న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ మార్టిన్ క్రో ఇకలేరు

By Nageswara Rao

ఆక్లాండ్: న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ మార్టిన్ క్రో క్యాన్సర్‌తో కన్నుమూశారు. ఈ మేరకు ఆయన కుటుంబ సభ్యులు గురువారం ఓ అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఆయన వయసు 53 ఏళ్లు. గత కొన్నేళ్లుగా ఆయన ఫాలిక్యులర్ లింఫోమా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు.

2012లో క్యాన్సర్ నుంచి క్రో విముక్తి అయినట్లు డాక్టర్లు వెల్లడించినప్పటికీ 2014లో మళ్లీ అది తిరగబెట్టింది. అప్పటి నుంచి కీమోథెరపీ చేయించుకున్నప్పటికీ మార్టిన్ క్రో వ్యాధి ముదరడంతో గురువారం మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

 Former New Zealand captain Martin Crowe dies aged 53

క్రో కు భార్య లోరైన్ డౌన్స్, కుమార్తె ఎమ్మా, స్టెప్ చిల్డన్స్ హిల్టన్, జాస్మిన్ ఉన్నారు. న్యూజిలాండ్ జట్టు తరుపున ఆడిన అత్యుత్తమ క్రికెటర్లలో మార్టిన్ క్రో ఒకరు. ఈయన హాలీవుడ్ స్టార్ రస్సెల్ క్రోకు వరుసకు సోదరుడు అవుతాడు. టెస్టు కెరీర్‌లో మార్టిన్ క్రో 77 మ్యాచ్‌లాడి 45.36 పరుగుల సగటుతో 17 సెంచరీలు సాధించారు.

శ్రీలంకతో 1991లో జరిగిన మ్యాచ్ లో 299 పరుగులు సాధించి రికార్డు నెలకొల్పాడు. దీంతో పాటు 143 వన్డే మ్యాచ్‌లు ఆడిన క్రో 38.55 పరుగలు సగుటున 4, 704 పరుగులు సాధించాడు. న్యూజిలాండ్ జట్టు తరుపున మూడు సార్లు వరల్డ్ కప్‌లో పాలు పంచుకున్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Read in English: Martin Crowe dies aged 53
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X