న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఓకీఫ్ 'స్పిన్' సంచలనం: పూణె టెస్టులో చెత్తగా.. చిత్తుగా ఓడిన భారత్

భారత్‌తో పూణె వేదికగా జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ సెంచరీ సాధించాడు. 187 బంతుల్లో 11 ఫోర్ల సాయంతో సెంచరీ సాధించాడు. స్మిత్‌కి భారత గడ్డపై ఇది మొదటి సెం

By Nageshwara Rao

హైదరాబాద్: పూణె టెస్టులో టీమిండియా ఘోరంగా ఓటమి పాలైంది. భారత్‌పై ఆస్ట్రేలియా 333 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 441 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 33.5 ఓవర్లలో 107 పరుగులకే ఆలౌటైంది. తద్వారా 12 ఏళ్ల తర్వాత భారత్‌లో ఆస్ట్రేలియా టెస్టు మ్యాచ్ గెలిచింది.

ఈ విజయంతో సొంత గడ్డపై టెస్టుల్లో టీమిండియా వరుస విజయాలకు ఆస్ట్రేలియా బ్రేక్ వేసింది. పూణె టెస్టులో ఆస్ట్రేలియా బౌలర్ ఓకీఫ్ 12 వికెట్లు తీసుకుని చరిత్ర సృష్టించాడు. దీంతో నాలుగు టెస్టుల సిరిస్‌లో 1-0తో ఆస్ట్రేలియా ఆధిక్యంలో నిలిచింది. భారత బ్యాట్స్‌మెన్లలో పుజారా చేసిన 31 పరుగులే అత్యధికం. ఇక మురళీ విజయ్ 2, రాహుల్ 10, కోహ్లీ 13, రహానే 18, అశ్విన్ 8, సాహా 5, యాదవ్ 5, జడేజా 3 పరుగులు చేశారు.

రెండో ఇన్నింగ్స్‌లో భారత వికెట్లు అన్నీ ఆసీస్ ఇద్దరు స్నిన్నర్లకే దక్కాయి. ఆస్ట్రేలియా బౌలర్లలో ఓకీఫ్ 6 వికెట్లు తీసుకోగా, లియోన్ 4 వికెట్లు తీసుకున్నాడు. కాగా, తొలి ఇన్నింగ్స్‌లో 105 ప‌రుగులు చేసిన టీమిండియా, రెండో ఇన్నింగ్స్‌లో 107 పరుగులు చేసింది.

ఈ టెస్టులో టాస్ గెలచిన ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో 260 పరుగులకే ఆలౌట్ కాగా, అనంతరం బ్యాటింగ్ చేసిన టీమిండియా 105 పరుగులకే ఆలౌటైంది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌కు 155 పరుగుల ఆధిక్యం లభించింది. ఇక రెండో ఇన్నింగ్స్ విషయానికి వస్తే ఆసీస్ 285 పరుగులు చేయగా, భారత్ 107 పరుగులకే ఆలౌటైంది.

స్కోరు వివరాలు:
ఆసీస్ తొలి ఇన్నింగ్స్: 260 ఆలౌట్
భారత్ తొలి ఇన్నింగ్స్: 105 ఆలౌట్

ఆసీస్ రెండో ఇన్నింగ్స్: 285 ఆలౌట్
భారత్ రెండో ఇన్నింగ్స్: 107 ఆలౌట్

మ్యాచ్ ఫలితం: 333 పరుగుల తేడాతో ఆసీస్ విజయం


మూడో రోజు మ్యాచ్ తీరు సాగిందిలా:

పూణె టెస్టు, డే 2 రిపోర్టు కోసం ఇక్కడ క్లిక్ చేయండి | భారత్ Vs ఆస్ట్రేలియా టెస్టు సిరిస్ ఫోటోలు

టీ విరామానికి టీమిండియా 99/6
టీమిండియాకు ఘోరపరాభవం తప్పేలా కనిపించడం లేదు. ఎన్నో అంచనాలతో మొదలైన నాలుగు టెస్టుల సిరిస్‌లో భాగంగా పూణెలో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా జట్టు అద్భుత ప్రదర్శన చేస్తోంది. టీమిండియా పేలవమైన ప్రదర్శనతో అప్రదిష్ట మూటగట్టుకునే దిశగా ఆడుతోంది. ఈ క్రమంలో తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీ విరామానికి టీమిండియా 6 వికెట్లను కోల్పోయి 99 పరుగులు చేసింది.

