న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్ ఓటమి: పాండ్యా వీరోచిత బ్యాటింగ్‌కు ప్రశంసలు

By Nageshwara Rao

న్యూఢిల్లీ: భారత్, న్యూజిలాండ్ మధ్య ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరిగిన రెండో వన్డేలో 243 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా వీరోచితంగా పోరాడి చివరకు న్యూజిలాండ్ చేతిలో 6 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 243 పరుగులు టీమిండియాకు పెద్ద లక్ష్యం కాకపోయినా టాప్ ఆర్డర్ విఫలమవ్వడంతో భారత్ తడబడింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

టీమిండియా వరుసగా వికెట్లు కోల్పోయింది. పిచ్ అనూహ్యంగా బౌన్స్ కావడంతో షాట్ సెలెక్షన్‌లో చిన్న చిన్న తప్పిదాలతో టీమిండియా బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు చేరారు. నాలుగో ఓవర్‌లోనే భారీ సిక్సర్, ఫోర్‌తో రోహిత్ (15) కుదురుకున్నట్లే కనిపించినా ఎనిమిదో ఓవర్‌లో వెనుదిరిగాడు.

India lose 2nd ODI but Hardik Pandya wins hearts with gutsy effort

ఆ తర్వతా కోహ్లీ (9) కూడా ఔట్ కావడంతో భారత్ కష్టాలు మొదలయ్యాయి. రహానే (28)తో కలిసి మనీష్ పాండే (19)లు ఇన్నింగ్స్‌ను నిర్మించే ప్రయత్నం చేశారు. ఇద్దరూ మూడో వికెట్‌కు 32 పరుగులు జోడించారు. దీంతో టీమిండియా 37 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

ఈ దశలో ధోని కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత ధోని ఔట్ అవడంతో తొలి వన్డేలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికైన హార్ధిక్ పాండ్యా చివరిలో 36 పరుగులు చేయడంతో మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠగా మారింది. ముఖ్యంగా ఓటమి అంచుల్లోకి వెళ్లిన భారత జట్టుని హర్ధిక్‌ పాండ్యా (36), ఉమేశ్‌ యాదవ్‌ (18 నాటౌట్‌) అనూహ్యంగా భారత్‌ను విజయం దిశగా నడిపించారు.

చివర్లో భారత్ గెలవాలంటే 54 బంతుల్లో 59 పరుగులు చేయాలి. ఈ దశలో హార్దిక్ అద్భుతమైన బ్యాటింగ్‌ తీరుతో ఆకట్టుకున్నాడు. ఓ ఎండ్‌లో ఉమేశ్ (18 నాటౌట్)ను నిలబెట్టి ఒంటరిగా పోరాడాడు. కివీస్ పేసర్లు బౌల్ట్, హెన్రీ, సౌథీలు పదునైన బంతులతో విజృంభించినా అలవోకగా షాట్లు కొట్టాడు.

2nd ODIలో చివరి వరకు ఉత్కంఠ: పోరాడి ఓడిన భారత్, కివీస్ విజయం

దీంతో ఓవర్‌కు ఆరు పరుగులకు పైగా రన్‌రేట్ నమోదు కావడంతో 48వ ఓవర్లో భారత్‌ 6 పరుగులే చేయడంతో చివరి రెండు ఓవర్లలో 16 పరుగులు అవసరమయ్యాయి. ఈ స్థితిలో బౌల్ట్‌ బౌలింగ్‌లో ఫోర్‌ కొట్టిన పాండ్యా... ఐదో బంతికి భారీ షాట్ కోసం ప్రయత్నించి ఔటయ్యాడు.

మరో మూడు బంతుల తర్వాత బుమ్రా (0) క్లీన్‌బౌల్ట్ కావడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు. రెండో వన్డేలో మొత్తంగా చూస్తే ముగ్గురు ఆటగాళ్లు సత్తా చాటారు. స్లాగ్‌ ఓవర్లలో పేసర్‌ బుమ్రా (3/35) అద్భుతంగా బౌలింగ్‌ చేసి కివీస్‌ను భారీ స్కోరు చేయకుండా అడ్డుకుంటే, లక్ష్యాన్ని చేధించే క్రమంలో కేదార్‌ జాదవ్‌, హార్ధిక్‌ పాండ్యా ఆకట్టుకున్నారు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X