న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆరేళ్ల తర్వాత జట్టులోకి: ఎవరీ అభినవ్ ముకుంద్

హైదరాబాద్‌‌లో బ‌ంగ్లాదేశ్‌తో జ‌రిగనున్న ఏకైక టెస్టు మ్యాచ్ కోసం మంగళవారం బీసీసీఐ జట్టును ప్రకటించింది. ఇంగ్లాండ్‌తో ముగిసిన టెస్టు సిరిస్‌లో ఏ జట్టు అయితే ఉందో అదే జట్టుని ఈ టెస్టుకూ కొనసాగించారు.

By Nageshwara Rao

హైదరాబాద్: హైదరాబాద్‌‌లో బ‌ంగ్లాదేశ్‌తో జ‌రిగనున్న ఏకైక టెస్టు మ్యాచ్ కోసం మంగళవారం బీసీసీఐ జట్టును ప్రకటించింది. ఇంగ్లాండ్‌తో ముగిసిన టెస్టు సిరిస్‌లో ఏ జట్టు అయితే ఉందో అదే జట్టుని ఈ టెస్టుకూ కొనసాగించారు. అయితే గాయంతో ఇంగ్లాండ్ సిరిస్‌కు దూరమైన వృద్ధిమాన్ సాహా తిరిగి జట్టులో చోటు దక్కించుకున్నాడు.

ఇక తమిళనాడుకు చెందిన అభినవ్‌ ముకుంద్‌ ఆరేళ్ల తర్వాత జట్టులో చోటు సంపాదించుకున్నాడు. ఈ రంజీ సీజన్లో తమిళనాడు తరఫున ముకుంద్‌ 800కు పైగా పరుగులు చేసి సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. చివరిసారిగా 2011లో వెస్టిండీస్‌, ఇంగ్లాండ్‌ పర్యటనకు వెళ్లిన జట్టులో ముకుంద్‌ ఉన్నాడు.

Abhinav Mukund

ఆరేళ్ల కిందట టీమిండియాలో ముకుంద్ టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. 2011లో వెస్టిండీస్‌, ఇంగ్లండ్‌ పర్యటనలకు ఎంపికయ్యాడు. ఇంగ్లాండ్‌ పర్యటనలో ఘోరంగా విఫలం చెందడంతో అతడిపై వేటు పడింది. ఐదు టెస్టులు ఆడిన అభినవ్‌ ముకుంద్ 21.10 యావరేజితో 211 పరుగులు చేశాడు.

మంగళవారం న్యూఢిల్లీలో సమావేశమైన ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ బంగ్లాదేశ్‌తో టెస్టుకు 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది. ఆరేళ్ల తర్వాత ముకుంద్... మురళీ విజయ్‌, కేఎల్‌ రాహుల్‌లతో పాటు మూడో ఓపెనర్‌గా ఎంపికయ్యాడు. ఈ జట్టులో ఓపెన‌ర్ శిఖ‌ర్ ధావ‌న్‌కు స్థానం ద‌క్క‌లేదు.

మరోవైపు ముకుంద్‌తో పాటు వెటరన్ స్ఫిన్నర్ అమిత్ మిశ్రాల‌కు జట్టులో సెలక్టర్లు చోటు కల్పించారు. ఇండియా, బంగ్లాదేశ్ మ్యాచ్ ఫిబ్రవరి 9 నుంచి హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో జరగనుంది. దీనికంటే ముందు ఫిబ్రవరి 5, 6 తేదీల్లో జింఖానా స్టేడియంలో జరిగే ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో ఇండియా ఏతో బంగ్లాదేశ్‌ తలపడుతుంది.

India squad announced for Bangladesh Test; India A team also picked

ఈ ఏకైక టెస్టు మ్యాచ్ కోసం ఫిబ్రవరి 2న బంగ్లాదేశ్‌ జట్టు హైదరాబాద్‌కి రానుంది. సెల‌క్ష‌న్ క‌మిటీ స‌మావేశానికి ముందు కాస్త డ్రామా చోటు చేసుకుంది. మధ్యాహ్నం 12 గంటలకు జరగాల్సిన సమావేశం సాయంత్రం 6గంటలకు జరిగింది. బీసీసీఐ సంయుక్త కార్యదర్శి అమితాజ్ చౌదరి సమావేశంలో పాల్గొనడానికి కొత్త కమిటీ అధ్యక్షుడు వినోద్ రాయ్ నిరాకరించాడు.

జస్టిస్ లోధా సిఫారసుల ప్రకారం అమితాబ్ చౌదురి ఇందులో పాల్గొనడానికి అనర్హుడని తేలడంతో ఈ వివాదం సద్దుమణిగింది. దీంతో బీసీసీఐ బోర్డు సీఈఓ రాహుల్ జోహ్రి ఈ స‌మావేశాన్ని ఏర్పాటుచేశారు. బెంగళూరు నుంచి కెప్టెన్‌ కోహ్లీ స్కైప్‌ ద్వారా పాల్గొన్నాడు.

భారత్‌ జట్టు: విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌, మురళీ విజయ్‌, ఛటేశ్వర్‌ పుజారా, అజింక్య రహానె, కరణ్‌ నాయర్‌, హర్దిక్‌ పాండ్యా, వృద్ధిమాన్‌ సాహా(వికెట్‌ కీపర్‌), రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, అమిత్‌ మిశ్రా, ఇషాంత్‌ శర్మ, భువనేశ్వర్‌ కుమార్‌, ఉమేశ్‌ యాదవ్‌, అభినవ్‌ ముకుంద్‌

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Read in English: India Test squad announced
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X