న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

గొప్ప దేశం, జీవితంలో మర్చిపోలేను: ఇండియాపై ఏబీ డివిలియర్స్

జోహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికా కెప్టెన్ ఏబీ డివిలియర్స్ తన ఆటో బయోగ్రాఫీలో చాలా విషయాలను వెల్లడించాడు. ఆ పుస్తకం ఆవిష్కరణకు ముందే భారతదేశంలోకి రానుంది. కాగా, ఈ సందర్భంగా భారతదేశంలో మీకు చాలా మంది అభిమానులున్నారని మీడియా ప్రశ్నించగా.. తాను భారతదేశంలో ఎప్పుడు ఆడినా చాలా గొప్ప స్పందన వస్తుందని, అది తాను ఎప్పుడూ ఊహించలేదని తెలిపాడు.

2015లో వాంఖడే స్టేడియంలో ఇండియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో తాను మైదానంలోకి వస్తున్న సమయంలో చాలా అరుదైన అనుభవం ఎదుర్కొన్నట్లు తెలిపారు. తాను బ్యాటింగ్ చేసేందుకు వస్తున్న సమయంలో భారత అభిమానులు కూడా ఏబీ ఏబీ అంటూ బిగ్గరగా నినాదాలు చేశారని, అది నేను ఇప్పటికీ మర్చిపోలేని అనుభవమని చెప్పాడు.

'నేను సిరీస్ ఆడుతున్న సమయంలో ప్రతీ సారీ ఇదే అనుభవం ఎదురైంది. నేను సొంత దేశం వదిలి ఇక్కడికి వచ్చి వారి దేశంతో ఆడుతున్నప్పటికీ.. వారు నన్ను ఎంతో అభిమానించారు. మద్దతుగా నిలిచారు. నా సొంత దేశంలో ఉన్నానా? అన్న అనుభూతిని కలిగించారు' అని ఏబి డివిలియర్స్ పేర్కొన్నాడు.

'Great country' India is so important in my career: AB de Villiers

ఏబీ పుస్తకాన్ని ప్రచురిస్తున్న పాన్ మెక్‌మిలాన్ పబ్లిషర్స్ మేనేజింగ్ డైరెక్టర్ టెర్రీ మోరీస్ మాట్లాడుతూ.. దక్షిణాఫ్రికాలో ఏబీ డివిలియర్స్ ఆటో బయోగ్రఫీకి భారీ స్పందన వస్తుందని తెలుసు కానీ, భారతదేశం నుంచి కూడా ఇంత పెద్ద స్పందన వస్తుందని ఊహించలేదు అని అన్నారు. గతంలో ఏబీ ట్వీట్ చేసిన ఆటోబయోగ్రఫీ ట్వీట్ కు ఇక్కడ పెద్ద స్పందన వచ్చిందన్నారు. అమెజాన్ చార్ట్స్‌లో 35 నెంబర్ పైన ఈ పుస్తకం లభిస్తుందని తెలిపారు.

భారత్ గొప్ప దేశం

కాగా, పుస్తకంలో ఓ చాప్టర్‌కు 'భారతదేశం ఓ స్ఫూర్తి' అనే టైటిల్‌ను ఏబీ డివిలియర్స్ ఇచ్చాడు. 'ఈ గొప్ప దేశం నాకెన్నో అవకాశాలు ఇచ్చింది. నా జీవితంలో ఒక ముఖ్యమైన అంశంగా ఉండిపోతుంది' అని పేర్కొన్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ టోర్నీల్లో ఆడటం ద్వారా ప్రత్యర్థులుగా ఉండే ఆటగాళ్లము.. స్నేహితులుగా మారిపోయామని చెప్పాడు.

2011లో తనకు భారీ మొత్తం చెల్లించి బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టుకు విజయ్ మాల్యా తీసుకోవడం తననెంతో ఆశ్చర్యానికి గురిచేసిందని చెప్పాడు. ఐపిఎల్ క్రీడాస్ఫూర్తిని పెంచుతోందని అన్నాడు. మరికొంత కాలం ఈ టోర్నీల్లో పాల్గొంటానని చెప్పాడు. భారీ స్థాయిలో వచ్చే అభిమానులు, వారు చేసే నినాదాలు ఎంతో స్ఫూర్తినిస్తాయని అన్నాడు. భారతదేశంలో క్రికెట్ ఆడుతున్నప్పడు తాను వారినుంచి ఎంతో స్ఫూర్తి పొందానని చెప్పుకొచ్చాడు. కాగా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లలో కూడా 'ఏబీ ది ఆటోబయోగ్రఫీ' విడుదల కానుంది.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X