న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐదో టెస్టుకు ఆండర్సన్ దూరం: కోహ్లీపై వ్యాఖ్యలే కారణమా?

జట్టు ప్రధాన పేసర్ జేమ్స్ ఆండర్సన్ చెన్నై వేదికగా జరుగుతున్న ఐదో టెస్టుకు దూరమయ్యాడు. ఆండర్సన్ భుజానికి తగిలిన గాయం మరోసారి తిరగబెట్టడంతో తప్పనిసరి పరిస్థితుల్లో అతనికి విశ్రాంతినిచ్చారు.

By Nageshwara Rao

హైదరాబాద్: ఇంగ్లాండ్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. జట్టు ప్రధాన పేసర్ జేమ్స్ ఆండర్సన్ చెన్నై వేదికగా జరుగుతున్న ఐదో టెస్టుకు దూరమయ్యాడు. ఆండర్సన్ భుజానికి తగిలిన గాయం మరోసారి తిరగబెట్టడంతో తప్పనిసరి పరిస్థితుల్లో అతనికి విశ్రాంతినిచ్చారు.

అండర్సన్‌కు గాయం తిరగబెట్టిన నేపథ్యంలో అతనికి ఐదో టెస్టు నుంచి విశ్రాంతి నిస్తున్నట్లు కెప్టెన్ అలెస్టర్ కుక్ తెలిపాడు. 'భుజం లేదా మోచేయి ఏదైనా కావొచ్చు. అతడి స్ధానంలో వేరొకరని చూస్తున్నాం' అని అలెస్టర్ కుక్ బీబీసీకి ఇచ్చిన ఇంటర్యూలో తెలిపాడు.

ఇప్పటికే భారత్‌తో టెస్టు సిరిస్ కోల్పోయిన ఇంగ్లాండ్ జట్టుకు ఇది నిజంగా ఇబ్బంది కలిగించే విషయమే. భారత పర్యటనలో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా విశాఖపట్నంలో జరిగిన రెండో టెస్టుకు ఆండర్సన్ అందుబాటులోకి వచ్చాడు. ఆ తర్వాత మొహాలీలో జరిగిన మూడు, ముంబైలో జరిగిన నాలుగో టెస్టులో పాల్గొన్నాడు.

England paceman James Anderson ruled out of 5th Test against India

కోహ్లీని విమర్శించే స్థాయి నీకు ఉందా?: ఆండర్సన్‌పై హక్

భుజం గాయం కారణంగానే రాజ్‌కోట్‌లో జరిగిన తొలి టెస్టుకు కూడా ఆండర్సన్ దూరమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇంగ్లాండ్ మరో పేసర్ స్టువర్ట్ బ్రాడ్ కుడిపాదం గాయంతో మూడు, నాలుగు టెస్టులకు దూరమయ్యాడు. ముంబై టెస్టు నాలుగో రోజు ఆట ముగిసిన తర్వాత కోహ్లి ఆటలో మార్పు వచ్చిందని అనుకోవట్లేదుని, అతడి బ్యాటింగ్‌లో లోపాలు ఇక్కడి పిచ్‌లపై కనిపించడం లేదని. పిచ్‌ల్లో వేగం, స్వింగ్‌ లేకపోవడం వల్లే ఇంగ్లాండ్‌లో మాదిరిగా అతడిని ఔట్‌ చేయలేపోయామని కోహ్లీపై అండర్సన్‌ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

ఆండర్సన్ వ్యాఖ్యలపై పలువురు మాజీ క్రికెటర్లు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. 'కోహ్లీ ఇంగ్లాండ్‌తో సహా ఏ దేశంలోనైనా ఆడతాడు, ఆడగలడు. అన్ని పరిస్థితుల్లోనూ అతను చక్కగా ఆడగలడు. ప్రస్తుతం అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇంత గొప్ప క్రికెట్ ఆడుతున్న భారత ఆటగాన్ని చూడటం చాలా సంతోషంగా ఉంది' అని ఢిల్లీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న కపిల్‌ అన్నారు.

ఆండర్సన్ చేసిన వ్యాఖ్యలు అతడి వ్యక్తిత్వాన్ని సూచిస్తాన్నయే తప్పా, దీనివల్ల కోహ్లీకి ఒరిగే నష్టమేమీ లేదని గవాస్కర్ తెలిపాడు. కోహ్లి తన టెక్నిక్‌ను మార్చుకోలేకపోవచ్చు, కానీ తన స్వభావంలో మాత్రం చాలా బలంగా ఉన్నాడని గవాస్కర్ అన్నాడు.

ఆ పిచ్‌పై డబుల్: ఆండర్సన్‌పై సన్నీ ఫైర్, కోహ్లికి మద్దతు

కాగా, ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను 3-0తో భారత్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సిరిస్‌లో చివరిదైన ఐదో టెస్టు శుక్రవారం నుంచి చెన్నైలో ప్రారంభం కానుంది. అయితే చెన్నైలో జరిగే చివరి టెస్టుకు బ్రాడ్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. బ్రాడ్ ఫిట్‌గా ఉన్నట్లు కుక్ పేర్కొన్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X