న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

4వ వన్డే: మిశ్రా ఆ క్యాచ్‌ పట్టి ఉంటే, ఫలితం మరోలా ఉండేది

By Nageshwara Rao

హైదరాబాద్: రాంచీలో జరిగిన నాలుగో వన్డేలో న్యూజిలాండ్ చేతిలో టీమిండియా 19 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్ విజయంలో ఆ జట్టు ఓపెనర్లు లాథమ్ 39, మార్టిన్ గుప్తిల్ 72 మంచి శుభారంభాన్ని ఇచ్చారు. గుప్టిల్ చేసిన 72 పరుగులు భారత్ విజయానికి, న్యూజిలాండ్ గెలుపుకు కీలకమయ్యాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వాస్తవానికి గుప్టిల్ 29 పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరాల్సి ఉంది. ఉమేశ్ యాదవ్ వేసిన ఏడో ఓవర్‌లో గుప్టిల్ ఇచ్చిన క్యాచ్‌ను అమిత్ మిశ్రా విడిచిపెట్టాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న గుప్టిల్ మ్యాచ్‌లో మరో 43 పరుగులు అధికంగా చేశాడు. అలా కాకుండా గుప్టిల్ క్యాచ్‌ని అమిత్ మిశ్రా పట్టి ఉంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండి ఉండేది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు వన్డేల సిరిస్‌లో అత్యధిక వికెట్లు తీసుకున్న ఆటగాడిగా అమిత్ మిశ్రా ఉన్నాడు. ఇప్పటివరకు జరిగిన నాలుగు వన్డేల్లో అమిత్ మిశ్రా 10 వికెట్లు తీసుకున్నాడు. ఈ సిరిస్‌లో మరే ఇతర బౌలర్ కూడా ఏడు కంటే ఎక్కువ వికెట్లు తీయక పోవడం విశేషం.

Guptill, Southee star in New Zealand’s 19-run win over India

కాగా, నాలుగో వన్డేలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండి నిర్ణీత ఓవర్లలో 260 పరుగులు చేసింది. ఆ తర్వాత 261 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 48.4 ఓవర్లకే 241 పరుగులు చేసి ఆలౌటైంది. దీంతో టీమిండియాపై న్యూజిలాండ్ 19 పరుగుల తేడాతో విజయం సాధించింది.

<strong>ఆశలు రేపి తుస్సుమనిపించారు: 4వ వన్డేలో భారత్ ఓటమి</strong>ఆశలు రేపి తుస్సుమనిపించారు: 4వ వన్డేలో భారత్ ఓటమి

ఈ విజయంలో ఐదు వన్డేల సిరీస్‌ 2-2తో సమం చేసింది. దీంతో వన్డే సిరీస్ విజేత ఎవరనేది విశాఖపట్నం వేదికగా శనివారం జరిగే వన్డేలో తేలనుంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లకు 260 పరుగులు చేసింది. దీంతో 261 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఛేజింగ్‌లో తడబడింది.

కోహ్లీ(45), రహానే(57), అక్షర్ పటేల్ (38) మాత్రమే రాణించగా రోహిత్ శర్మ(11), ధోనీ(11), మనీశ్ పాండే(12) విఫలమయ్యారు. ఓ దశలో 25 ఓవర్లకు గాను టీమిండియా 2 వికెట్లు కోల్పోయి 122 పరుగులు చేసినప్పటికీ, వెంటవెంటనే వికెట్లు వికెట్లు కోల్పోయింది.

చివర్లో కులకర్ణి బ్యాటింగ్‌తో మెరుపులు మెరిపించి విజయంపై ఆశలు రేపాడు. ఉమేశ్ యాదవ్‌తో కలిసి 34 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. న్యూజిలాండ్ బౌలర్లలో సౌథీకి 3 వికెట్లు, బోల్ట్, నీషమ్‌లకు రెండు వికెట్లు, సాంట్నర్, సౌథి చెరో వికెట్ తీసుకున్నారు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X