న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆశలు రేపి తుస్సుమనిపించారు: 4వ వన్డేలో భారత్ ఓటమి

By Nageshwara Rao

రాంచీ: నాలుగో వన్డేలో ఎలాంటి అద్భుతం జరగలేదు. 261 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 48.4 ఓవర్లకే 241 పరుగులు చేసి ఆలౌటైంది. దీంతో టీమిండియాపై న్యూజిలాండ్ 19 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంలో ఐదు వన్డేల సిరీస్‌ 2-2తో సమం చేసింది.

దీంతో వన్డే సిరీస్ విజేత ఎవరనేది విశాఖపట్నం వేదికగా శనివారం జరిగే వన్డేలో తేలనుంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లకు 260 పరుగులు చేసింది. దీంతో 261 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఛేజింగ్‌లో తడబడింది.

కోహ్లీ(45), రహానే(57), అక్షర్ పటేల్ (38) మాత్రమే రాణించగా రోహిత్ శర్మ(11), ధోనీ(11), మనీశ్ పాండే(12) విఫలమయ్యారు. ఓ దశలో 25 ఓవర్లకు గాను టీమిండియా 2 వికెట్లు కోల్పోయి 122 పరుగులు చేసినప్పటికీ, వెంటవెంటనే వికెట్లు వికెట్లు కోల్పోయింది.

India v New Zealand, 4th ODI: New Zealand win the toss and opt to bat

చివర్లో కులకర్ణి బ్యాటింగ్‌తో మెరుపులు మెరిపించి విజయంపై ఆశలు రేపాడు. ఉమేశ్ యాదవ్‌తో కలిసి 34 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. న్యూజిలాండ్ బౌలర్లలో సౌథీకి 3 వికెట్లు, బోల్ట్, నీషమ్‌లకు రెండు వికెట్లు, సాంట్నర్, సౌథి చెరో వికెట్ తీసుకున్నారు.

ధోని ఔట్ తో మలుపు తిరిగిన మ్యాచ్
రాంచీ వేదికగా జరుగుతున్న నాలుగో వన్డేలో ధోని ఔట్‌తోమ్యాచ్ మలుపు తిరిగింది. టీమిండియా బ్యాట్స్‌మెన్లు రహానే 57, కోహ్లీ 45, అక్షర్ పటేల్ 38 ధాటిగా ఆడినప్పటికి విజయ లక్షాన్ని చేరుకోలేకపోయింది. కేదార్‌ జాదవ్‌ (0), మనీశ్‌ పాండే (12), హార్ధిక్‌ పాండ్య (9) కీలక సమయంలో వికెట్లను చేజార్చుకున్నారు.

India v New Zealand, 4th ODI: New Zealand win the toss and opt to bat

ఓటమి దిశగా టీమిండియా
నాలుగో వన్డేలో టీమిండియా ఓటమి దిశగా వెళుతోంది. ధోని బౌల్డ్ అయిన తర్వాత టీమిండియా వరుసగా రెండు వికెట్లను కోల్పోయింది. ధోని ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన మనీష్ పాండే 12 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద సౌథీ బౌలింగ్‌లో లాథమ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఆ వెంటనే కేదార్ జాదవ్ సౌథీ బౌలింగ్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో టీమిండియా 33 ఓవర్లు ముగిసే సరికి 6 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది.

ధోనీ బౌల్డ్: రాంచీ అభిమానుల్లో నిరాశ
నాలుగో వన్డేలో టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. 11 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ధోని నీషమ్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. దీంతో టీమిండియా 31 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో మనీష్ పాండే 3, అక్షర పటేల్ 9 పరుగులతో ఉన్నారు. ధోని ఔట్ కావడంతో రాంచీలోని అభిమానులు సైతం నిరాశ చెందారు. మ్యాచ్‌పై ఆశలు సన్నగిల్లాయి.

57 పరుగుల వద్ద రహానే ఔట్
నాలుగో వన్డేలో టీమిండియా మూడో వికెట్‌ను కోల్పోయింది. 57 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద నీషమ్ బౌలింగ్‌లో రహానే ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. దీంతో 28.2 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 3 వికెట్లు నష్టపోయి 134 పరుగులు చేసింది. రహానే ఔటైన తర్వాత క్రీజ్‌లోకి అక్షర్ పటేల్ వచ్చాడు. భారత్ విజయం సాధించేందుకు ఇంకా 127 పరుగులు చేయాల్సి ఉంది. ప్రస్తుతం క్రీజులో ధోని 10, అక్షర పటేల్ 4 పరుగులతో ఉన్నారు.

