న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మరోసారి విఫలమైన కోహ్లీ, రో‘హిట్’: కివీస్ ముందు భారత్ భారీ లక్ష్యం

కాన్పూర్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న భారత క్రికెట్ జట్టు చారిత్రాత్మక 500వ టెస్టు మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌లో భారత్ భారీ ఆధిక్యం సాధించింది. కాన్పూర్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న చరిత్రాత్మక 500వ టెస్టు మ్యాచ్‌లో భారత్‌ 377/5 వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం 56పరుగులు కలుపుకుని 433 పరుగుల భారీ లక్ష్యాన్ని కోహ్లీ సేన కివీస్‌ ముందుంచుంది.

ఓవర్‌నైట్‌ స్కోరు 159/1తో ఆదివారం రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన భారత్‌ జట్టులో మురళీ విజయ్‌ (76), పుజారా (78) తొలి సెషన్‌లో ఎక్కువ సేపు నిలవలేకపోయారు. అయితే మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్లు రోహిత్‌ శర్మ (68 నాటౌట్‌: 93 బంతుల్లో 8×4), రవీంద్ర జడేజా (50 నాటౌట్‌: 58 బంతుల్లో 2×4, 3×6) మెరుపు అర్ధశతకాలు బాదడంతో భారత్‌ 377 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది.

Also Read: 500వ టెస్ట్: స్ఫిన్నర్లు తిప్పేశారు, భారత్‌దే పైచేయి (ఫోటోలు)

India 228/4 as New Zealand spinners tighten noose around hosts

మరోసారి నిరాశపర్చిన కోహ్లీ

విరాట్ కోహ్లి మరోసారి నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్ లో 9 పరుగులు చేసిన కోహ్లీ... రెండో ఇన్నింగ్స్ లో 18 పరుగులు చేసి ఔటయ్యాడు. 40 బంతుల్లో 3 ఫోర్లు కొట్టి కుదురుకుంటున్నట్లు కనిపించిన కోహ్లీ.. క్రెయిగ్ బౌలింగ్‌లో స్వీప్ షాట్ కు యత్నించి విఫలమయ్యాడు.

కాగా, ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్ 318 అలౌట్ కాగా, న్యూజిలాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ 262 పరుగులు చేసి అలౌటైంది.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X