న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అవేం మాటలు: మిశ్రా ఆవేదన, కోహ్లీపై ప్రశంసలు

By Pratap

న్యూఢిల్లీ: భారత స్పిన్నర్ల సమర్థతను తగ్గించే విధంగా పిచ్‌లపై చర్చ చేయడం పట్ల అమిత్ మిశ్రా ఆవేదన వ్యక్తం చేశాడు. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, తన బౌలింగ్ సామర్థ్యాన్ని తక్కువ చేస్తూ పిచ్‌ల తీరుపై చర్చ జరగడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశాడు.

దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో భారత్ కూల్చిన మొత్తం 50 వికెట్లలో 47 స్పిన్నర్ల ఖాతాలోకే చేరాయి. వీరి ప్రదర్శనతో కోహ్లీ 2-0తో సిరీస్‌ను సొంతం చేసేసుకుంద. ఇంత చేసినా తమ కృషిని గుర్తించడం లేదని, పైపెచ్చు చర్చ అంతా పిచ్ చుట్టూనే సాగుతోందన్నది అమిత్ మిశ్రా ఆవేదన.

తమకు రావాల్సిన పేరు రాలేదని, తామురాణించిన తీరుపైనే చర్చ జరగాల్సిందని, కానీ అందరూ పిచ్‌పైనే పడ్డారని, భారత్‌లో పిచ్‌లు ఇలాగే ఉంటాయని ఆయన అన్నాడు. ఇప్పుడే కాదు, 15 ఏళ్ల నుంచి ఇదే తరహా పిచ్‌లు చూస్తున్నామని అన్నాడు. కేవలం పిచ్ వల్లే వికెట్లు పడగొట్టగలిగారని అనడం సముచితం కాదు అని మిశ్రా ఆవేదన వ్యక్తం చేశాడు.

India spinners did not get wickets only because of pitches: Amit Mishra

తాము శ్రీలంక పర్యటనకు వెళ్లినప్పుడు తమకు టర్నింగ్ ట్రాక్‌లు లభించాయని, తాము బాగా బౌలింగ్ చేశామని గుర్తు చేశాడు. పిచ్‌ల వల్లనే తాము వికెట్లు తీయగలిగామనేది సరైన వాదన కాదని, విదేశాల్లో కూడా తాము బాగా రాణించామని ఆయన చెప్పాడు.

భారత ఉపఖండం వెలుపల బౌన్స్ అయ్యే పిచ్‌లే ఎదురవుతాయని, ఇతర జట్లు భారత్‌కు వచ్చినప్పుడు టర్న్ ఎక్కువ అయ్యే పిచ్‌లు ఎదురవుతాయని, పరిస్థితులకు అనుగుణంగా తమను తాము జట్లు మలుచుకోవాల్సి ఉంటుందని అమిత్ మిశ్రా అన్నాడు.

కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఆయన ప్రశంసల జల్లు కురిపించాడు. పరీక్షా సమయంలో కోహ్లీ అండగా నిలబడ్డాడని ఆయన అన్నాడు. ఎల్లవేళలా పాజిటివ్‌గా ఆలోచిస్తాడని, ఏ బ్యాట్స్‌మన్‌ను ఎలా అవుట్ చేయాలనే విషయంలో మంచి చిట్కాలు అందిస్తాడని ఆయన అన్నాడు. నువ్వు ఎలా బౌలింగ్ చేస్తున్నావనే విషయాన్ని పట్టించుకోకుండా మద్దతు ఇస్తాడని ఆయన అన్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X