India v New Zealand, 4th ODI: New Zealand win the toss and opt to bat

రహానే అర్ధ సెంచరీ

నాలుగో వన్డేలో ఓపెనర్ రహానే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 62 బంతులు ఎదుర్కొన్న రహానే (5 ఫోర్లు, 1 సిక్సర్‌)తో అర్ధ సెంచరీ (52 పరుగులు) సాధించాడు. రహానేకు వన్డే కెరీర్‌లో ఇది 16వ అర్ధ సెంచరీ. దీంతో 27 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 2 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో ధోని 8, రహానే 55 పరుగులతో ఉన్నారు.

నాలుగో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ధోని
261 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ 11, కోహ్లీ 45 పరుగుల వద్ద ఔటవ్వగా నాలుగో స్ధానంలో ధోని బ్యాటింగ్‌కు వచ్చాడు. మూడో వన్డేలో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ధోని రాంచిలో కూడా అలానే చేశాడు. రెండో వికెట్‌గా విరాట్ కోహ్లీ(45) ఔటైన తర్వాత మనీష్ పాండేను పంపకుండా తానే బ్యాటింగ్‌కు వచ్చాడు. 22 ఓవర్లకు గాను టీమిండియా 2 వికెట్లను కోల్పోయి 102 పరుగులు సాధించింది. ప్రస్తుతం క్రీజులో రహానే 38, ధోని 3 పరుగులతో ఉన్నారు. నాలుగో వన్డేలో భారత్ విజయం సాధించేందుకు ఇంకా 159 పరుగులు చేయాల్సి ఉంది.

కోహ్లీ ఔట్, అర్ధ సెంచరీ మిస్
నాలుగో వన్డేలో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. 51 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ సౌథీ బౌలింగ్‌లో వాట్లింగ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. దీంతో 45 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. మరో ఐదు పరుగులు చేసి ఉంటే వన్డేల్లో 38వ అర్ధ సెంచరీని నమోదు చేసి ఉండేవాడు. ఈ మ్యాచ్ గెలిచేందుకు భారత్ ఇంకా 163 పరుగులు చేయాల్సి ఉంది.

India v New Zealand, 4th ODI: New Zealand win the toss and opt to bat

నాలుగో స్ధానంలో ధోని వస్తాడా?
261 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ 11 పరుగులకు ఔటయ్యాడు. ప్రస్తుతం భారత్ 19 ఓవర్లకు గాను ఒక వికెట్ నష్టానికి 95 పరుగులు చేసింది. కోహ్లీ 44, రహానే 36 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. మరో వికెట్ పడితే మూడో వన్డే మాదిరి ధోనీ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తాడా లేక మనీష్ పాండ్‌ను పంపుతాడా అనేది చూడాల్సి ఉంది. మూడో వన్డేలో ధోని నాలుగో స్ధానంలో వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. దీంతో టీమిండియా మాజీ కెప్టెన్ గంగూలితో సహా పలువురు ధోని మిడిల్ ఆర్డర్‌లో కాకుండా టాప్ ఆర్డర్‌లోనే బ్యాటింగ్‌కు రావాలని, తద్వారా మంచి ఫలితాలు వస్తాయని అన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ధోని నాలుగో స్థానంలో వస్తాడా, రాడా? అనే విషయం ఆసక్తి కరంగా మారింది.

రోహిత్ శర్మ మళ్లీ విఫలం

261 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఆరంభంలోనే రోహిత్ శర్మ రూపంలో తొలివికెట్ కోల్పోయింది. రోహిత్ శర్మ 11 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఐదో ఓవర్‌లో మొదటి బంతికి సౌథీ బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. దీంతో టీమిండియా 5 ఓవర్లు ముగిసే సరికి ఒక వికెట్ నష్టానికి 21 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రహానే 10, కోహ్లీ 4 పరుగులతో ఉన్నారు.

