న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఛాంపియన్స్ ట్రోఫీ: సఫారీలపై భారత్ విజయం, సెమీస్‌లో బంగ్లాతో ఢీ

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం భారత్-దక్షిణాఫ్రికా జట్ల తలపడతున్నాయి. ది ఓవల్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది.

By Nageshwara Rao

హైదరాబాద్: ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా సెమీ ఫైనల్‌కు చేరింది. టోర్నీలో భాగంగా అదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టీమండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 192 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కోహ్లీ సేన 38 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది.

భారత బ్యాట్స్‌మెన్లలో శిఖర్ ధవాన్ 78, కోహ్లీ 76(నాటౌట్), యువరాజ్ సింగ్ 23(నాటౌట్), రోహిత్ శర్మ 12 పరుగులు చేశారు. అంతకముందు ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాప్రికా 44.3 ఓవర్లకు 191 పరుగులు చేసి ఆలౌట్ అయింది.

తాజా విజయంతో టీమిండియా సెమీస్‌కు చేరగా, దక్షిణాఫ్రికా టోర్నీ నుంచి వైదొలగింది. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్ సెమీఫైనల్ చేరాయి. ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ పైనల్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో టీమిండియా తలపడనుంది. సోమవారం పాక్, శ్రీలంక జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఇంగ్లండ్‌తో తలపడనుంది.


అర్ధ సెంచరీలతో కదం తొక్కిన ధావన్, కోహ్లీ
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న కీలక వన్డేలో టీమిండియా 28 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్‌ నష్టపోయి 142 పరుగులు చేసింది. ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ (75), కెప్టెన్ విరాట్‌ కోహ్లీ (51) అర్ధ సెంచరీలతో రాణించారు. ఓపెనర్ శిఖర్ ధావన్ 61 బంతుల్లో 8 ఫోర్లు 1 సిక్సర్‌తో 53 పరుగులతో అర్ధసెంచరీ సాధించాడు.

Kohli and Dhawan

ఐసీసీ టోర్నీల్లో ధావన్ తన జైత్రయాత్రను కొనసాగిస్తున్నాడు. ఛాంపియన్స్‌ ట్రోఫీలో వరుసగా మూడోసారి 50కి పైగా పరుగులు చేశాడు. టోర్నీలో టాప్‌ స్కోరర్‌గా అవతరించాడు. మరోవైపు కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా అర్ధ సెంచరీ చేశాడు. 71 బంతుల్లో 5 ఫోర్లు ఒక సిక్సర్‌తో 50 పరుగులు నమోదు చేశాడు. వన్డేల్లో కోహ్లీకి ఇది 41వ అర్ధ సెంచరీ. టీమిండియా విజయానికి ఇంకా 51 పరుగులు చేయాల్సి ఉంది. అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 44.3 ఓవర్లకు 191 పరుగులు చేసి ఆలౌటయ్యింది.

Rohit

తొలి వికెట్ కోల్పోయిన భారత్

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న కీలక వన్డేలో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. మోర్నీ మార్కెల్ వేసిన 6వ ఓవర్ మూడో బంతికి ఓపెనర్ రోహిత్ శర్మ(12) కీపర్ డికాక్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.
దీంతో టీమిండియా 5.3 ఓవర్లకు గాను ఒక వికెట్ కోల్పోయి 23 పరుగులు చేసింది. భారత్ విజయం సాధించాలంటే ఇంకా 169 పరుగులు చేయాలి. రోహిత్ శర్మ అవుటైన తర్వాత కెప్టెన్ కోహ్లీ క్రీజులోకి వచ్చాడు.

ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా ఆదివారం ది ఓవల్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో టీమిండియా తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికాను ఏ దశలోనూ సఫారీలను తేరుకోనీయకుండా చేసి భారత్ పైచేయి సాధించింది.

అంతకముందు దక్షిణాఫ్రికా 44.3 ఓవర్లలో 191 పరుగులకే ఆలౌటైంది. దీంతో టీమిండియాకు 192 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత బౌలర్ల దెబ్బకు దక్షిణాఫ్రికా టాపార్డర్ పేకమేడలా కూలిపోయింది. కనీసం రెండొందల మార్కును కూడా దాటలేకపోయింది. టీమిండియా కట్టుదిట్టమైన బౌలింగ్, ఫీల్డింగ్‌తో దక్షిణాఫ్రికాపై చెలరేగారు.

దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్లలో డికాక్‌(53), ఆమ్లా(35), డుప్లెసిస్‌(36), డివిలియర్స్‌(16), డుమిని(19) మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్‌లెవరూ రెండంకెల స్కోరును కూడా చేయకపోవడం విశేషం. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, జాస్ప్రిత్ బుమ్రా చెరో రెండు వికెట్లు తీయగా అశ్విన్, హార్దిక్ పాండ్యా, జడేజా తలో వికెట్ తీశారు.

ఈ మ్యాచ్‌లో నెగ్గిన జట్టు సెమీస్‌కు చేరనుండగా ఓడిన జట్టు ఛాంపియన్స్ టోర్నీ నుంచి వైదొలగనుంది.


అంతకముందు దక్షిణాఫ్రికా బ్యాటింగ్ తీరు సాగిందిలా:

డుప్లెసిస్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన హర్దిక్ పాండ్యా
ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఐదో వికెట్ కోల్పోయింది. భారత బౌలర్లు క్రమంగా వికెట్లు తీస్తున్నారు. హార్దిక్ పాండ్యా వేసిన 34వ ఓవర్‌ మూడో బంతికి డుప్లెసిస్(50) క్లీన్ బౌల్డయ్యాడు. దీంతో దక్షిణాఫ్రికా జట్టు స్కోర్ 33.3 ఓవర్లు ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది.

ఆటను మార్చివేసిన మూమెంట్:

వింత ఘటన: ఒక వైపుకే ఇద్దురు పరిగెత్తారు
ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా తడబడుతోంది. దక్షిణాఫ్రికా నాలుగో వికెట్ కోల్పోయింది. అయితే ఈ వికెట్‌ను దక్షిణాఫ్రికా వింతగా ద్వారా పొగొట్టుకుంది. అశ్విన్ వేసిన 30వ ఓవర్‌లో డుప్లెసిస్ సింగిల్ తీసేందుకు ప్రయత్నించాడు. అయితే మధ్యలో సింగిల్ తీయాలా వద్దా అన్న అయోమయంలో డుప్లెసిస్, డేవిడ్ మిల్లర్ కలిసి ఒకేసారి బ్యాటింగ్ ఎండ్‌ వైపుకు పరిగెత్తారు. దీంతో ఫీల్డింగ్ చేస్తున్న బుమ్రా బంతిని బౌలింగ్ ఎండ్‌కు విసరడంతో దాన్ని అందుకున్న కోహ్లీ వికెట్లను పడగొట్టాడు. ఈ రనౌట్‌ను పరీక్షించిన టీవీ అంపైర్ డేవిడ్ మిల్లర్‌(1)నే అవుట్‌గా ప్రకటించాడు. దీంతో జట్టు స్కోర్ 30 ఓవర్లు ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేసింది.

డివిలియర్స్ అవుట్: కుప్పకూలిన దక్షిణాఫ్రికా టాపార్డర్
ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా తడబడుతోంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తోన్న దక్షిణాఫ్రికా జట్టు మూడో వికెట్ కోల్పోయింది. 29వ ఓవర్‌లో కెప్టెన్ డివీలియర్స్ రనౌట్ అయ్యాడు. జడేజా బౌలింగ్‌లో డుప్లెసిస్ సింగల్ తీసేందుకు ప్రయత్నించగా బ్యాటింగ్ ఎండ్‌కు రన్నింగ్ చేస్తున్న డివిలియర్స్‌ను హార్దిక్‌ పాండ్యా విసిరిన బంతితో ధోనీ రనౌట్ చేశాడు. దీంతో 29 ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా 3 వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది. డివిలియర్స్ అవుటైన తర్వాత డేవిడ్ మిల్లర్ క్రీజులోకి వచ్చాడు. ప్రస్తుతం డుప్లెసిస్ 28, డేవిడ్ మిల్లర్ ఒక పరుగుతో క్రీజులో ఉన్నారు.

