న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

షార్ట్ డ్రెస్‌లో యాంకర్:ఇంటర్వ్యూకి నో చెప్పిన క్రికెటర్?

By Srinivas

న్యూఢిల్లీ: టీవీ యాంకర్ డ్రెస్ విషయంలో తన పైన వచ్చిన ఆరోపణల పైన దక్షిణాఫ్రికా క్రికెటర్ హషీమ్ ఆమ్లా స్పందించాడు. భారత్‌కు చెందిన ఓ టీవీ యాంకర్ ఇంటర్వ్యూ కోసం అడిగితే.. ఆమె షార్ట్ డ్రెస్‌లో ఉన్న కారణంగా హషీమ్ అమ్లా ఆమె డ్రెస్ గురించి కామెంట్ చేశారని వార్తలు వచ్చాయి.

దీనిపై ఆమ్లా స్పందించాడు. ఆయన సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్‌లో వరుస ట్వీట్ల వివరణ ఇచ్చాడు. తాను ఏ టీవీ యాంకర్‌ను డ్రెస్ గురించి కామెంట్ చేయలేదని చెప్పాడు.

దక్షిణాఫ్రికా వాడిగా నేను అందరిని గౌరవిస్తానని, అందరి ఆచారా, సంప్రదాయాలను గౌరవిస్తానని చెప్పాడు. నా ఆలోచనలు ఎవరి పైన రుద్దే ప్రయత్నం తాను చేయనని వివరణ ఇచ్చాడు.

ఇంటర్వ్యూ కోసం.. షార్ట్ డ్రెస్, లో నెక్‌తో వచ్చిన యాంకర్‌ను డ్రెస్ బాగా లేదని ఆమ్లా చెప్పాడని, దాంతో ఆమెను మరో వేషధారణలో రావాలని చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ ఆరోపణలను హషీమ్ ఆమ్లా తాజాగా కొట్టిపారవేశారు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X