న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

హార్దిక్ టీ20 రికార్డ్: ఒకే ఓవర్లో 5సిక్స్‌లు, 39 రన్స్

వడోదర: ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత జట్టు ఆతిథ్య జట్టుతో తలపడే ట్వంటీ20మ్యాచులకు ఎంపికైన ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా మెరుపు సిక్సర్లతో విరుచుకుపడి టీ20 చరిత్రలో సరికొత్త రికార్డును నమోదు చేశాడు. ఆదివారం ఢిల్లీతో జరిగిన మ్యాచులో బరోడా తరపున ఆడుతున్న హార్దిక్ ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు బాదాడు. అంతేగాక, మరో రెండు ఫోర్లు కూడా సాధించాడు.

సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ టీ20లో హార్దిక్ ఈ రికార్డును నమోదు చేశాడు. వడోదరలో జరిగిన ఈ మ్యాచులో 5 సిక్సర్లు బాదిన 22ఏళ్ల హార్దిక్ పాండ్యా దాదాపు ఒకే ఓవర్లో 6 సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో చేరిపోయాడు. సర్ గర్ల్‌ఫీల్డ్ సోబర్స్(1968లో), రవి శాస్త్రి(1985), హార్చెల్లి గిబ్స్(2007), యువరాజ్ సింగ్(2007), అలెక్స్ హేల్స్(2015) మాత్రమే ఈ ఫీట్‌ను సాధించారు. దాదాపు వీరి దగ్గరికి వరకు వెళ్లిన పాండ్యా మరో సిక్సర్ సాధించలేకపోయాడు.

బౌలర్ అకాశ్ సుదన్.. పాండ్యా విధ్వంసానికి బెంబేలెత్తిపోయాడు. ఈ ఎడమచేతివాటం ఆటగాడికి ఇది రెండో టీ20 మ్యాచే కావడం గమనార్హం. కాగా, ఒక్క 19వ ఓవర్లోనే 39 పరుగులు సాధించాడు పాండ్యా. 34 పరుగులు బ్యాట్ ద్వారా రాబట్టిన పాండ్యా.. ఒక నోబాల్, బైస్ ద్వారా ఒక ఫోర్ వచ్చాయి.

Hardik Pandya smashes 5 sixes in T20 record 39-run over

కాగా, టీ20 క్రికెట్ చరిత్రలోనే ఒకే ఓవర్లో 39 పరుగులు రాబట్టమనేది ఒక భారీ రికార్డ్. న్యూజిలాండ్‌కు చెందిన ససెక్స్ ఆటగాడు స్కాట్ స్టైరిస్.. గ్లోసెస్టర్‌షైర్‌తో ఇంగ్లాండ్‌లో 2012లో జరిగిన మ్యాచులో ఒకే ఓవర్లో 38 పరుగులు రాబట్టడాడు.

పాండ్యా విధ్వంసకర బ్యాటింగ్ చేసినా.. 5 వికెట్ల తేడాతో మూడు బంతులు మిగిలి ఉండగానే ఢిల్లీ విజయం సాధించడం కొసమెరుపు. పాండ్యా 51బంతుల్లో 81(5ఫోర్లు, 6సిక్సర్లు) సాధించాడు. బరోడా 20ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 5 వికెట్లు కోల్పోయి 19.3ఓవర్లలోనే 156 పరుగులు చేసి విజయం సాధించింది. 4ఓవర్లు వేసిన సుదన్ 47పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు.

సుదన్ బౌలింగ్‌లో పాండ్యా విధ్వంసం చేసిన ఓవర్ ఇలా

మొదటి బంతి-6
రెండో బంతి-4బైస్
మూడో బంతి-6
నాలుగో బంతి-6+1నోబాల్
ఐదో బంతి-4
ఆరో బంతి-6
ఏడో బంతి-6

మొత్తం 39 పరుగులు ఒకే ఓవర్లో.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X