న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అతనంటే అంటే గౌరవం, చిన్నపిల్లాడిలాగా: స్మిత్ చర్యపై అశ్విన్

బెంగుళూరు టెస్టులో స్టీవ్ స్మిత్ చర్య అండర్-10 క్రికెట్ నాటి రోజులను గుర్తుకు తెచ్చిందని పేర్కొన్నాడు.

By Nageshwara Rao

హైదరాబాద్: ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ 'డ్రెస్సింగ్ రూమ్ రివ్యూ' పై టీమిండియా ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. బెంగుళూరు టెస్టులో స్టీవ్ స్మిత్ చర్య అండర్-10 క్రికెట్ నాటి రోజులను గుర్తుకు తెచ్చిందని పేర్కొన్నాడు.

<strong>చర్యలు ఉండవు: స్మిత్ డీఆర్ఎస్ వివాదంపై తేల్చేసిన ఐసీసీ</strong>చర్యలు ఉండవు: స్మిత్ డీఆర్ఎస్ వివాదంపై తేల్చేసిన ఐసీసీ

టీమిండియా ఆటగాడు ఛటేశ్వర్ పుజారాతో కలిసి బీసీసీఐ టీవికి ఇచ్చిన వీడియో ఇంటర్యూలో రవిచంద్రన్ అశ్విన్ మాట్లాడాడు. 'స్టీవ్‌ స్మిత్‌ డ్రెస్సింగ్‌ రూమ్ వైపు చూస్తూ సమీక్ష కోరాలా వద్దా? అని అడిగాడు. స్మిత్‌ రివ్యూలాంటి వ్యవహారం గురించి నేనెప్పుడూ వినలేదు. చాలా ఆశ్చర్యంగా కూడా అనిపించింది' అని అశ్విన్ చెప్పాడు.

Have a lot of respect for Smith, but DRS referral input was like an Under-10 game: R Ashwin

'అతనంటే నాకు ఎంతో గౌరవం. స్మిత్ చర్య అండర్-10 క్రికెట్ నాటి రోజులను గుర్తుకు తెచ్చింది. ఆ రోజుల్లో కవర్‌ ఫీల్డర్, పాయింట్‌ ఫీల్డర్‌లు ఎక్కడ నిలబడతారో మా కోచ్‌ బయటి నుంచి సూచనలు ఇచ్చేవారు. కానీ ఓ చిన్నపిల్లాడిలాగా డ్రెస్సింగ్ రూమ్‌వైపు స్మిత్ సైగలు చేయడం ఆశ్చర్యపరిచింది' అని అన్నాడు.

<strong>స్మిత్ క్షమాపణ: శాంతించని బీసీసీఐ, కోహ్లీకి మద్దతు, ఐసీసీకి ఫిర్యాదు </strong>స్మిత్ క్షమాపణ: శాంతించని బీసీసీఐ, కోహ్లీకి మద్దతు, ఐసీసీకి ఫిర్యాదు

'ఇలాంటిది ఇంతకుముందెన్నడూ చూడలేదు. వినలేదు. అయినా ఇలాంటివి అస్సలు ఆమోదించదగ్గవి కావు' అని అశ్విన్ తెలిపాడు. ఇదిలా ఉంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదో ఎడిషన్‌లో స్మిత్ సారథ్యం వహిస్తున్న రైజిగ్ పూణె సూపర్ జెయింట్స్ జట్టులో ఆడనున్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X