న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఫైనల్‌‌కు చేరి చరిత్ర సృష్టించిన పాక్: ఇంగ్లాండ్‌పై ఘన విజయం

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ తొలి సెమీఫైనల్‌కు సర్వం సిద్ధమైంది. టోర్నీలో భాగంగా బుధవారం జరిగే తొలి సెమీఫైనల్లో ఇంగ్లాండ్-పాకిస్థాన్ జట్లు తలపడుతున్నాయి.

By Nageshwara Rao

హైదరాబాద్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ ఫైనల్‌లోకి చేరింది. ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఆతిథ్య ఇంగ్లాండ్‌ను చిత్తుగా ఓడించి తొలిసారి ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌కు అర్హత సాధించింది.

టోర్నీలో ఓటమెరుగని ఇంగ్లాండ్ జట్టుని ఓడించి ఇంటికి సాగనంపింది. పాక్ బౌలర్ల సమిష్టి ప్రదర్శనతో ఆకట్టుకోగా.. బ్యాట్స్‌మెన్స్‌ తమ బాధ్యతను నిర్వర్తించి విజయాన్ని అందించారు. 212 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ 37.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 215 పరుగులు చేసి లక్ష్యాన్ని చేధించింది.

Pakistan elect to bowl against England

పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్లలో అజహర్ అలీ 76 (5 ఫోర్లు, ఒక సిక్స్), ఫఖ్హర్ జమన్ 57 (7 ఫోర్లు, ఒక సిక్స్), బాబర్ అజమ్ 38 (నాటౌట్), మహ్మద్ హఫీజ్ 31(నాటౌట్) పరుగులతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. పాక్ ఓపెనర్లు అజార్‌, ఫకార్‌లు అర్ధ సెంచరీలతో చెలరేగడంతో రెండో వికెట్‌కు 118 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పారు. తొలుత 49 బంతుల్లో ఫకార్‌ అర్ద సెంచరీ చేయగా, అజార్‌ 68 బంతుల్లో అర్ధసెంచరీని నమోదు చేశాడు.

వీరి సెంచరీ భాగస్వామ్యానికి ఇంగ్లాండ్‌ నిర్ధేశించిన లక్ష్యం చిన్నబోయింది. అంతకముందు టోర్నీలో ఆడినా మూడు మ్యాచుల్లో 300కు పైగా పరుగులు చేసిన ఇంగ్లండ్‌ను పాక్‌ 211 పరుగులకే కుప్పకూల్చింది.

Pakistan elect to bowl against England

ఛాంపియన్స్‌ ట్రోఫీ చరిత్రలో పాక్‌కు అత్యధిక ఓపెనింగ్‌ భాగస్వామ్యం
జమాన్‌, అజార్‌ జోడీ ఛాంపియన్స్‌ ట్రోఫీ చరిత్రలో పాక్‌కు అత్యధిక ఓపెనింగ్‌ భాగస్వామ్యం నెలకొల్పారు. అంతకు ముందు 2000లో శ్రీలంకపై సయీద్‌ అన్వర్‌, నాజిర్‌ జోడీ 90, 2002లో నెదర్లాండ్స్‌పై 85 పరుగుల ఓపెనింగ్‌ భాగస్వామ్యాలు అందించారు. ఇక ఇంగ్లాండ్‌పై 1974లో మాజిద్‌ఖాన్‌, సాధిఖ్‌ మహ్మద్‌ తొలి వికెట్‌కు నెలకొల్పిన 113 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని 118తో బద్దలు కొట్టారు.


పాక్ విజయ లక్ష్యం 212

అంతకముందు ఇంగ్లాండ్‌తో జ‌రిగిన తొలి సెమీ పైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్ బౌలర్లు అదరగొట్టారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 49.5 ఓవర్లలో 211 పరుగులు చేసి ఆలౌటైంది. దీంతో పాకిస్థాన్‌కు విజయ లక్ష్యం 212 పరుగులుగా నిర్దేశించింది.

ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్లలో జో రూట్ 46, బెయిర్ స్టో 43, బెన్ స్టోక్స్ 34, మోర్గాన్ 33, హేల్స్ 13, అలీ 11 పరుగులతో రాణించారు. పాకిస్థాన్ బౌలర్లలో హాసన్ అలీ మూడు వికెట్లు తీయగా, జునైద్ ఖాన్, రాయిస్ చెరో రెండు వికెట్లు తీయగా, షాదబ్ ఖాన్ ఒక వికెట్ తీశాడు.

ఇంగ్లాండ్ టాపార్డర్ కుప్పకూలిందిలా:

పట్టు బిగించిన పాక్, కుప్పకూలిన ఇంగ్లాండ్ టాపార్డర్

ఛాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా ఇంగ్లాండ్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ ప‌ట్టు బిగించింది. పాకిస్థాన్ బౌలర్లు చెలరేగడంతో ఇంగ్లాండ్ టాపార్డ‌ర్ కుప్పకూలింది. 47 ఓవర్లకు గాను ఇంగ్లాండ్ 7 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. బెన్ స్టోక్స్ 33, ప్లంకెట్ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ ఇంగ్లాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.

