న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

260/3 వద్ద డిక్లేర్: భారత లక్ష్యం 310, ఆదిలోనే దెబ్బ

By Nageshwara Rao

రాజ్‌కోట్: భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు రసవత్తరంగా మారింది. తొలి టెస్టులో టీమిండియాకు 310 పరుగుల భారీ విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. 114/0 ఓవర్ నైట్ స్కోరుతో ఆదివారం చివరి రోజున రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లాండ్ తన రెండో ఇన్నింగ్స్ ను 260/3 వద్ద డిక్లేర్ చేసింది.



అంతక ముందు తొలి ఇన్నింగ్స్‌‌లో ఇంగ్లాండ్‌కు 49 పరుగుల ఆధిక్యం సాధించిన సంగతి తెలిసిందే. 114/0 ఓవర్ నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లాండ్ తొలి సెషన్ లో రెండు వికెట్లను కోల్పోయింది. ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఓపెనర్లు అలెస్టర్ కుక్-హమీద్‌లు అత్యంత నిలకడగా ఆడారు.

England declare 2nd innings at 260/3, set India a target of 310 runs

అయితే ఈ జోడీ 180 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యం సాధించిన తరువాత హమీద్(82) వెనుదిరిగాడు. అమిత్ మిశ్రా బౌలింగ్‌లో అతనికే రిటర్న్ క్యాచ్ ఇచ్చి హమీద్ అవుటయ్యాడు. ఆ తరువాత కొద్దిసేపటికే జో రూట్ 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రెండో వికెట్‌గా పెవిలియన్ చేరాడు.

ఫోటోలు: Cricket - England Tour Of India 2016-17

ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన బెన్ స్టోక్స్ (29 నాటౌట్)తో కలిసి కుక్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌ను ఆడాడు. ఈ క్రమంలోనే 194 బంతుల్లో 10 ఫోర్లు సాయంతో కుకు సెంచరీని సాధించాడు. టెస్టుల్లో ఇది కుక్‌కు 30వ సెంచ‌రీ కావ‌డం విశేషం. కుక్ ఔటైన అనంతరం ఇంగ్లాండ్ తన ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.

కుక్ సెంచరీల రికార్డు: కెరీర్‌లో 30, భారత్‌లో ఐదోది కుక్ సెంచరీల రికార్డు: కెరీర్‌లో 30, భారత్‌లో ఐదోది

England declare 2nd innings at 260/3, set India a target of 310 runs

దీంతో టీమిండియా 17 ఓవర్లకు గాను 2 వికెట్లు కోల్పోయి 42 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో మురళీ విజయ్‌ 29, కోహ్లీ 2 పరుగులతో ఉన్నారు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X