న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఎవరా ‘మిస్టిరీయస్‌ గర్ల్‌’?: స్టేడియంలో నిద్రపోయి ఫేమస్

By Nageshwara Rao

న్యూఢిల్లీ: అక్టోబర్ 20న ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన రెండో వన్డేలో ఓ అరుదైన ఘట్టం చోటుచేసుకుంది. ఈ మ్యాచ్‌కు హాజరైన అభిమానులు ఆసక్తిగా మైదానం వైపు చూస్తుండగా, ఓ అమ్మాయి మాత్రం ఆదమరిచి నిద్రపోయింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండిభారత్ ఓటమి పాలవుతుందనే బాధతో నిద్రపోయిందో లేక మ్యాచ్ విసుగ్గా అనిపించి నిద్రపోయిందో తెలియదు గానీ... ఆ అమ్మాయి ఎంచక్కా తన పక్కనే కూర్చుని ఉన్న స్నేహితురాలి భుజంపై తలవాల్చి... హాయిగా కునుకు తీసింది. ఈ సమయంలో ఓ ఆశ్చర్యకమైన సన్నివేశం ఢిల్లీ ఫిరోజ్‌ షా కోట్లా మైదానాన్ని ముంచెత్తింది.

Girl Sleeps During Ind vs NZ Match, Wakes Up To Millions Watching

ఆమె ఆదమరిచి నిద్రపోతున్న దృశ్యాన్ని కెమెరా జూమ్‌ చేసి మరీ చూపించింది. దీంతో తాము మైదానంలోని స్క్రీన్లలో స్పష్టంగా కనిపిస్తుండటంతో స్నేహితురాలు ఆమెను నిద్రలేపింది. ఈ క్రమంలో ఆ అమ్మాయి నిద్ర కళ్లు నులుముకుంటూ కళ్లు తెరిచిన ఆమె టీవీ స్క్రీన్‌ను చూసి విస్తుపోయింది.

'భారీ షాట్‌లు ఆడాలనుకున్నా': ఆ అనాలోచిత షాట్ వల్లే భారత్ ఓటమి ఒక పక్క మ్యాచ్ జరుగుతుంటే తాను నిద్రపోయిన వైనాన్ని గుర్తు చేసుకుని సిగ్గుతో మొఖానికి చేతులు అడ్డుపెట్టుకుంది. అయితే ఆమె మైదానంలో కునుకు తీసిన వీడియో మాత్రం రాత్రికి రాత్రే సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలంటూ ఆమె గురించి నెటిజన్లు వాకబు చేయడం మొదలుపెట్టారు.

2nd ODIలో చివరి వరకు ఉత్కంఠ: పోరాడి ఓడిన భారత్, కివీస్ విజయం 'దట్‌ స్లీపింగ్‌ గర్ల్‌', 'మిస్టిరీయస్‌ గర్ల్‌' ఎవరు అంటూ ట్విట్టర్‌లో పోస్టు చేస్తున్నారు. మరికొందరైతే మ్యాచ్ చూడటానికి నిద్రపోతుందంటూ ఆమెపై సెటైర్లు కూడా వేశారు. ఇదిలా ఉంటే చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఢిల్లీ వన్డేలో భారత్‌పై న్యూజిలాండ్ జట్టు 6 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X