్నర్‌లో గతంతో పోలిస్తే ఎంతగానో మార్పు వచ్చింది.

గతంలో వార్నర్ ఎప్పుడూ గొడవలు, వివాదాలతోనే వార్తల్లో ఉండేవాడు. అతని
అంతేగాక, మద్యానికి పూర్తిగా బానిసై ఒళ్లుతెలియకుండ ప్రవర్తించిన ఘటనలు కూడా చాలానే ఉన్నాయి. చిన్న చిన్న విషయాలకే వివాదాలకు దిగేవాడు. వీటితో అతని ప్రతిభ ఎవరికీ అంతగా పరిచయం లేకుండా పోయింది. కానీ, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌తో ఇదంతా గతంగా మారిపోయేలా చేశాడు వార్నర్.

ఇప్పుడు అతనిలో కనీవిని ఎరుగని మార్పు కనిపిస్తోంది. ఎవరు ఎంత రెచ్చగొట్టినా సహనం కోల్పోకుండా చిరునవ్వే తన సమాధానంగా
మార్చుకున్నాడు.

స్లెడ్జింగ్‌కు పెట్టింది పేరైన ఆస్ట్రేలియా జట్టులో కీలక ఆటగాడైన వార్నర్ గతంలో చాలా వివాదాలకు కేంద్రబిందువుగా నిలిచాడు. రెండేం డ్ల క్రితం నైట్‌క్లబ్‌లో పూటుగా తాగి ఇంగ్లండ్ క్రికెటర్ జోరూట్‌తో గొడపడిన వార్నర్ తీరు మీడియాలో పతాక శీర్షికలకు ఎక్కింది. దీంతో పాటు స్వదేశం వేదికగా టీమ్‌ఇండియాతో జరిగిన సిరీస్‌లో రోహిత్‌శర్మతో వాగ్వాదం వార్నర్ నోటిదురుసును మరోమారు బయటపెట్టింది.

ఇలా ఒకటి, రెండు కాదు ఎన్నో వివాదాల్లో ప్రముఖంగా నిలిచిన డేవిడ్‌ను ఓ సందర్భంలో క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ కూడా తీవ్రంగా మందలించిన సందర్భం ఉంది. అంతేగాక, తన దురుసు ప్రవర్తనతో జట్టుకు దూరమైతాడ అన్న అనుమానాలు కూడా కలిగించాయి. కానీ, గతాన్ని ఆత్మపరిశీలన చేసుకున్న ఫలితమో ఏమో గానీ వార్నర్‌ను పూర్తిగా మారిపోయాడు. ఈ క్రమంలో గతేడాది 100 రోజులు బీర్‌కు(మద్యానికి) దూరంగా ఉండి ఓ సెంచరీతో మెరిశాడు. అక్కణ్నుంచి అదే తారక మంత్రంగా పనిచేసింది.

తనలో ఇంత మార్పునకు కారణమైన మద్యంపై స్వయం నిషేధం విధించుకున్న వార్నర్ ఆసీస్‌కు మూడు ఫార్మాట్లలో కీలక ఆటగానిగా మారేలా చేసింది. ఇది తాజాగా ముగిసిన ఐపీఎల్‌లోనూ స్పష్టంగా కనిపించింది. మద్యంతో పాటు దూకుడు నైజాన్ని త్యజించిన డేవిడ్.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిపాడు.

ఈ క్రమంలో ఐపిఎల్లో తనను కవ్వించిన ఆటగాళ్లకు (ప్రవీణ్‌కుమార్) బ్యాటింగ్‌తోనే చెంపచెల్లుమనేలా సమాధానమిచ్చాడు. ఇలా ఎన్నో దురలవాట్లను దూరం చేసుకున్న వార్నర్..హైదరాబాద్ తొలి ఐపీఎల్ టైటిల్ సాధించిన వేళ తనకు తాను విధించుకున్న నిషేధానికి ముగింపు పలికాడు.

David Warner: From a brat to a calm, mature leader

అద్భుత విజయానికి కారణమైన సహచర హైదరాబాద్ ఆటగాళ్లతో కలసి విజయాన్ని పూర్తి స్థాయిలో ఆస్వాదించడానికి వార్నర్ ఈ సందర్భంగా బీర్(మద్యం) పుచ్చుకున్నాడు. మద్యాన్ని మితంగా సేవిస్తూ, వివాదాలకు పూర్తిగా దూరంగా ఉంటూ తన ప్రతిభకు పదును పెట్టిన వార్నర్.. ప్రపంచంలో మేటి ఆటగాడిగా మారిపోయాడు.

లక్ష్మణ్ ప్రశంస

ఐపీఎల్ ఛాంపియన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌పై ఆ జట్టు మెంటార్ వివియస్ లక్ష్మణ్ ప్రశంసల వర్షం కురిపించాడు. జట్టును విజేతగా నిలపడంలో నాయకునిగా యువకుల్లో వార్నర్ స్ఫూర్తినింపిన తీరు అద్భుతమని లక్ష్మణ్ కొనియాడాడు.

'వార్నర్ జట్టును ముందుండి నడిపించాడు. అంతగా అనుభవం లేని యువ క్రికెటర్లకు ప్రేరణగా నిలుస్తూ, అదే సమయంలో తన దూకుడైన ఆటతీరుతో జట్టుకు ఒంటిచేత్తో విజయాలందించాడు. తీవ్ర ఒత్తిడి పరిస్థితులను కూడా అలవోకగా అధిగమిస్తూ 60.5 సగటుతో 843 పరుగులు సాధించి లీగ్‌లో సెకండ్ టాపర్‌గా నిలిచాడు' అని ప్రశంసించాడు.

అంతేగాక, 'కేవలం తన బ్యాటింగ్ ద్వారానే గాకుండా బౌలర్లకు పూర్తి స్వేచ్చనిస్త్తూ మెరుగైన ఫలితాలు రాబట్టాడు. కెప్టెన్‌గా అనుభవం అంతంత మాత్రమైనా జట్టును విజేతగా నిలిపిన తీరు అనిర్వచనీయం. రానున్న లీగ్‌ల్లోనూ ఈ ఫామ్‌ను అతను కొనసాగిస్తాడని ఆశిస్తున్నా' అని లక్ష్మణ్ పేర్కొన్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X