ధోని చెప్పినట్టే చేశాడు
ధోని ఇటీవ‌లే ధ‌ర్మ‌శాల‌లో మీడియాతో మాట్లాడుతూ తాను కోహ్లీ నుంచి తాను స‌ల‌హాల‌ను స్వీక‌రిస్తున్నాన‌ని చెప్పిన సంగతి తెలిసిందే. తాను మైదానంలో ఉన్న‌ప్పుడు కోహ్లీ ఇచ్చే సూచ‌న‌లనే ఎక్కువ‌గా తీసుకుంటాన‌ని, కావాలంటే నేను క్రీజులో ఉన్న‌ప్పుడు మీరూ చూడండి అంటూ అభిమానుల‌కు ఈ అంశంపై ఒక సూచ‌న కూడా చేశాడు. రాంచీలో జరుగుతున్న నాలుగో వన్డేలో ధోని ఇదే చేశాడు. మ్యాచ్‌ జ‌రుగుతున్న‌ సమయంలో కోహ్లీతో ఎక్కువగా మాట్లాడాడు. కోహ్లీ నుంచి సూచ‌న‌లు తీసుకున్నాడు. వ‌న్డేల్లో తొలి మ్యాచ్ నుంచే ఫీల్డింగ్‌, బౌలింగ్ మార్పుల విష‌యంలో ధోనీ సూచ‌న‌లు తీసుకున్నాడు. త‌రుచుగా వీరిద్దరూ మైదానంలో సీరియ‌స్‌గా చ‌ర్చించుకుంటూ క‌నిపించారు. ఈ సూచనలే న్యూజిలాండ్‌ను 260 పరుగులకే కట్టడి చేసేందుకు దోహదపడ్డాయి.

భారత్ లక్ష్యం 261
న్యూజిలాండ్‌తో జరుగుతున్న నాలుగో వన్డేలో టాస్ గెలిచిన న్యూజిలాండ్ 50 ఓవర్లకు గాను 7 వికెట్లు కోల్పోయి 260 పరుగులు చేసింది. దీంతో టీమిండియా విజయ లక్ష్యం 261గా నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన కివీస్ ఓపెనర్లు జట్టుకు మంచి శుభారంభానిచ్చినా మిడిల్ ఆర్డర్ విఫలమైంది.

న్యూజిలాండ్ ఆటగాళ్లలో లాథమ్ 39, మార్టిన్ గుప్తిల్ 72, విలియమ్సన్ 41, రాస్ టేలర్ 35, నీషమ్ 6, వాట్లింగ్ 14, డివిసిచ్ 11, సాంట్నర్ 17, సౌథీ 9 పరుగులు చేశారు. భారత బౌలర్లలో అమిత్ మిశ్రా 2, ధావల్ కులకర్ణి, హార్ధిక్ పాండ్యా, అక్షర్ పటేల్, ఉమేశ్ యాదవ్ తలో వికెట్ తీసుకున్నారు.

India v New Zealand, 4th ODI: New Zealand win the toss and opt to bat

చేయి నొప్పితో గ్రౌండ్‌లో కూర్చున్న కోహ్లీ
నాలుగో వన్డేలో నాలుగో వికెట్‌ను క్యాచ్‌గా అందుకున్న విరాట్ కోహ్లీ చేతికి స్వల్ప గాయమైంది. అమిత్ మిశ్రా బౌలింగ్‌లో జేమ్స్ నీషమ్ 6 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కొట్టిన షాట్‌ను కోహ్లీ ఒడిసి పట్టుకున్నాడు. ఈ క్రమంలో డైవ్ చేసి, బంతిని చేతి నుంచి వదలకుండా ఉండేందుకు ప్రయత్నించాడు. కానీ అంతలో చేయి నేలకు రాసుకోవడంతో, వెంటనే కోహ్లీ కొంత నొప్పిని భరిస్తున్నట్టు కనిపించి మైదానంలో అలానే కూర్చిండిపోయాడు. అయితే తర్వాత మళ్లీ లేచి ఆటలో నిమగ్నమయ్యాడు.

ఆరు వికెట్లు కోల్పోయి 200 పరుగులు దాటిన కివీస్
నాలుగో వన్డేలో న్యూజిలాండ్ ఆరో వికెట్ కోల్పోయింది. న్యూజిలాండ్ జట్టుకు ఓపెనర్లు మంచి శుభారంభాన్ని ఇచ్చినా ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ రాణించకపోవడంతో 45.3 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ 6 వికెట్లు కోల్పోయి 223 పరుగులు చేసింది. 14 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కివీస్ ఆటగాడు వాట్లింగ్ ఔటయ్యాడు. 45వ ఓవర్‌లో కులకర్ణి బౌలింగ్‌లో వాట్లింగ్ సిక్సర్ బాదాడు. కానీ బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ శర్మ దాన్ని క్యాచ్ అందుకున్నాడు. ఆ తర్వాత రాస్ టేలర్ 34 పరుగుల వద్ద రనౌట్‌గా వెనుదిరిగాడు. భారత బౌలర్లలో మిశ్రా రెండు వికెట్లు తీసుకోగా, అక్షర్ పటేల్, పాండ్యా, కులకర్ణి తలో వికెట్ తీసుకున్నారు.

