న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

హర్మన్ జీవితంలో ఎన్నెన్నో అవమానాలు: సచిన్ లేఖ రాసేదాకా 'జాబ్' కష్టాలే..

అయితే ఈ స్థాయికి చేరుకోవడానికి ఆమె ఎదుర్కొన్న అవమానాలు, ఒడిదుడుకులు అన్నీ ఇన్నీ కావు. వాటన్నింటిని చేధించుకుని ఈరోజు దేశం గర్వించదగ్గ స్థాయికి ఆమె చేరుకోగలిగిందంటే ఆమె పట్టుదలే అందుకు కారణం. 

న్యూఢిల్లీ: ఒక్క సంచలనం నమోదైతే పతాక శీర్షికల నిండా కటౌట్ కనిపిస్తుంది. ప్రయత్నం నివురు గప్పిన నిప్పయితే.. ప్రదర్శన ప్రపంచానికి తమను 'డైనమైట్'లా పరిచయం చేస్తుంది. వారి గతంలోకి తొంగి చూడాలనే ఆసక్తిని కలగజేస్తుంది. మనిషిలో కసిని పెంచడానికి 'నేపథ్యం' కూడా ఒక కారణమని చెప్పడానికి.. భారత మహిళా క్రికెట్ నయా సంచలనం హర్మన్ ప్రీత్ కౌర్ ఇప్పుడు మరో ప్రత్యక్ష ఉదాహరణ.

ఆస్ట్రేలియాపై 171పరుగుల వీర విహారంతో కౌర్ పేరు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మహిళా క్రికెట్ లో మార్మోగిపోతోంది. అయితే ఈ స్థాయికి చేరుకోవడానికి ఆమె ఎదుర్కొన్న అవమానాలు, ఒడిదుడుకులు అన్నీ ఇన్నీ కావు. వాటన్నింటిని చేధించుకుని ఈరోజు దేశం గర్వించదగ్గ స్థాయికి ఆమె చేరుకోగలిగిందంటే ఆమె పట్టుదలే అందుకు కారణం.

డయానా ఎడుల్జి ఏమన్నారంటే?:

డయానా ఎడుల్జి ఏమన్నారంటే?:

సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై హర్మన్‌ కౌర్ ఇన్నింగ్స్‌ తర్వాత మాజీ క్రీడాకారిణి డయానా ఎడుల్జి.. కౌర్ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా రైల్వేలో కౌర్ పదోన్నతి కోసం సచిన్‌ రాసిన లేఖ గురించి ప్రస్తావించారు.

కొన్నాళ్ల క్రితం హర్మన్ నార్త్ రైల్వే విభాగంలోని జూనియర్ క్లాస్ లో ఉద్యోగం చేస్తుండేదని గుర్తుచేశారు. ఆ సమయంలో ఆమెను ముంబై రావాల్సిందిగా తాను కోరానని చెప్పారు. ముంబై వస్తే మరింత మెరుగైన క్రీడా సదుపాయాలు అందుబాటులోకి వస్తాయన్న కారణంతోనే ముంబై రమ్మన్నట్లుగా తెలిపారు.

రాష్ట్రపతి తిరస్కరించారు:

రాష్ట్రపతి తిరస్కరించారు:

హర్మన్ ను ముంబైకి రప్పించాలన్న ఉద్దేశంతో పశ్చిమ రైల్వేస్‌లో చీఫ్‌ ఆఫీస్‌ సూపరింటెండెంట్‌ ఉద్యోగం ఇప్పించాల్సిందిగా రాష్ట్రపతికి లేఖ రాసినట్లు డయానా గుర్తుచేశారు. అయితే ఆ లేఖను రాష్ట్రపతి తిరస్కరించారని పేర్కొన్నారు.

ఆపై రాజ్యసభ ఎంపీగా ఉన్న క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ను ఆశ్రయించి, ఉద్యోగం కోసం విన్నవించామని తెలిపారు. తమ అభ్యర్థన మేరకు సచిన్ హర్మన్ ఉద్యోగం కోసం స్వయంగా రైల్వే మంత్రికి లేఖ ఇచ్చారని చెప్పారు. ఆ తర్వా త కొన్నాళ్లకే హర్మన్ కు పశ్చిమ రైల్వేస్‌లో ఉద్యోగం లభించి ముంబైకి వచ్చారని చెప్పుకొచ్చారు.

పురుష క్రికెటర్లలా కాదు..:

పురుష క్రికెటర్లలా కాదు..:

వసతులు, సదుపాయాల విషయంలో పురుషుల క్రికెటర్ల స్థాయిలో మహిళా క్రికెటర్లకు అవన్ని ఉండవని డయానా చెప్పారు. ప్రపంచకప్‌ టోర్నీ కోసం ఇంగ్లాండ్‌ పర్యటనకు వెళ్లే సమయంలోను జట్టులోని పలువురు క్రీడాకారిణీలు తమ కిట్‌ బ్యాగ్‌ల విషయంలో సమస్యలు ఎదుర్కొన్నట్లు తెలిపారు. బిజినెస్ క్లాస్ లో మహిళలు ప్రయాణించడం ఇదే తొలిసారని, అలాగే తొలిసారిగా పురుషులతో సమానంగా రోజువారి ఖర్చుల కోసం క్రీడాకారిణిలకు 100 డాలర్లు ఇస్తున్నారని అన్నారు.

హర్భజన్సింగ్ అనుకున్నావా?:

హర్భజన్సింగ్ అనుకున్నావా?:

స్పోర్ట్స్ కోటాలో హర్మన కౌర్ కు ఉద్యోగం ఇవ్వాలని ఆమె కోచ్ యద్విందర్ గతంలో పంజాబ్ డీజీపీ పరమిందర్ సింగ్ గిల్ ను కలిసినట్లుగా గుర్తుచేసుకున్నారు. అయితే ఆయన మాత్రం.. హర్మన్ ఏమైనా హర్భజన్సింగ్ అనుకున్నావా?, ఆమె ఓ మహిళా క్రికెటర్ మాత్రమే అంటూ చిన్నచూపు చూశాడని చెప్పారు. కనీసం ఇన్‌స్పెక్టర్‌గా అవకాశం ఇవ్వాలని కోరినా తమ మాట పట్టించుకోలేదన్నారు.

ప్రకాశ్ సింగ్‌ బాదల్‌ను కలిసినా:

ప్రకాశ్ సింగ్‌ బాదల్‌ను కలిసినా:

అప్పట్లో సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్‌ను కలిసినా లాభం లేకపోయిందన్నారు యద్విందర్. పలుమార్లు ఆయన్ను కలిసి ఉద్యోగం విన్నవించినా ఆయన పట్టించుకోలేదన్నారు. హర్మన్ మహిళా క్రీడాకారిణి కావడం వల్లే ఈ వివక్ష ఎదురైందన్నారు. చివరికి మాజీ క్రీడాకారిణి డయానా చొరవతో హర్మన్ కు జాబ్ వచ్చిందని, దానివల్ల ఆమె కుటుంబం కొంత ఆర్థిక ఊరట పొందిందని అన్నారు. ఆమె ఎదుర్కొన్న అవమానాలే ఆమెలో కసిని పెంచి మరింత పట్టుదలగా మార్చాయని చెప్పుకొచ్చారు.

Story first published: Monday, November 13, 2017, 12:16 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X