న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఉమెన్ వరల్డ్ కప్: విజేతగా ఇంగ్లాండ్, పోరాడి ఓడిన మిథాలీ సేన

ఉమెన్ వరల్డ్ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో ప్రారంభమైంది. లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరిగే ఈ ఫైనల్లో ఇండియా, ఇంగ్లాండ్ జట్లు తలపడుతున్నాయి.

By Nageshwara Rao

హైదరాబాద్: ఉమెన్ వరల్డ్ కప్ విజేతగా ఇంగ్లాండ్ అవతరించింది. లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా భారత్‌తో జరిగిన ఫైనల్లో ఆతిధ్య ఇంగ్లాండ్ జట్టు 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. 229 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 48.4 ఓవర్లలో 219 పరుగులు చేసి ఆలౌటైంది.

భారత బ్యాట్స్ ఉమెన్లలో ఓపెనర్‌ పూనమ్‌ రౌత్‌(86) టాప్‌ స్కోరర్‌గా నిలిచింది. స్మృతి మిథాలీ రాజ్ 17, హర్మన్ ప్రీత్ కౌర్ 51, రౌత్ 86, వేద కృష్ణమూర్తి 35, పాండే 4, దీప్తీ శర్మ 14 పరుగులు చేయగా మందాన, స్మృతీ వర్మ, గైక్వాడ్ డకౌట్‌గా వెనుదిరిగారు.

ఇంగ్లాండ్‌ బౌలర్లలో ష్రుబ్‌షోలే 4/45తో భారత వికెట్ల పతనంలో కీలక పాత్ర పోషించింది. అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బ్యాట్స్ ఉమెన్లలో స్కీవర్‌ (51) టాప్‌ స్కోరర్‌గా నిలవగా టేలర్‌(45) రాణించింది. ఇంగ్లాండ్‌కిది నాలుగో వ‌ర‌ల్డ్‌క‌ప్‌ కావడం విశేషం.


భారత్ బ్యాటింగ్ తీరు సాగిందిలా:

వెంట వెంటనే రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా
లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా వెంట వెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. 229 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ వేదా కృష్ణమూర్తి (35), ఝలన్ గోస్వామి డకౌట్‌గా వెనుదిరిగారు. దీంతో 45 ఓవర్లకు గాను భారత్ 7 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది.

86 పరుగుల వద్ద పూనమ్ అవుట్

లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న వరల్డ్ కప్ ఫైనల్లో పూనమ్ రౌత్ 86 పరుగుల స్కోరు వద్ద అవుటైంది. కీలక వికెట్లు పడుతున్నా ఒంటరిగా పోరాడిన పూనమ్‌ రౌత్ ఇన్నింగ్స్‌ ఆకట్టుకొంది. సెంచరీ చేస్తుందనుకునే సమయానికి ఇన్నింగ్స్‌ 42.5వ బంతికి ఆమె ఎల్బీగా వెనుదిరిగింది. ఆ తర్వాతి ఓవర్‌ మూడో బంతికి సుష్మ వర్మ (0) పెవిలియన్‌ చేరింది. దీంతో భారత్ వెంట వెంటనే రెండు వికెట్లు కోల్పోయింది.

Raut

అర్ధ సెంచరీ తర్వాత అవుటైన హర్మన్ ప్రీత్ కౌర్

లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 138 పరుగుల వద్ద హర్మన్ ప్రీత్ కౌర్ 51 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అలెక్స్ బౌలింగ్‌లో బీమాంట్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. హర్మన్ ప్రీత్ కౌర్ అవుటైన తర్వాత క్రీజులోకి వేదా కృష్ణమూర్తి వచ్చింది. ప్రస్తుతం 38 ఓవర్లకు గాను భారత్ 3 వికెట్లు కోల్పోయి 138 పరుగులు చేసింది. విజయావకాశాలు రెండు జట్లకు సమానంగా ఉండటంతో రెండు జట్లలో ఒత్తిడి నెలకొంది. పూనమ్‌, వేద కృష్ణమూర్తి ధాటిగా ఆడితే భారత్‌ వరల్డ్ కప్ గెలవడం ఖాయం. మిథాలీసేన విజయానికి ఇంకా 91 పరుగులు కావాలి.

