న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఉత్కంఠ: డే నైట్ టెస్టులో పోరాడి ఓడిన పాకిస్థాన్

ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో పాకిస్థాన్ ఓటమి పాలైంది. రసవత్తరంగా సాగిన డే నైట్ టెస్టులో ఆస్ట్రేలియా కేవలం 39 పరుగుల తేడాతో విజయం సాధించింది.

By Nageshwara Rao

హైదరాబాద్: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో పాకిస్థాన్ ఓటమి పాలైంది. రసవత్తరంగా సాగిన డే నైట్ టెస్టులో ఆస్ట్రేలియా కేవలం 39 పరుగుల తేడాతో విజయం సాధించింది. 490 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ నాలుగో రోజు ఆట ముగిసే సరికి 8 వికెట్లను కోల్పోయి 382 పరుగులు చేసింది.

చివరి రోజైన ఐదో రోజు 382/8 ఓవర్ నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్థాన్ మరో 68 పరుగులు జోడించి మిగతా రెండు వికెట్లు కోల్పోయింది. పాక్ ఆటగాడు ఆసద్ షఫిక్ స్టార్క్‌ బౌలింగ్‌లో ఔటవ్వడంతో ఆస్ట్రేలియా ఊపిరి పీల్చుకుంది. చివరిరోజు ఆటలో షఫిక్ దాదాపు 21 ఓవర్ల పాటు క్రీజులో ఉన్నా పాక్‌‌ను ఓటమి నుంచి రక్షించలేకపోయాడు.

449 పరుగుల వద్ద షఫిక్ తొమ్మిదో వికెట్‌గా అవుట్ కావడంతో మరో పరుగు మాత్రమే చేసి పాకిస్థాన్ తన రెండో ఇన్నింగ్స్‌ను ముగించింది. దాంతో పాక్ ఓటమి ఖాయమైంది. అయితే తన అద్భుత పోరాట ప్రదర్శనతో షఫిక్‌ ఆస్ట్రేలియా జట్టును తీవ్ర ఒత్తిడికి గురి చేశాడు.

ఈ టెస్టులో రాణించిన అసద్‌ షఫిక్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నారు. ఈ విజయంతో మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆస్ట్రేలియా 1-0 ఆధిక్యం సాధించింది. ఇక, మెల్‌బోర్న్‌లో డిసెంబరు 26 నుంచి ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌ మధ్య రెండో టెస్టు ప్రారంభం కానుంది.

తొలి టెస్టు ఆటతీరు సాగిందిలా:
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌: 429
రెండో ఇన్నింగ్స్‌: 202/5 డిక్లేర్డ్‌
పాకిస్థాన్‌ తొలి ఇన్నింగ్స్‌: 142
రెండో ఇన్నింగ్స్‌: 450

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X