ఐదో వికెట్ కోల్పోయిన టీమిండియా

పూణె వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. 8 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అశ్విన్‌ను ఓకీఫ్ ఎల్‌బీడబ్ల్యూగా పెవిలియన్‌కు చేర్చాడు. 441 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ త్వరత్వరగా వికెట్లను కోల్పోయింది. 26 ఓవర్లలో అయిదు వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. ఆసీస్‌ బౌలర్‌ ఓకీఫె నాలుగు వికెట్లు, లియాన్‌ ఒక వికెట్‌ తీశాడు. లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ ఓకీఫీ కెరీర్‌లో మొదటిసారిగా ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు తీసుకున్నాడు.

పూణె టెస్టు: కష్టాల్లో భారత్, నాలుగో వికెట్ పడింది
పూణె వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో కష్టాల్లో పడింది. 441 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన టీమిండియా రహానే రూపంలో నాలుగో వికెట్‌ను కోల్పోయింది. అంతకముందు 17 ఓవర్లకే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. జట్టు స్కోరు 77 పరుగుల వద్ద ఆసీస్ స్పిన్నర్ ఓకీఫ్ బౌలింగ్‌లో రహానే (18) అవుటయ్యాడు. రహానే అవుటైన తర్వాత రవిచంద్రన్ అశ్విన్ క్రీజులోకి వచ్చాడు. ప్రస్తుతం భారత్ 24 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసింది.ప్రస్తుతం క్రీజులో పుజారా 27, అశ్విన్ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు.

కోహ్లీ అవుట్: మూడో వికెట్ కోల్పోయిన భారత్
పూణె వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. 13 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కెప్టెన్ విరాట్ కోహ్లీ... ఆసీస్ స్పిన్నర్ ఓకీఫ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన కోహ్లీ రెండో ఇన్నింగ్స్‌లో కూడా అభిమానులను నిరాశపరిచాడు. ప్రస్తుతం టీమిండియా 22 ఓవర్లకు గాను 3 వికెట్లు కోల్పోయి 77 పరుగులు చేసింది. టీమిండియా విజయానికి 364 పరుగులు అవసరం కాగా, ఆస్ట్రేలియా గెలుపునకు 7 వికెట్లు తీయాల్సి ఉంది. ప్రస్తుతం క్రీజులో పుజారా 18, పూజారా 23 పరుగులతో ఉన్నారు.

రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా
తొలి టెస్టులో ఆస్ట్రేలియా నిర్దేశించిన 441 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్ 10, మురళీ విజయ్ 2 స్వల్ప స్కోర్లకే పెవిలియన్‌కు చేరారు. జట్టు స్కోరు 10 పరుగుల వద్ద ఒకీఫీ బౌలింగ్‌లో మురళీ విజయ్‌ (2) పరుగుల వద్ద పెవిలియన్ కు చేరాడు. ఆ తర్వాతి ఓవర్‌లోనే లియోన్‌ బౌలింగ్‌లో కేఎల్ రాహుల్‌ (10) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో 13 ఓవర్లకు గాను 2 వికెట్లు కోల్పోయి 31 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కోహ్లీ 6, పుజారా 4 పరుగులతో ఉన్నారు.

భారత్‌కు భారీ టార్గెట్ 441

పూణె వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 285 పరుగులు చేసింది. దీంతో తొలి టెస్టులో టీమిండియా ముందు 441 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. 143/4 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజైన శనివారం ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఆసీస్ 285 పరుగులకు ఆలౌటైంది.

దీంతో తొలి టెస్టులో ఆస్ట్రేలియాకు 440 పరుగుల ఆధిక్యం లభించింది. ఆసీస్ బ్యాట్స్‌మెన్లలో కెప్టెన్ స్టీవ్ స్మిత్ సెంచరీతో చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్‌లో 260 చేసిన ఆసీస్‌, భారత్‌ను 105 పరుగులకే కుప్పకూల్చి 155 పరుగుల ఆధిక్యం సాధించింది.భారత బౌలర్లలో అశ్విన్ 4, జడేజా 3, ఉమేశ్ యాదవ్ 2, జయంత్ యాదవ్‌కు ఒక వికెట్ లభించింది. పూణె టెస్టులో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్‌లో 260 పరుగులు చేయగా, భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 105 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.