అర్ధ సెంచరీతో మెరిసిన పూనమ్ రౌత్
229 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ బ్యాట్స్ ఉమెన్ నిలకడగా ఆడుతున్నారు. ఓపెనర్ స్మృతి మందాన 75 బంతుల్లో అర్ధ సెంచరీని నమోదు చేసింది. పూనమ్ రౌత్‌కి ఇది 10వ అర్ధ సెంచరీ కావడం విశేషం.
దీంతో 30 ఓవర్లకు గాను టీమిండియా 2 వికెట్లు కోల్పోయి 120 పరుగులు చేసింది. ప్రస్తుతం పూనమ్ రౌత్ 50, హర్మన్ ప్రీత్ కౌర్ 46 పరుగులతో క్రీజులో ఉన్నారు.

మిథాలీ అవుట్: రెండో వికెట్ కోల్పోయిన భారత్
మిథాలీ రాజ్ రూపంలో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. ఇంగ్లాండ్ బౌలర్ మార్ష్ వేసిన 13 ఓవర్ తొలి బంతిని ఎదుర్కొన్న పూనమ్ సింగిల్ తీసేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో బంతి అందుకున్న షివర్ వికెట్ కీపర్‌ టేలర్‌కు బంతి అందించడంతో ఆమె వికెట్లను గిరాటేసింది. దీంతో మిథాలీ రాజ్ ఇంకా క్రీజులోకి చేరుకోలేదు. దీంతో మిథాలీ (17) అవుటైనట్టు థర్డ్ అంపైర్ ప్రకటించాడు. ప్రస్తుతం 13 ఓవర్లు ముగిసే సరికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 44 పరుగులు చేసింది.

Raj

మళ్లీ నిరాశపరిచిన స్మృతి మందాన
229 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. తొలి రెండు మ్యాచుల్లో అద్భుత బ్యాటింగ్‌తో అదరగొట్టిన ఓపెనర్‌ సృతి మందాన డకౌట్‌గా వెనుదిరిగింది. ప్రస్తుతం 2 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టానికి ఆరు పరుగులు చేసింది. కెప్టెన్ మిథాలీ రాజ్ (1), పూనమ్ రౌత్ (2) క్రీజులో ఉన్నారు.

Mandhana

భారత్ విజయ లక్ష్యం 229

అంతకముందు లార్డ్స్ వేదికగా భారత్‌తో జరుగుతున్న వరల్డ్ కప్ ఫైనల్లో ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 228 పరుగులు చేసింది. దీంతో మిథాలీ సేనకు 229 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ బ్యాట్స్ ఉమెన్‌లలో లారెన్ విన్‌ఫీల్డ్ 24, టామీ బీమౌంట్ 23, సారా టేలర్ 45, నటాలీ షివర్ 51, కేథరిన్ బ్రంట్ 34, జెన్నీ గన్ 25, లారా మార్ష్ 14 పరుగులు చేశారు. భారత బౌలర్లలో ఝలన్ గోస్వామి మూడు, పూనమ్ యాదవ్ రెండు, గైక్వాడ్ ఒక వికెట్ తీశారు.


ఇంగ్లాండ్ బ్యాటింగ్ తీరు సాగిందిలా:

ఏడో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్
భారత్‌తో జరుగుతున్న వరల్డ్ కప్ ఫైనల్లో ఇంగ్లాండ్ ఏడో వికెట్ కోల్పోయింది. శిఖా పాండే బౌలింగ్‌లో దీప్తి శర్మ సూపర్ త్రోకు ఇంగ్లండ్ బ్యాట్స్ విమెన్ కేథరిన్ బ్రంట్ రనౌట్ అయింది. ప్రస్తుతం 46 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ ఏడు వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది.

England Women have won the toss and have opted to bat

మ్యాచ్ టర్నింగ్ పాయింట్ ఓవర్ అదే!