రాంచీ వన్డేలో కోహ్లీ సూపర్ క్యాచ్
అమిత్ మిశ్రా బౌలింగ్‌లో కివీస్ బ్యాట్స్‌మన్ నీషమ్ కొట్టిన షాట్‌ను అంపైర్‌కు దగ్గర్లో ఫీల్డింగ్ చేస్తోన్న విరాట్ కోహ్లీ సూపర్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో కెప్టెన్ విలియమ్సన్ ఔటవ్వగానే క్రీజ్‌లోకి వచ్చిన జేమ్స్ నీషమ్ 6 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పెవిలియన్‌కు చేరాడు. అమిత్ మిశ్రా వరుస ఓవర్లలో రెండు వికెట్లు పడగొట్టాడు. మొదటి వికెట్‌ను కెప్టెన్ దోనీ క్యాచ్ అందుకోగా, రెండో వికెట్‌ను వైస్ కెప్టెన్ కోహ్లీ అందుకున్నాడు.

India v New Zealand, 4th ODI: New Zealand win the toss and opt to bat

నాలుగో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్ 192/4 (38 ఓవర్లు)
నాలుగో వన్డేలో భారత వికెట్ల వేట మొదలైంది. భారీ స్కోర్ దిశగా వెళుతున్నట్టు కనిపించిన న్యూజిలాండ్ టాప్ ఆర్డర్‌ను భారత బౌలర్లు పడగొట్టారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ మొదటి వికెట్‌కు 96 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఈ క్రమంలో అక్షర పటేల్ లాథమ్‌ను తొలి వికెట్‌ను పడగొట్టగా, ఆ తర్వాత గుప్టిల్ 72, విలియమ్సన్ 39, నీషమ్ 6 పరుగులకే పెవిలియన్‌కు చేరుకున్నారు. దీంతో న్యూజిలాండ్ 37 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రాస్ టేలర్ 23, వాట్లింగ్ 3 పరుగులతో ఉన్నారు.

కెప్టెన్ విలియమ్సన్ ఔట్: న్యూజిలాండ్ 184/3 (35.2 ఓవర్లు)
నాలుగో వన్డేలో న్యూజిలాండ్ మూడో వికెట్ కోల్పోయింది. 41 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అమిత్ మిశ్రా బౌలింగ్‌లో కీపర్ ధోనికి క్యాచ్ ఇచ్చి న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ పెవిలియిన్‌కు చేరాడు. దీంతో 35.2 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ 3 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. మూడో వికెట్‌కు రాస్ టేలర్ (20) తో కలిసి స్కోరు బోర్డుకు 46 పరుగులు జత చేశాడు. 38వ ఓవర్ వేసిన మిశ్రా.. ఓవర్ చివరి బంతికి నీషమ్ ను పెవిలియన్ కు చేర్చాడు. అయితే చాలా తక్కువ ఎత్తులో వస్తున్న బంతిని వైస్ కెప్టెన్ విరాట్ చక్కగా ఒడిసిపట్టడంతో నీషమ్ నిరాశగా వెనుదిరిగాడు.

11 వైడ్‌లేసిన భారత బౌలర్లు
నాలుగో వన్డే మ్యాచ్‌లో కివీస్ బ్యాట్స్‌మన్‌ను కట్టడి చేసేందుకు భారత బౌలర్లు శ్రమిస్తున్నారు. 34 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ 2 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. మార్టిన్ గుప్తిల్(72)ను హార్ధిక్ పాండ్యా, టామ్ లాథమ్‌(39)ను అక్షర్ పటేల్ ఔట్ చేశారు. కివీస్ ఆటగాళ్లను కట్టడి చేసేందుకు శ్రమిస్తున్న భారత బౌలర్లు అదనపు పరుగులు ఎక్కువగా సమర్పించుకుంటున్నారు. 5 ఓవర్లు వేసిన హార్ధిక్ పాండ్యా 8, ఉమేష్ యాదవ్ 2 వైడ్ బాల్స్ వేశారు. మూడు ఓవర్లు వేసిన అమిత్ మిశ్రా 1 వైడ్ వేశాడు.

India v New Zealand, 4th ODI: New Zealand win the toss and opt to bat

గుప్టిల్ అర్ధసెంచరీ 142/2 (27 ఓవర్లు)
నాలుగో వన్డేలో న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ ఫామ్‌లోకి వచ్చాడు. భారత్‌తో ప్రస్తుతం జరుగుతున్న సిరిస్‌లో పేలవ ప్రదర్శనతో తీవ్ర విమర్శలకు గురవుతున్న గప్టిల్ నాలుగో వన్డేలో కివీస్ స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు. ఈ క్రమంలో గుప్టిల్ 84 బంతులను ఎదుర్కొన్న గుప్టిల్ 72 పరుగులతో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వన్డేల్లో గుప్టిల్‌కి ఇది 31వ అర్ధ సెంచరీ. 25 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ ఒక వికెట్ నష్టపోయి 138 పరుగులు చేసి పటిస్ట స్థితిలో ఉంది. ఈ స్థితిలో భారత బౌలర్ హార్ధిక్ పాండ్యా కివీస్‌ను దెబ్బతీశాడు. ఆ మరుసటి ఓవర్ తొలి బంతికి గుప్టిల్... పాండ్యా బౌలింగ్‌లో ధోనీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. దీంతో న్యూజిలాండ్ 27 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది.

