న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అమెరికా మహిళా క్రికెట్ జట్టులో హైదరాబాద్ యువతి: ఎవరీ సింధుజ

14 ఏళ్ల పాటు హైదరాబాద్ క్రికెట్‌కు సేవలందించిన సింధుజ రెడ్డి సల్గూటి అనే యువతి ప్రస్తుతం అమెరికా ఉమెన్ జాతీయ క్రికెట్ జట్టులో కీలక పాత్ర పోషిస్తుంది.

By Nageshwara Rao

హైదరాబాద్: జీవితం ఎన్నో అవకాశాలకు వేదిక అంటే ఇదేనేమో. నల్గొండ జిల్లా వేములపల్లి మండలం ఆమన్‌గల్‌ గ్రామానికి చెందిన సింధుజరెడ్డి అమెరికా మహిళల క్రికెట్‌ జట్టుకు ఎంపికైంది. 14 ఏళ్ల పాటు హైదరాబాద్ క్రికెట్‌కు సేవలందించిన సింధుజ రెడ్డి ప్రస్తుతం అమెరికా ఉమెన్ జాతీయ క్రికెట్ జట్టులో కీలక పాత్ర పోషిస్తుంది.

సిద్ధార్ద రెడ్డిని విహవాం చేసుకుని అమెరికాకు వెళ్లిన తర్వాత క్రికెట్ ఇక ఆడలేనేమో అనుకుంది. అయితే అనూహ్యంగా ఆమెకు యుఎస్ క్రికెట్ జట్టు తరుపున ఆడే అవకాశం వచ్చింది. ఈ ఏడాది ఆగస్టులో స్కాట్లాండ్ వేదికగా జరగనున్న వరల్డ్ టీ20 క్వాలిఫయిర్స్‌లో ఆమె అమెరికా ఉమెన్ క్రికెట్ జట్టు తరుపున పాల్గొంటుంది.

Hyderabadi girl Sindhuja squeezes into US cricket team

అటు వికెట్ కీపర్‌గా ఇటు ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా సత్తా చాటేందుకు సిద్ధమైంది. ఈ సెలక్షన్ ట్రైయిల్స్‌కు వెళ్లడానికి ముందు అనేక లోకల్ క్లబ్స్ తరుపున సింధుజ క్రికెట్ ఆడింది. ఈ సమయంలో ఎన్నో అవరోధాలు ఆమెకు ఎదురయ్యాయి. ఈ సెలక్షన్ ట్రయిల్స్‌లో పాల్గొనాలంటే మినియం రెండేళ్ల పాటు అమెరికా నివసించి ఉండాలి.

అయితే ఈ నిబంధనకు గాను ఆమె మూడు నెలలు తక్కువయ్యాయి. అయితే ఆమె టాలెంట్‌ని గుర్తించి సెలక్టర్లకు ఆమెకు అవకాశం ఇచ్చారు, ఏడు ఫ్రెంచ్ మ్యాచ్‌ల్లో ఆడిన సింధుజ అటు బ్యాటింగ్‌తో పాటు ఇటు వికెట్ కీపింగ్‌లో సెలక్టర్ల దృష్టిని తనవైపుకి తిప్పుకుంది. దీంతో ఆమె అమెరికా మహిళల జట్టు తరుపున ఐసీసీ వరల్డ్ కప్‌లో పాల్గొననుంది.

హైదరాబాద్‌కు చెందిన సింధుజ 12 ఏళ్ల వయసు నుంచే క్రికెట్ పట్ల ఆసక్తిని పెంచుకుంది. హిమయత్ నగర్‌లోని సెయింట్ ఆంటోని మిడిల్ స్కూల్‌లో స్కూలింగ్ పూర్తి చేసింది. ఆ తర్వాత నారాయణగూడలోని కేశవ్ మోమొరియల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ పూర్తి చేసింది.

తొలుత ఆమెకు విజయ్ కుమార్ కోచ్‌గా ఉన్నారు. ఆ తర్వాత మాజీ మహిళా క్రికెటర్ పూర్ణిమా రావు వద్ద ఆమె కోచింగ్ మెళకువలు నేర్చుకున్నారు. తొమ్మిది, పదో తరగతిలలోనే సింధుజ స్టేట్ స్కూల్ టీమ్ తరుపున కెప్టెన్‌గా వ్యవహరించారు.

అంతేకాదు హైదరాబాద్ తరుపున అండర్-16, అండర్-19 కేటగిరిలలో కూడా ఆడింది. 2008లో భారత్ తరుపున అండర్-19 కేటగిరికి ప్రాతినిథ్యం వహించింది. ఆ తర్వాత షిమ్లాలో అండర్-19 జట్టుకు నిర్వహించిన ట్రైనింగ్ క్యాంపులో కూడా పాల్గొంది. అమెరికా జట్టుకు సింధుజరెడ్డి ఎంపిక పట్ల ఆమె తల్లిదండ్రులు గడ్డం స్పురధర్‌రెడ్డి, లక్ష్మిరెడ్డి ఆనందం వ్యక్తంజేశారు.

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X