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఫైనల్లో మిథాలీసేన వెంటవెంటనే రెండు కీలక వికెట్లు పడగొట్టింది. దీంతో నిలకడగా ఆడుతున్న ఇంగ్లండ్‌ జట్టును భారత పేసర్ ఝులన్ గోస్వామి దెబ్బతీసింది. 63 ప‌రుగుల‌కే 3 వికెట్లు కోల్పోయిన ఆతిథ్య జ‌ట్టును టేల‌ర్ (45), సివ‌ర్ ఆదుకున్నారు. వీళ్లిద్ద‌రూ నాలుగో వికెట్‌కు 83 ప‌రుగులు జోడించారు. ఇంగ్లండ్ భారీ స్కోరు ఖాయ‌మ‌నుకుంటున్న స‌మ‌యంలో ఝుల‌న్ ఒకే ఓవ‌ర్‌లో వ‌రుసగా రెండు బంతుల్లో రెండు వికెట్లు తీసింది. జట్టు స్కోరు 146 పరుగుల వద్ద వరుసగా రెండు వికెట్లు నేలకూల్చి ఇంగ్లండ్‌కు కోలుకోలేని షాకిచ్చింది. జోరుమీదున్న నటాలీని (45) పెవిలియన్ పంపిన గోస్వామి ఆ వెంటనే ఫ్రాన్ విల్సన్‌ను ఎల్బీడబ్ల్యూ చేసింది. ప్రస్తుతం 38 ఓవర్లు ముగిసే సరికి 6 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది.

England Women have won the toss and have opted to bat

164 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్
లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా భారత్‌తో జరుగుతున్న వరల్డ్ కప్ ఫైనల్లో భారత బౌలర్లు సత్తా చాటుతున్నారు. కట్టుదిట్టంగా బౌలింగ్‌‌తో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌ను పెవిలియన్‌కు చేర్చుతున్నారు. తొలి పది ఓవర్లలో ఇంగ్లాండ్‌ ప్రదర్శించిన దూకుడుకు కళ్లెం వేశారు. జట్టు స్కోరు 164 పరుగుల వద్ద ఇంగ్లాండ్ ఆరో వికెట్ కోల్పోయింది. దీంతో 38 ఓవర్లు ముగిసే సరికి 6 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది.

అర్ధ సెంచరీ చేసిన నటాలియా సీవెర్
లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా భారత్‌తో జరుగుతున్న వరల్డ్ కప్ ఫైనల్లో ఇంగ్లాండ్ బ్యాట్స్ ఉమెన్ నథాలీ సీవెర్ అర్ధసెంచరీ చేసింది. 65 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో అర్ధసెంచరీని నమోదు చేసింది. ప్రస్తుతం ఇంగ్లాండ్ 37 ఓవర్లకు గాను 5 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది.

England Women have won the toss and have opted to bat

వెంట వెంటనే రెండు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్
లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా భారత్‌తో జరుగుతున్న వరల్డ్ కప్ ఫైనల్లో ఇంగ్లాండ్ జట్టు ఐదో వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 146 పరుగుల వద్ద ఇంగ్లాండ్ రెండు వికెట్లను కోల్పోయింది. టేలర్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన విల్సన్... ఝలన్ గోస్వామి బౌలింగ్‌లో పరుగులేమీ చేయకుండానే డకౌట్‌గా వెనుదిరిగింది. దీంతో 33 ఓవర్లకు గాను ఇంగ్లాండ్ 5 వికెట్లు కల్పోయి 146 పరుగులు చేసింది. అంతకముందు సారా టేలర్ రూపంలో ఇంగ్లాండ్ జట్టు నాలుగో వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 146 పరుగుల వద్ద సారా టేలర్ (45) ఝలన్ గోస్వామి బౌలింగ్‌లో సుష్మ వర్మకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరింది.

England Women have won the toss and have opted to bat

100 పరుగులు దాటిన ఇంగ్లాండ్ స్కోరు
లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా భారత్‌తో జరుగుతున్న వరల్డ్ కప్ ఫైనల్లో ఇంగ్లాండ్ వంద పరుగుల మైలు రాయిని చేరుకుంది. 25 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ మూడు వికెట్లను కోల్పోయి 104 పరుగులు చేసింది. ప్రస్తుతం నటాలీ సివెర్ 24, సారా టేలర్ 26 పరుగులతో క్రీజులో ఉన్నారు.

