న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్-బంగ్లా ఏకైక టెస్టు: ఓల్డ్ ట్రేడిషన్‌కు హెచ్‌సీఏ శ్రీకారం

బంగ్లాతో జరగనున్న ఏకైక టెస్టు మ్యాచ్‌ను పురస్కరించుకుని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఓ పాత సంప్రదాయాన్ని పునరుద్ధరించనుంది.

By Nageshwara Rao

హైదరాబాద్: బంగ్లాతో జరగనున్న ఏకైక టెస్టు మ్యాచ్‌ను పురస్కరించుకుని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఓ పాత సంప్రదాయాన్ని పునరుద్ధరించనుంది. గతంలో ఇక్కడ ఏ అంతర్జాతీయ మ్యాచ్ జరిగినా, దానికి సంబంధించి సావనీర్ (బ్రోచర్)ను ఆవిష్కరించడం ఆనవాయితీగా వస్తుండేది.

కొన్నాళ్ల పాటు కొనసాగించిన ఈ సంప్రదాయాన్ని ఆ తర్వాతి రోజుల్లో కొన్ని కారణాల వల్ల ఆపేశారు. మళ్లీ ఇప్పుడు ఆ సంప్రదాయాన్ని కొనసాగించాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. కామన్వెల్త్ క్రికెట్ టీమ్ మొట్టమొదటిసారి హెచ్‌సీఏను సందర్శించినప్పుడు ఈ సావనీర్ (బ్రోచర్) సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు.

India-Bangladesh Test: Hyderabad to revive old tradition tocommemorate historic match

అప్పట్లో ఈ మ్యాచ్ సికింద్రాబాద్‌లోని జింఖానా గ్రౌండ్‌లో జరిగింది. ఈ సంప్రదాయం తొంభైల్లో కొనసాగేది. ఇదిలా ఉంటే భారతలో బంగ్లాదేశ్ ఆడుతున్న తొలి టెస్టు కావడంతో ఈ సావనీర్ సంప్రదాయాన్ని కూడా మళ్లీ హెచ్‌సీఏ మొదలుపెట్టనుంది. ఈ బ్రోచర్‌లో ఇరు జట్లు ఇప్పటివరకు ఆడిన మ్యాచ్ లకు సంబంధించిన విశేషాలతో పాటు కార్టూన్లు, గణాంకాలు ఉండనున్నాయి.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X