న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బౌన్స్ బాగుంటుంది, అనుకూలం: హైదరాబాద్ పిచ్‌పై అశ్విన్

నగరంలోని ఉప్పల్ స్టేడియంలో బౌలింగ్ చేయడాన్ని తాను ఎంతగానో ఆస్వాదిస్తానని టీమిండియా టాప్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పష్టం చేశాడు.

By Nageshwara Rao

హైదరాబాద్: నగరంలోని ఉప్పల్ స్టేడియంలో బౌలింగ్ చేయడాన్ని తాను ఎంతగానో ఆస్వాదిస్తానని టీమిండియా టాప్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పష్టం చేశాడు. (ఫిబ్రవరి 9) గురువారం నుంచి బంగ్లాదేశ్‌తో ఏకైక టెస్టు మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా అశ్విన్ మీడియాతో మాట్లాడాడు. 'ఈ పిచ్‌పై బౌన్స్ బాగుంటుంది. దాంతో పాటు ఇది పెద్ద గ్రౌండ్ కూడా. ఈ తరహా పిచ్ నాకు లాభిస్తుందనే ఆశిస్తున్నా. ఇక్కడ బంతి పెద్దగా టర్న్ కాకపోయినా, ఊహించని బౌన్స్ వస్తుంది. అది స్పిన్నర్లకు అనుకూలమనే చెప్పొచ్చు' అని అశ్విన్ తెలిపాడు.

కాగా, బంగ్లాదేశ్ జట్టును ఏ మాత్రం తేలిగ్గా తీసుకున్న తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని అశ్విన్ హెచ్చరించాడు. బంగ్లాదేశ్ కూడా మెరుగైన జట్టు అనే విషయాన్ని మరువకూడదని టీమిండియా పూర్తిస్థాయి ప్రదర్శన చేయాల్సి ఉందని పేర్కొన్నాడు.

Hyderabad track helps me to be more imaginative: Ashwin

న్యూజిలాండ్ పర్యటనను పూర్తి చేసుకున్న బంగ్లా నేరుగా టీమిండియాతో ఏకైక టెస్టు ఆడేందుకు భారత పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బంగ్లాదేశ్ జట్టును తక్కువగా అంచనా వేయకూడదని అశ్విన్ అభిప్రాయపడ్డాడు.

గతేడాది ఫతుల్లాలో జరిగిన మ్యాచ్‌లో అశ్విన్ బంగ్లాపై ఐదు వికెట్లు తీసుకుని భారత విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ టెస్టులో కూడా అదే సీన్ రిపీట్ చేయాలనే అశ్విన్ భావిస్తున్నాడు. బంగ్లాతో టెస్టుకు పూర్తిగా సన్నద్ధమైనట్లు అశ్విన్ పేర్కొన్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X