England Women have won the toss and have opted to bat

63 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్
లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా భారత్‌తో జరుగుతున్న వరల్డ్ కప్ ఫైనల్లో ఇంగ్లాండ్ మూడో వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 63 పరుగుల వద్ద ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ హీథర్ నైట్ (1) పూనమ్ యాదవ్ బౌలింగ్‌లో ఎల్‌బీడబ్ల్యూగా వెనుదిరిగింది. హీథర్ నైట్ అవుటైన తర్వాత క్రీజులోకి నటాలియా క్రీజులోకి వచ్చింది. ప్రస్తుతం 17 ఓవర్లకు గాను ఇంగ్లాండ్ 3 వికెట్లు కోల్పోయి 64 పరుగులు చేసింది.

60 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్
లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా భారత్‌తో జరుగుతున్న వరల్డ్ కప్ ఫైనల్లో ఇంగ్లాండ్ రెండో వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 60 పరుగుల వద్ద ఓపెనర్ టామీ బీమోంట్ 23 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పూనమ్ యాదవ్ బౌలింగ్‌లో ఝలన్ గోస్వామికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. టామీ బీమోంట్ అవుటైన తర్వాత ఇంగ్లాండ్ కెప్టెన్ హీథర్ నైట్ క్రీజులోకి వచ్చింది. ప్రస్తుతం 16 ఓవర్లకు ఇంగ్లాండ్ రెండు వికెట్ల నష్టానికి 63 పరుగులు చేసింది. టేలర్ 10, హీథర్ నైట్ ఒక పరుగుతో క్రీజులో ఉన్నారు.

England Women have won the toss and have opted to bat

తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్
లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా భారత్‌తో జరుగుతున్న వరల్డ్ కప్ ఫైనల్లో ఇంగ్లాండ్ తొలి వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 47 పరుగుల వద్ద ఓపెనర్ లారెన్ విన్ ఫీల్డ్ 24 పరుగుల వద్ద గైక్వాడ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. విన్ ఫీల్డ్ అవుటైన తర్వాత సారా టేలర్ క్రీజులోకి వచ్చింది. ప్రస్తుతం 12 ఓవర్లకు ఇంగ్లాండ్ వికెట నష్టానికి 50 పరుగులు చేసింది. టేలర్ 3, టామీ బీమోంట్ 19 పరుగులతో క్రీజులో ఉన్నారు.

England Women have won the toss and have opted to bat

10 ఓవర్లకు ఇంగ్లాండ్ 43/0
లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా భారత్‌తో జరుగుతున్న వరల్డ్ కప్ ఫైనల్లో ఇంగ్లాండ్ పది ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 43 పరుగులు చేసింది. ప్రస్తుతం లారెన్ విన్‌ఫీల్డ్ 22, టామీ బీమోంట్ 19 పరుగులతో క్రీజులో ఉన్నారు.

కిక్కిరిసిన లార్డ్స్: మొదలైన మ్యాచ్
లార్డ్స్ వేదికగా భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న వరల్డ్ ఫైనల్ మ్యాచ్‌ను చూసేందుకు ప్రేక్షకులు పోటెత్తారు. లార్డ్స్ మైదానం మొత్తం క్రికెట్ అభిమానులతో కిక్కిరిసిపోయింది. మహిళల మ్యాచ్‌కు ఇంతమంది ప్రేక్షకులు హాజరు కావడం చరిత్రలో ఇదే తొలిసారి. టాస్ గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకోగా, భారత పేసర్ ఝులన్ గోస్వామి తొలి ఓవర్ ప్రారంభించింది.

ఇరు జట్లలో ఎటువంటి మార్పుల్లేవ్

సెమీస్‌లోనే ఆడిన జట్టుతోనే ఇంగ్లండ్ బ‌రిలోకి దిగ‌నుంది. అటు టాస్ గెలిస్తే తాము కూడా బ్యాటింగ్ తీసుకునేవాళ్ల‌మ‌ని మిథాలీ రాజ్ చెప్పింది. అయితే మ‌న బౌల‌ర్లు మంచి ఫామ్‌లో ఉన్నార‌ని, ఇంగ్లండ్‌ను క‌ట్ట‌డి చేస్తామ‌ని మిథాలీ స్ప‌ష్టం చేసింది. ఇక ఇండియా కూడా సెమీస్‌లో ఆస్ట్రేలియాతో ఆడిన జట్టుతోనే బ‌రిలోకి దిగ‌ుతుంది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్

ఉమెన్ వరల్డ్ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో ప్రారంభమైంది. లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరిగే ఈ ఫైనల్లో ఇండియా, ఇంగ్లాండ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్‌ ఇప్పటి వరకు వరల్డ్ కప్ గెలవలేదు.