AB

రెండు వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా
ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా రెండో వికెట్ కోల్పోయింది. ఈ క్రమంలో అర్ధ సెంచరీ చేసిన క్వింటన్ డికాక్‌నను రవీంద్ర జడేజా అవుట్ చేశాడు. 72 బంతుల్లో 53 పరుగులు చేసిన డికాక్ జడేజా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో దక్షిణాఫ్రికా 24.2 ఓవర్లకు రెండు వికెట్లు కోల్పోయి 116 పరుగులు చేసింది. డీకాక్ అవుటైన తర్వాత క్రీజులోకి ఏబీ డివిలియర్స్ క్రీజులోకి వచ్చాడు.

డీకాక్ అర్ధసెంచరీ
ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఓపెనర్ డీడాక్ అర్ధ సెంచరీని నమోదు చేశాడు. 68 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో డీకాక్ అర్ధ సెంచరీ సాధించాడు. వన్డేల్లో డీడాక్‌కి ఇది 14వ అర్ధసెంచరీ. 24 ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా ఒక వికెట్ నష్టానికి 116 పరుగులు చేసింది. డీకాక్ 53, డుప్లెసిస్ 20 పరుగులతో క్రీజులో ఉన్నారు.

India win the toss and elect to field first against South Africa

కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేస్తోన్న టీమిండియా
ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. భారత బౌలర్ల దెబ్బకు దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ ఒత్తిడికి గురవుతున్నారు. తొలి పది ఓవర్లు ముగిసే సరికి సఫారీలు వికెట్‌ నష్టపోకుండా 35 పరుగులు చేశారు.

ఆ తర్వాత పది ఓవర్లకు గాను వికెట్ నష్టపోయి 59 పరుగులు చేసింది. దీంతో 20 ఓవర్లు ముగిసేసరికి ఒక వికెట్ నష్టానికి దక్షిణాఫ్రికా 94 పరుగులు చేసింది. ప్రస్తుతం డికాక్ 42, డుప్లెసిస్ 10 పరుగులతో క్రీజులో ఉన్నారు.

తొలి వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా
ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా తొలి వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 76 పరుగుల వద్ద ఓపెనర్ ఆమ్లా అవుటయ్యాడు. 54 బంతులను ఎదుర్కొన్న ఆమ్లా 3 ఫోర్లు, ఒక సిక్సు సాయంతో 35 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అశ్విన్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. ఆమ్లా అవుటైన తర్వాత డుప్లెసిస్ క్రీజులోకి వచ్చాడు. 19 ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా వికెట్ నష్టానికి 84 పరుగులు చేసింది. ప్రస్తుతం డీకాక్ 37, డుప్లెసిస్ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు.

ఛాంపియన్స్‌ ట్రోఫీలో సఫారీలకు అత్యధిక భాగస్వామ్యం

ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా నిలకడగా ఆడుతోంది. 15 ఓవర్లు ముగిసే సరికి ఆ జట్టు వికెట్‌ నష్టపోకుండా 62 పరుగులు చేసింది. ఆమ్లా (27), డికాక్‌ (30) పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుత ఛాంపియన్స్‌ ట్రోఫీలో సఫారీలకు ఇదే అత్యధిక ఓపెనింగ్‌ భాగస్వామ్యం కావడం గమనార్హం. హార్ధిక్ పాండ్యా వేసిన 15వ ఓవర్‌ తొలి బంతిని సిక్సర్‌, ఐదో బంతిని బౌండరీగా మలిచాడు.

నిలకడగా ఆడుతున్న దక్షిణాఫ్రికా

ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా భారత్‌-దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఓపెనర్లు నిలకడగా ఆడుతున్నారు. 10 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా దక్షిణాఫ్రికా 35 పరుగులు చేసింది. ఓపెనర్లు ఆమ్లా 11, డీకాక్ 20 పరుగులతో క్రీజులో ఉన్నారు. భువీ బౌలింగ్‌లో ఆమ్లాకు ఓ లైఫ్ లభించింది. 2.3 ఓవర్‌లో భువీ వేసిన బంతిని ఆమ్లా డిఫెన్స్‌ ఆడి రన్‌కు యత్నించాడు. వెంటనే స్పందించిన కోహ్లీ బంతిని నేరుగా వికెట్ల వైపునకు విసరగా, అది తగలకపోవడంతో ఆమ్లా రనౌటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.

