న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్‌లో తొలిసారి, డిసెంబర్ 11న వరల్డ్ టీ20 షెడ్యూల్

By Nageswara Rao

ముంబై: భారత్‌లో 2016లో జరగనున్న ఐసీసీ వరల్డ్ ట్వంటీ20 టోర్నమెంట్‌కు సంబంధించిన గ్రూపులు, మ్యాచ్‌ల వివరాలను శుక్రవారం (డిసెంబర్ 11)న ప్రకటించనున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) బుధవారం తెలిపింది.

ముంబైలోని ఓ హోటల్‌లో ఈరోజు జరిగిన ఈ ఈవెంట్‌‌లో టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు శిఖర్ ధావన్, అజ్యింకే రహానేలు హాజరయ్యారు. వీరితో పాటు ఈ కార్యక్రమానికి ఐసీసీ ఛైర్మన్, బీసీసీఐ అధ్యక్షుడు శశాంక్ మనోహార్‌తో పాటు ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ రిచర్డసన్, బీసీసీఐ సెక్రటరీ అనురాగా ఠాకూర్‌లు హాజరయ్యారు.

మంగళవారం (డిసెంబర్ 8)న ఐసీసీ వరల్డ్ ట్వంటీ20 లోగోను ఆవిష్కరించారు. మార్చి 11 నుంచి ఏప్రిల్ 3 వరకు జరగనున్న ఈ వరల్డ్ ట్వంటీ20 టోర్నమెంట్‌కు భారత్ తొలిసారిగా ఆతిథ్యమిస్తోంది. ఈ టోర్నమెంట్‌ను మొత్తం 8 పట్టణాల్లో నిర్వహించనుంది.

ICC World T20 2016 groups, schedule to be announced on December 11

ఐసీసీ వరల్డ్ ట్వంటీ20 ఫైనల్ మ్యాచ్‌ కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్ మైదానంలో జరగనుంది. వరల్డ్ ట్వంటీ20 2016 టోర్నమెంట్‌లో మొత్తం 16 జట్లు పాల్గొంటున్నాయి. వరల్డ్ ట్వంటీ20 ప్రత్యేకత ఏంటంటే ఏ ఒక్క జట్టు కూడా ఈ టోర్నీని రెండోసారి గెలవకపోవడమే.

వరల్డ్ టీ20 ఛాంపియన్లు:

* 2007 - India beat Pakistan by 5 runs in final (Hosts South Africa)
* 2009 - Pakistan beat Sri Lanka by 8 wickets in final (England)
* 2010 - England beat Australia by 7 wickets in final (West Indies)
* 2012 - West Indies beat Sri Lanka by 36 runs in final (Sri Lanka)
* 2014 - Sri Lanka beat India by 6 wickets in final (Bangladesh)

తెలుగు వన్ఇండియా

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X