2005లో దక్షిణాఫ్రికా ఆతిథ్యమిచ్చిన వరల్డ్ కప్ టోర్నీలో మిథాలీ రాజ్‌ సారథ్యంలోనే టీమిండియా తొలిసారి ఫైనల్‌కు చేరింది. అయితే అప్పుడు ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలై రన్నరప్‌గా నిలిచింది. ఇంగ్లాండ్ మాత్రం ఏడుసార్లు వరల్డ్ కప్ ఫైనల్‌కు చేరగా, మూడుసార్లు వరల్డ్ కప్‌ను (1973, 1993, 2009) గెలుచుకుంది.

2005లో తొలిసారి వరల్డ్ కప్‌ ఫైనల్‌‌కు చేరిన భారత్‌.. మళ్లీ ఇప్పుడు ఫైనల్‌కు అర్హత సాధించింది. అప్పుడు, ఇప్పుడు మిథాలీనే టీమిండియాకు కెప్టెన్సీ వహిస్తుండటం విశేషం. వరల్డ్ కప్‌లో ఈ రెండు జట్లు 10 సార్లు తలపడగా... భారత్‌ నాలుగు మ్యాచ్‌ల్లో, ఇంగ్లండ్‌ ఆరు మ్యాచ్‌ల్లో గెలిచాయి.

 ICC Women's World Cup: England Women have won the toss and have opted to bat

లార్డ్స్‌ మైదానంలో ఈ రెండు జట్లు మూడుసార్లు తలపడగా... చెరో మ్యాచ్‌లో గెలిచాయి. మరో మ్యాచ్‌ రద్దు అయింది. కెప్టెన్‌ హోదాలో రెండోసారి వరల్డ్ కప్ ఫైనల్‌ ఆడుతున్న తొలి భారతీయ క్రికెటర్‌‌గా మిథాలీ రాజ్‌ చరిత్ర సృష్టించింది. టోర్నీలో లీగ్ దశలో ఇంగ్లాండ్‌ని అలవోకగా భారత్ ఓడించిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు తుది పోరులో కూడా విజయం సాధించి ఎన్నో ఏళ్లుగా ఊరిస్తున్న ప్రపంచకప్ కలను నెరవేర్చుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు భారత్‌ చేతిలో తొలి మ్యాచ్‌లో ఓడినా.. తర్వాత వరుస విజయాలతో ఫైనల్ చేరిన ఇంగ్లాండ్ సొంతగడ్డపై విశ్వవిజేతగా నిలవాలని ఆశిస్తోంది.

జట్ల వివరాలు:

భారత్ జట్టు : స్మృతి మంధానా, పూనమ్‌ రౌత్‌, మిథాలీ రాజ్‌ (కెప్టెన్‌), హర్మన్‌ ప్రీత్‌ కౌర్, దీప్తి శర్మ, వేద, సుష్మ, జులన్ గోస్వామి, శిఖ పాండే, రాజేశ్వరి గైక్వాడ్, పూనమ్ యాదవ్

ఇంగ్లాండ్‌: లారెన్‌ విన్‌ఫీల్డ్‌, టామీ బ్యూమాంట్‌, హెదర్‌ నైట్‌ (కెప్టెన్‌), సారా టేలర్‌, నటాలీ షీవర్‌, ఫ్రాన్‌ విల్సన్‌, కేథరిన్‌ బ్రంట్‌, జెన్నీ గున్‌, లారా మార్ష్‌, అన్య ష్రబ్‌సోల్‌, అలెక్స్‌ హార్ట్‌లీ

Story first published: Monday, November 13, 2017, 12:16 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X