న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నేను గిల్‌క్రిస్ట్‌‌ను కాదు: సెంచరీ సాధించడంపై డికాక్

By Nageshwara Rao

హోబార్డ్: తాను ఆస్ట్రేలియా కీపర్, స్టార్ బ్యాట్స్‌మెన్ ఆడమ్ గిల్ క్రిస్ట్‌ను కాదని దక్షిణాఫ్రికా కీపర్ డికాక్ అన్నాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో హోబార్డ్‌లో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో డికాక్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లో కూడా డికాక్ అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.

రెండో టెస్టులో మూడో రోజు ఆటలో భాగంగా దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో డికాక్ 143 బంతులను ఎదుర్కొని 17 ఫోర్లతో సెంచరీని సాధించాడు. 132 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న దక్షిణాఫ్రికాను డికాక్ తన బ్యాటింగ్‌తో ఆదుకున్నాడు. బావుమాతో కలిసి 144 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

ఇక బావుమా కూడా 204 బంతులను ఎదుర్కొని 8 ఫోర్లతో 74 పరుగులు సాధించాడు. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన ఫిలిండర్ 32 పరుగులతో రాణించడంతో దక్షిణాఫ్రికా తన తొలి ఇన్నింగ్స్‌లో 326 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో హజల్ వుడ్ ఆరు వికెట్లు, మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు తీసుకున్నారు.

Hobart Test: Quinton de Kock slams ton as South Africa tighten grip

ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 85 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే. దీంతో దక్షిణాఫ్రికాకు 241 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఆస్ట్రేలియా 79 పరుగుల వద్ద రెండో వికెట్‌ను కోల్పోయింది. తొలి వికెట్‌గా ఓపెనర్ బర్న్స్ డకౌట్ కాగా, వార్నర్ 45 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రెండో వికెట్‌గా పెవిలియన్‌కు చేరాడు.

దీంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 121/2 పరుగులతో నిలిచింది. కాగా రెండో రోజు ఆట వర్షం వల్ల పూర్తిగా రద్దు అయిన సంగతి తెలిసిందే. మూడో రోజు ఆసీస్ బౌలర్లను చితకబాదిన డికాక్ బ్యాటింగ్ శైలి మాజీ క్రికెటర్ గిల్ క్రిస్ట్‌ను తలపించింది. మ్యాచ్ అనంతరం డికాక్ మీడియాతో మాట్లాడాడు.

'గిల్‌క్రిస్ట్ ఆటను అనుకరించే ప్రయత్నం చేయను. నేను ఇలానే ఆడతాను. నాలో అతడిని చూసుకోను. బంతిని మాత్రమే చూసి ఆడతాను. క్రీజులో ఉన్నప్పుడు నాకంటూ కొన్ని ప్రణాళికలు ఉన్నాయి' అని డికాక్ అన్నాడు. ఈ ఏడాది డికాక్‌ 80 యావరేజితో ఇప్పటికే 540 పరుగులు చేశాడు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X