మొయిన్‌ అలీ అవుట్

ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా పాకిస్థాన్‌ బౌలర్లు సత్తా చాటుతున్నారు. అద్భుతమైన బౌలింగ్‌తో ఇంగ్లాండ్‌ టాపార్డర్‌ను కుప్పకూల్చారు. జునైద్‌ఖాన్‌ వేసిన 38.3వ బంతికి మొయిన్‌ అలీ 11 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జమాన్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. దీంతో 40 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లాండ్‌ 6 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. అలీ అవుటైన తర్వాత ఆదిల్‌ రషీద్‌ బ్యాటింగ్‌కు వచ్చాడు.

Ali

కుప్పకూలిన ఇంగ్లాండ్ టాపార్డర్
పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి సెమీస్‌ ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ తడబడుతోంది. 148 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మోర్గాన్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన జోస్ బట్లర్ 4 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. 36 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లాండ్ 5 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. ప్రస్తుతం బెన్ స్టోక్స్ 8, మెయిన్ అలీ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు.

నాలుగో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్

పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి సెమీస్‌ ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ నాలుగో వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 141 పరుగుల వద్ద ఇంగ్లాండ్ కెప్టెన్ మోర్గాన్ అవుటయ్యాడు. 33 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హాసన్ అలీ బౌలింగ్‌లో కీపర్ సర్ఫరాజ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. మోర్గాన్ అవుటైన తర్వాత జోస్ బట్లర్ క్రీజులోకి వచ్చాడు. 34 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లాండ్ 4 వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో జోస్ బట్లర్ 4, బెన్ స్టోక్స్ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు.

Morgan

జోరూట్ అవుట్: మూడో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్
పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి సెమీస్‌ ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ మూడో వికెట్ కోల్పోయింది. 56 బంతుల్లో 2 ఫోర్ల సాయంతో 46 పరుగులు చేసిన జోరూట్ షాదబ్ ఖాన్ బౌలింగ్‌లో కీపర్ సర్ఫరాజ్‌కు క్యాచ్ ఇచ్చి మూడో వికెట్‌గా పెవిలియన్‌కు చేరాడు. దీంతో 27.3 ఓవర్లకు గాను ఇంగ్లాండ్ మూడు వికెట్లు కోల్పోయి 128 పరుగులు చేసింది. జో రూట్ అవుటైన తర్వాత బెన్ స్టోక్స్ క్రీజులోకి వచ్చాడు. ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ 30, బెన్ స్టోక్స్ 3 పరుగులతో క్రీజులో ఉన్నారు.

రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్
పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి సెమీస్‌ ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ రెండో వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 80 పరుగుల వద్ద బెయిర్ స్టో అవుట్ కావడంతో ఇంగ్లాండ్ రెండో వికెట్‌ను కోల్పోయింది. జో రూట్‌తో కలిసి బెయిస్ స్టో 46 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. బెయిర్ స్టో అవుటైన తర్వాత క్రీజులోకి కెప్టెన్ మోర్గాన్ వచ్చాడు. 19 ఓవర్లు ముగిసి సరికి ఇంగ్లాండ్ రెండు వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసింది. ప్రస్తుతం జో రూట్ 30, మోర్గాన్ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు.

Pakistan elect to bowl against England

తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్
ఛాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి సెమీస్‌ ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ తొలి వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 34 పరుగుల వద్ద హేల్స్‌ 13 పరుగుల వద్ద రాయిస్ బౌలింగ్‌లో బాబర్ అజాంకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. హేల్స్ అవుటైన తర్వాత జో రూట్ క్రీజులోకి వచ్చాడు. 15 ఓవర్లు ముగిసి సరికి ఇంగ్లాండ్ వికెట్ నష్టానికి 77 పరుగులు చేసింది. ప్రస్తుతం జో రూట్ 23, బెయిర్ స్టో 41 పరుగులతో క్రీజులో ఉన్నారు.

నిలకడగా ఆడుతోన్న ఇంగ్లాండ్
ఛాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి సెమీస్‌ ఫైనల్ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఇంగ్లాండ్‌ నిలకడగా ఆడుతోంది. ఐదు ఓవర్లు ముగిసే సరికి వికెట్‌ నష్టపోకుండా 29 పరుగులు చేసింది. ఓపెనర్లు అలెక్స్‌ హేల్స్‌ (13), జానీ బెయిర్‌స్టో (16) క్రీజులో ఉన్నారు. రయీస్‌ వేసిన నాలుగో ఓవర్‌ చివరి బంతికి హేల్స్‌ ఎల్బీడబ్ల్యూ ప్రమాదం తప్పించుకున్నాడు.

