న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంతియాజ్ కన్నుమూత

పాకిస్థాన్ మాజీ వికెట్ కీపర్ ఇంతియాజ్ అహ్మద్ (88) శనివారం కన్నుమూశారు. గత కొంతకాలంగా ఉదర సంబంధిత ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న ఇంతియాజ్ అహ్మద్ లాహోర్‌లో తుదిశ్వాస విడిచారు.

By Nageshwara Rao

హైదరాబాద్: పాకిస్థాన్ మాజీ వికెట్ కీపర్ ఇంతియాజ్ అహ్మద్ శనివారం (డిసెంబర్ 31)న కన్నుమూశారు. ఆయన వయసు 88. గత కొంతకాలంగా ఉదర సంబంధిత ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న ఇంతియాజ్ అహ్మద్ శనివారం లాహోర్‌లో తుదిశ్వాస విడిచారు.

పాకిస్థాన్ జట్టు తరుపున ఈరోజు వరకు జీవించిన ఉన్న పాత తరం టెస్టు క్రికెటర్ ఇంతియాజ్ అహ్మద్. యాభైవ దశకంలో పాకిస్థాన్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన ఇంతియాజ్ అహ్మద్ నాలుగు టెస్టు మ్యాచ్‌లకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు.

1952 నుంచి 1962 మధ్య కాలంలో 41 టెస్టులాడిన ఇంతియాజ్ అహ్మద్ 2079 పరుగులు చేశాడు. పాక్ జట్టు తరుపున వికెట్ కీపర్ కూడా ఇంతియాజ్ బాధ్యతలు నిర్వర్తించాడు. తన కెరీర్‌లో 77 క్యాచ్‌లు, 16 స్టంపింగ్స్‌లు కూడా చేశాడు.

Former Pakistan wicketkeeper Imtiaz Ahmed dies at 88

1955లో లాహోర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టులో ఇంతియాజ్ డబుల్ సెంచరీ సాధించాడు. అతని అత్యధిక వ్యక్తిగత స్కోరు 209 పరగులుగా ఉంది. ఇక పాకిస్తాన్ దేశం అఖండ భారతావనిలో అంతర్భాగమైన ఉన్న సమయంలో నార్తరన్ ఇండియా జట్టు తరపున ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో కూడా పాల్గొన్నాడు.

180 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లాడిన ఇంతియాజ్ అహ్మద్ 10,391 పరుగులతో పాటు 322 క్యాచ్‌లు, 22 స్టంపింగ్స్ చేశాడు. 1962, ఆగస్టు 16న ఇంగ్లాండ్‌తో టెస్టు అనంతరం కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. తన అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత పాకిస్థాన్ జట్టుకు ఇంతియాజ్ సెలక్టర్‌గా 13 ఏళ్ల పాటు సేవలందించాడు. 1976 నుంచి 1978 వరకూ పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు చీఫ్ సెలక్టర్‌గా పని చేశాడు. అహ్మద్‌ 1928 జనవరి 5న జన్మించాడు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X