న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఎలైట్ జాబితాలోకి సంజూ శాంసన్: ఐపీఎల్‌లో సెంచరీలు చేసింది వీరే

రైజింగ్ పూణె సూపర్ జెయింట్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ యువ ఆటగాడు సంజూ శాంసన్ సెంచరీ సాధించి ఐపీఎల్ 10వ సీజన్‌లో తొలి సెంచరీ సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

By Nageshwara Rao

హైదరాబాద్: రైజింగ్ పూణె సూపర్ జెయింట్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ యువ ఆటగాడు సంజూ శాంసన్ సెంచరీ సాధించి ఐపీఎల్ 10వ సీజన్‌లో తొలి సెంచరీ సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. దీంతో పూణెపై 97 పరుగులతో ఢిల్లీ విజయం సాధించింది.

కేరళకు చెందిన 22 ఏళ్ల సంజూ శాంసన్ ఐపీఎల్‌లో సెంచరీ చేసిన 12వ ఆటగాడిగా అరుదైన ఘనతను సాధించాడు. అంతేకాదు అత్యంత పిన్న వయసులో ఐపీఎల్‌లో సెంచరీ సాధించిన రెండో క్రికెటర్‌గా సంజూ శాంసన్ నిలిచాడు.

అంతకముందు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ బ్యాట్స్‌మన్‌ మనీశ్‌ పాండే 19 ఏళ్ల వయసులో ఐపీఎల్‌లో సెంచరీ చేశాడు. 2009 ఐపీఎల్ సీజన్‌లో అతడు ఈ ఘనత సాధించాడు. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్ విరాట్‌ కోహ్లీ గతేడాది ఐపీఎల్‌ సీజన్‌లో ఏకంగా నాలుగు సెంచరీలు నమోదు చేశాడు.

Full list of Indians scoring centuries in IPL after Sanju Samson's 102

ఇలా ఐపీఎల్‌ ఆరంభం నుంచి ఇప్పటి వరకు మొత్తం 28 మంది బ్యాట్స్‌మెన్‌ సెంచరీలు సాధించారు. ఇందులో 16 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఇక సెంచరీల విషయానికి వస్తే ఐపీఎల్‌లో ఇప్పటివరకు 43 సెంచరీలు (17 సెంచరీలను భారతీయులు చేయగా, 26 సెంచరీలను విదేశీయులు) నమోదయ్యాయి.

ఐపీఎల్‌లో మొట్టమొదటి సారి మూడంకెల స్కోరు చేసిన ఆటగాడిగా 2009లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు మనీశ్ పాండే నిలిచాడు. ఇక ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు (5) చేసిన ఆటగాడిగా ఆర్సీబీ ఆటగాడు క్రిస్ గేల్ పేరిట రికార్డు ఉంది.

ఏప్రిల్ 13, 2017 నాటికి ఐపీఎల్‌లో సెంచరీలు చేసిన ఆటగాళ్లు జాబితా:

1. మనీశ్‌ పాండే (114 పరుగులు)
2. యూసుఫ్‌ పఠాన్‌ (100)
3. మురళీ విజయ్‌ (127)
4. పాల్‌ వాల్తాటి (120)
5. సచిన్‌ టెండూల్కర్ (100)
6. వీరేంద్ర సెహ్వాగ్‌ (119)
7. అజింక్య రహానె (103)
8. రోహిత్‌ శర్మ (109)
9. మురళీ విజయ్‌ (113)
10. సురేశ్‌ రైనా (100)
11. వీరేంద్ర సెహ్వాగ్‌ (122)
12. వృద్ధిమాన్‌ సాహా (115)
13. విరాట్‌ కోహ్లీ (100, 108, 109, 113)

16 మంది విదేశీ ఆటగాళ్లు సెంచరీలు చేశారు. అందులో మెక్ కల్లమ్ (2), మైక్ హస్సీ, ఆండ్రూ సైమండ్స్, ఆడమ్ గిల్ క్రిస్ట్ (2), సనత్ జయసూర్య, షాన్ మార్ష్, ఏబీ డివిలియర్స్(3), డేవిడ్ వార్నర్ (2), మహిళా జయవర్దనే, క్రిస్ గేల్ (5), కేవిన్ పీటర్సన్, షేన్ వాట్సన్ (2), డేవిడ్ మిల్లర్, లెండీ సిమ్మన్స్, డీకాక్, స్టీవ్ స్మిత్

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X