న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్ Vs ఆసీస్: ఫిబ్రవరిలో టెస్టు సిరిస్ షెడ్యూల్ విడుదల

By Nageshwara Rao

న్యూఢిల్లీ: భారత్‌లో ఆస్ట్రేలియా టెస్టు సిరిస్ పర్యటన ఖరారైంది. ఈ మేరకు శుక్రవారం (అక్టోబర్ 21)న బీసీసీఐ భారత్‌‌లో ఆస్ట్రేలియా టెస్టు సిరిస్ పర్యటనకు సంబంధించి వివరాలను వెల్లడించింది. టెస్టు సిరిస్ జరిగే తేదీలతో పాటు వేదికల వివరాలను బీసీసీఐ వెల్లడించింది.

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా, స్మిత్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా జట్టుతో తలపడనుంది. ఈ టెస్టు సిరిస్ ఫిబ్రవరిలో జరగనుంది. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా ఫిబ్రవరి 23 నుండి 27 వరకు జరగనున్న తొలి వన్డేకి పూణె ఆతిథ్యం ఇస్తుంది.

రెండో టెస్టు మార్చి 4 నుండి 8 వరకు జరగనుంది. ఇక చివరి రెండు టెస్టులు కూడా కొత్త వేదికల్లో జరగనున్నాయి. మార్చి 16 నుండి 20 వరకు జరగనున్న టెస్టు మ్యాచ్ రాంచీలో జరగనుండగా, మార్చి 25 నుండి 29 వరకు జరిగే ఆఖరి టెస్టుకి ధర్మశాల ఆతిథ్యమిస్తుంది.

Full schedule of India-Australia Test series

ధోని నేతృత్వంలోని టీమిండియా 2013లో ఆస్ట్రేలియా జట్టును 4-0తో వైట్ వాష్ చేసింది. ఈ ఏడాది ఉపఖండంలో టీమిండియా 10 టెస్టులతో పాటు, 6 వన్డేలు, మూడు ట్వంటీ20 మ్యాచ్‌లను ఆడనుంది. అయితే భారత్‌లో ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా ఇరు జట్ల మధ్య ఎటువంటి వన్డేలు, టీ20లు లేవు.

బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరిస్ 2017 షెడ్యూల్:

1st Test (February 23-27) Pune

2nd Test (March 4-8) Bengaluru

3rd Test (March 16-20) Ranchi

4th Test (March 25-29) Dharamsala

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X