టాస్ గెలిచిన పాక్, ఇంగ్లాండ్ బ్యాటింగ్

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ తొలి సెమీఫైనల్‌కు సర్వం సిద్ధమైంది. టోర్నీలో భాగంగా బుధవారం జరిగే తొలి సెమీఫైనల్లో ఇంగ్లాండ్-పాకిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. కార్డిఫ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది.

శ్రీలంక‌తో మ్యాచ్ గెలుపులో కీల‌క‌పాత్ర పోషించిన మ‌హ్మ‌ద్ ఆమిర్ గాయం కార‌ణంగా ఈ మ్యాచ్‌కు దూర‌మ‌య్యాడు. ఇక ఇంగ్లాండ్ ఓపెన‌ర్ జేస‌న్ రాయ్ స్థానంలో బెయిర్‌స్టోని తుది జట్టులోకి తీసుకుంది.

ICC Champions Trophy 2017: Semi-final 1: Pakistan elect to bowl against England

ప్రస్తుతం జరుగుతున్న టోర్నీలో ఓటమి ఎరుగని ఇంగ్లాండ్ గ్రూప్-ఎలోని అన్ని జట్లని ఓడించి సెమీస్‌కు చేరిన సంగతి తెలిసినందే. మరోవైపు భారత్ చేతిలో ఓడినప్పటికీ, ఆ తర్వాత పుంజుకుని దక్షిణాఫ్రికా, శ్రీలంకపై గెలిచిన పాకిస్థాన్ ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది.

ఇదిలా ఉంటే ఇంగ్లాండ్‌-పాకిస్థాన్‌ ఐసీసీ టోర్నీల్లో పదిసార్లు తలపడగా ఇంగ్లాండ్‌ ఆరుసార్లు గెలిచి ముందంజలో ఉంది. ఐసీసీ వన్డే టోర్నీలో ఈ రెండు జట్లు చివరిగా 2003 ప్రపంచకప్‌లో తలపడగా.. విజయం ఇంగ్లాండ్‌నే వరించింది. వన్డే చరిత్రలోనే అత్యధిక స్కోరు 444 పరుగులు ఇంగ్లాండ్ చేసింది పాకిస్థాన్‌పైనే కావడం విశేషం.

ఏ రకంగా చూసినా... అన్ని రంగాల్లో ఇంగ్లాండ్ జట్టే పటిష్టంగా కనిపిస్తోంది. మరోవైపు 'సంచలనం' అనేది ఒకటుంటుందిగా... అదే మమ్మల్ని గెలిపిస్తుందనే ధైర్యంతో సర్ఫరాజ్‌ సేన బరిలోకి దిగుతోంది. మూడు సార్లు వరల్డ్ కప్ ఫైనల్‌కు చేరుకున్నా... గత 42 ఏళ్లలో ఐసీసీ ట్రోఫీని అందుకోలేక పోవడం విశేషం.

2015 వన్డే వరల్డ్ కప్‌లో లీగ్‌ దశలోనే ఇంటి దారి పట్టిన అనంతరం కళ్లు తెరిచిన ఇంగ్లండ్‌ జట్టు ఏడాది తిరిగేలోపే ప్రపంచంలోని మేటి జట్లలో ఒకటిగా తయారైంది. భీకరమైన బ్యాటింగ్‌ లైనప్‌, అద్భుతమైన బౌలింగ్‌, మంచి ఆల్‌రౌండర్లతో నిండి ఉన్న ఇంగ్లాండ్‌ను సొంతగడ్డపై ఆపడం పాక్‌కు తలకు మించిన భారమే.

మోర్గాన్‌, రూట్‌, స్టోక్స్‌ మంచి ఫామ్‌లో ఉండడం ఇంగ్లాండ్‌కు కలిసొచ్చే అంశం. వ్యక్తిగతంగా చూస్తే బెన్‌ స్టోక్స్‌ ప్రపంచ క్రికెట్‌లోనే అత్యుత్తమ ఆల్‌రౌండర్‌. బ్యాట్‌తోనైనా, బాల్‌తోనైనా మ్యాచ్‌ స్థితిని ఒంటిచేత్తో మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేయగల సమర్ధుడు. బ్యాటింగ్‌లో అలెక్స్‌ హేల్స్, జో రూట్, జోస్‌ బట్లర్‌లతో కూడిన టాప్‌ ఆర్డర్‌ అద్భుతమైన ఫామ్‌లో ఉంది.

జట్ల వివరాలు:

ఇంగ్లాండ్: అలెక్స్ హేల్స్, బారిస్టో, జో రూట్, మోర్గాన్, బెన్ స్టోక్స్, జోస్ బట్లర్, మొయిన్ అలీ, అదిల్ రషీద్, ఫ్లంకెట్, మార్క్‌వుడ్, జాక్ బాల్

పాకిస్థాన్: అజహర్ అలీ, ఫఖార్ జమామ్, బాబర్ అజామ్, మహ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్, సర్ఫరాజ్ అహ్మద్, ఇమాద్ వసీమ్, రుమాన్ రేస్, షదాబ్ ఖాన్, హసన్ అలీ, జునైద్ ఖాన్

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X