టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా డబ్ స్మాష్ వీడియోతో అలరించాడు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా డబ్ స్మాష్ క్రేజీగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు సినీ తారలు, సానియా మిర్జా, సైనా నెహ్వాల్‌లు తమ డబ్ స్మాష్ వీడియోలను సోషల్ మీడియాలో వెబ్ సైట్స్‌లలో పోస్ట్ చేశారు.
ఇప్పుడు కోహ్లీ కూడా వారి సరసన చేరాడు. వీడియోలో కోహ్లీ బాలీవుడ్ బ్లాక్ బస్టర్ 'హేరా ఫేరీ' సినిమాలోని బాబూ భాయి పాత్రధారిలా డైలాగ్ చెప్పాడు. మిత్రుడు సందీప్ రాజ్ ఎదురుగా నిలుచుని ఉండగా 'యే బాబూ భాయి క్యా స్టైల్ హై' అని డైలాగ్ చెప్పాడు.
<center><iframe width="100%" height="371" src="https://www.youtube.com/embed/MKhJLPtfroE" frameborder="0" allowfullscreen></iframe></center>
అనంతరం వీడియోలో సందీప్ రాజ్ చెంపను కోహ్లీ చెళ్లుమనిపించాడు. కాగా, హేరా ఫెరీ సినిమాలో బాబూరావ్ పాత్రను ప్రముఖ నటుడు, ఎంపీ పరేష్ రావెల్ పోషించారు. డబ్ స్మాష్ అనేది ఐఓఎస్, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లకు చెందిన వీడియో మేసేజింగ్ అప్లికేషన్.
డబ్ స్మాష్‌ను అధికారికంగా నవంబర్ 19, 2014న విడుదల చేశారు. ఈ అప్లికేషన్‌ను ఉపయోగించి వినియోగదారులు నచ్చిన కోటేషన్‌ను ఆడియో రికార్డింగ్ ద్వారా మీకు నచ్చిన వీడియో ద్వారా డబ్ చేయవచ్చు.