టాస్ గెలిచిన టీమిండియా

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం భారత్-దక్షిణాఫ్రికా జట్ల తలపడతున్నాయి. ది ఓవల్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలి మ్యాచ్‌లో పాక్‌పై విజయం సాధించినప్పటికీ, రెండో మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో ఓడిపోవడంతో ఈ మ్యాచ్‌ తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కీలక మ్యాచ్‌లో భారత జట్టులో ఒక మార్పు చోటు చేసుకుంది. పేసర్ ఉమేశ్ యాదవ్ స్ధానంలో ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కి తుది జట్టులో చోటు కల్పించారు.

India win the toss and elect to field first against South Africa

టాస్ అనంతరం కోహ్లీ 'ప్రస్తుత టోర్నీలో జట్లన్నీ లక్ష్యాన్ని సులభంగా ఛేదిస్తున్నాయి. బ్యాటింగ్ అనంతరం మేం ఏం చేయాలో మాకు బాగా తెలుసు. ముగిసిన రెండు ఆటల్లోనూ బ్యాటింగ్‌లో చక్కగా రాణించాం. అయితే శ్రీలంక మ్యాచ్‌లో వారిని అడ్డుకోలేకపోయాం. ప్రస్తుతం ఉమేష్‌ స్థానంలో అశ్విన్‌ను తీసుకుంటున్నాం' అని అన్నాడు.

టోర్నీలో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా తొలుత బ్యాటింగ్ చేస్తోంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు ఎంతో కీలకం. ఈ మ్యాచ్‌లో ఓటమి పాలైన జట్టు ఇంటి దారి పట్టాల్సిందే. ఇంగ్లాండ్‌లో ఫాస్ట్ పిచ్‌ల నేపథ్యంలో స్పిన్నర్ అయిన అశ్విన్‌ను గత రెండు మ్యాచ్‌ల్లో పక్కకు పెట్టారు. అయితే దక్షిణాఫ్రికా జట్టులో క్వింటన్‌ డికాక్‌, జేపీ డుమిని, డేవిడ్‌ మిల్లర్‌ వంటి నాణ్యమైన లెఫ్టాండ్‌ బ్యాట్స్‌మెన్‌ ఉన్నందున ప్రధాన స్పిన్నర్ అశ్విన్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు.

ఎడమచేతి వాటం ఆటగాళ్లు ఆఫ్ బ్రేక్ బౌలింగ్‌ను ఎదుర్కోవడం కష్టం కనుక అశ్విన్‌ను ప్రధాన అస్త్రంగా విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌లో ప్రయోగిస్తున్నాడు. ఒక‌వేళ వ‌ర్షం ప‌డి మ్యాచ్ ర‌ద్ద‌యితే మెరుగైన నెట్ ర‌న్‌రేట్ ఉన్న టీమిండియా సెమీఫైన‌ల్‌కు వెళ్తుంది.

శ్రీలంక-భారత్‌ మ్యాచ్ జరిగిన ది ఓవల్ పిచ్‌లోనే ఇరు జట్లు తలపడుతున్నాయి. బ్యాటింగ్‌కు స్వర్గధామమైన ఈ పిచ్‌పై గత మూడు మ్యాచ్‌ల్లోనూ భారీ స్కోర్లు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఈ స్టేడియంలో టాస్‌ నెగ్గిన జట్టు ఛేదనకే మొగ్గు చూపుతూ వచ్చింది. తాజాగా కోహ్లీ సేన కూడా ఫీల్డింగ్ ఎంచుకోవడం విశేషం.

జట్ల వివరాలు:
భారత్‌: రోహిత్‌, ధవన్‌, కోహ్లీ (కెప్టెన్‌), యువరాజ్‌, ధోనీ (కీపర్‌), కేదార్‌, హార్దిక్‌, అశ్విన్‌, జడేజా, భువనేశ్వర్‌, బుమ్రా.

దక్షిణాఫ్రికా:
డికాక్‌ (కీపర్‌), ఆమ్లా, డుప్లెసిస్‌, డివిల్లీర్స్‌ (కెప్టెన్‌), మిల్లర్‌, డుమిని, పార్నెల్‌, మోరిస్‌, రబాడ, మోర్కెల్‌, తాహిర్‌.

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X