ఓపెనర్ లాథమ్ ఔట్ 99/1 (17 ఓవర్లు)
రాంచీ వేదికగా జరుగుతున్న నాలుగో వన్డేలో న్యూజిలాండ్ మొదటి వికెట్ కోల్పోయింది. 16వ ఓవర్‌ వేసిన అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌లో స్వీప్‌ షాట్‌ కోసం ప్రయత్నించిన ఓపెనర్‌ లాథమ్‌ 39 వ్యక్తిగత పరుగుల వద్ద రహానేకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. దీంతో న్యూజిలాండ్ జట్టు 17 ఓవర్లు ముగిసే సరికి ఒక వికెట్ నష్టానికి 99 పరుగులు సాధించింది.

దూకుడుగా ఆడుతున్న కివీస్ ఓపెనర్లు 94/0 (15 ఓవర్లు)

రాంచీ వేదికగా జరుగుతున్న నాలుగో వన్డేలో న్యూజిలాండ్‌ ఓపెనర్లు దూకుడుగా ఆడుతున్నారు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న న్యూజిలాండ్ జట్టు 15 ఓవర్లు ముగిసే సరికే 94 పరుగులు చేసింది. ఓపెనర్లు గుప్తిల్‌ 48, లాథమ్ 37 పరుగులతో ఉన్నారు. మ్యాచ్ ఆరంభం నుంచే బౌండరీలతో భారత బౌలర్లపై ఒత్తిడి పెంచుతున్నారు.

భారత పర్యటనలో మొత్తానికి న్యూజిలాండ్ జట్టు టాస్ గెలిచింది. ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్, న్యూజిలాండ్ మధ్య రాంచీలో జరుగుతున్న నాలుగో వన్డేలో టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన టీమిండియా ఈ మ్యాచ్‌లో గెలిచి వన్డే సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది.

ఐదు వన్డేల సిరిస్‌లో టీమిండియా 2-1 ఆధిక్యంలో ఉంది. ఇటీవల ముగిసిన టెస్టు సిరిస్‌తో పాటు ఇప్పటి వరకు జరిగిన మూడు వన్డేల్లో కూడా ధోనినే టాస్ గెలిచిన సంగతి తెలిసిందే. కాగా, నాలుగో వన్డేలో న్యూజిలాండ్ జట్టు మూడు ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగుతుంది. సోధి, డెవ్ చిచ్, వాల్టింగ్ జట్టులోకి వచ్చారు.

రోంచి, హెన్రీ నాలుగో వన్డేలో ఆడటం లేదు. ఇక భారత జట్టులో కూడా ఒక మార్పు చోటు చేసుకుంది. బుమ్రా ఫిట్‌గా లేకపోవడంతో అతని స్ధానంలో తుది జట్టులోకి ధ‌ావ‌ల్ కుల‌క‌ర్ణి వచ్చాడు. తాను నాలుగో స్థానంలో బ్యాటింగ్ దిగితే ఎక్కుసేపు ఆడడానికి అవకాశం ఉంటుందని ధోని తెలిపాడు.

నాలుగో వన్డే జరగనున్న రాంచీలో టీమిండియాకు మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు రాంచీలో టీమిండియా మూడు మ్యాచ్‌లు ఆడగా రెండింటిలో గెలిచింది. రాంచీలో కోహ్లీకి మెరుగైన రికార్డు ఉంది.

జట్లు:
భారత్: ధోని(కెప్టెన్), రోహిత్ శర్మ, అజింక్యా రహానే, విరాట్ కోహ్లి, మనీష్ పాండే, కేదర్ జాదవ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, అమిత్ మిశ్రా, ఉమేష్ యాదవ్, జస్ప్రిత్ బూమ్రా

న్యూజిలాండ్: కేన్ విలియమ్సన్(కెప్టెన్), మార్టిన్ గప్టిల్, టామ్ లాధమ్, రాస్ టేలర్, కోరీ అండర్సన్, ల్యూక్ రోంచీ, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నార్, టిమ్ సౌతీ, బ్రాస్ వెల్, ఇష్ సోథీ

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X