స్కోరు వివరాలు:
ఆసీస్ తొలి ఇన్నింగ్స్: 260 ఆలౌట్
భారత్ తొలి ఇన్నింగ్స్: 105 ఆలౌట్

ఆసీస్ రెండో ఇన్నింగ్స్: 285 ఆలౌట్
భారత్ విజయ లక్ష్యం: 441

తొమ్మిదో వికెట్ కోల్పోయిన ఆసీస్
పూణె వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా తొమ్మిదో వికెట్ కోల్పోయింది. 13 పరుగులు చేసిన లియాన్‌ను ఉమేశ్ యాదవ్ పెవిలియన్‌కు పంపాడు. ప్రస్తుతం ఆసీస్ 84 ఓవర్లకు గాను 9 వికెట్లను కోల్పోయి 279 పరుగులు చేసింది. ఓకీఫ్ 2, హజెల్‌వుడ్ ఖాతా తెరవకుండా క్రీజులో ఉన్నాడు.

ఎనిమిదో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా
తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. దూకుడుగా ఆడుతున్న మిచెల్ స్టార్క్‌ను అశ్విన్ అవుట్ చేశాడు. 31 బంతుల్లోనే రెండు ఫోర్లు, మూడు సిక్సర్లతో 30 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఆసీస్ 79 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది. లియాన్ 1, ఓకీఫ్ పరుగులేమీ చేయకుండా క్రీజులో ఉన్నాడు.

109 పరుగుల వద్ద ఏడో వికెట్‌గా స్మిత్ అవుట్

తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ఏడో వికెట్ కోల్పోయింది. 109 పరుగులు చేసిన ఆసీస్ కెప్టెన్ స్మిత్‌ను జడేజా అవుట్ చేశాడు. ప్రస్తుతం ఆసీస్ 77 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది. స్టార్క్ 24, ఓకీఫ్ ఖాతా తెరవకుండా క్రీజులో ఉన్నాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 407 పరుగుల ఆధిక్యంలో ఉంది.

సెంచరీతో కదం తొక్కిన స్టీవ్ స్మిత్

భారత్‌తో పూణె వేదికగా జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ సెంచరీ సాధించాడు. 187 బంతుల్లో 11 ఫోర్ల సాయంతో సెంచరీ సాధించాడు. స్మిత్‌కి భారత గడ్డపై ఇది మొదటి సెంచరీ కాగా, కెప్టెన్ పదవది కావడం విశేషం. మరోవైపు మిచెల్ స్టార్క్ భారీ షాట్లతో అలరిస్తున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 27 పరుగులే చేసిన స్మిత్ రెండో ఇన్నింగ్స్‌లో నిలకడగా ఆడుతూ సెంచరీ నమోదు చేశాడు. దీంతో ప్రస్తుతం ఆస్ట్రేలియా 71 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. క్రీజులో స్మిత్‌ 101 పరుగులు, స్టార్క్‌ 7 పరుగులతో క్రీజులో ఉన్నారు. వీరిద్దరి ధాటికి ఆసీస్ భారీ ఆధిక్యాన్ని సాధించింది.

India Vs Australia, 1st Test, Day 3: Steve Smith hits ton

అవుట్ నుంచి తప్పించుకున్న కెప్టెన్ స్మిత్

ఆసీస్‌ కెప్టెన్‌ స్మిత్‌ 73 పరుగుల వద్ద జడేజా బౌలింగ్‌లో ఎల్బీ రూపంలో ఔటయ్యే సదవకాశం పోయింది. భారత ఆటగాళ్లు అప్పీలు చేసినప్పటికీ అంపైర్‌ నాటౌట్‌గా ప్రకటించారు. రిప్లేలో మాత్రం బంతి వికెట్లను తాకుతున్నట్లు స్పష్టంగా ఉన్నా భారత్‌కు సమీక్ష కోరే అవకాశం లేకపోవడంతో స్మిత్‌ బతికిపోయాడు.

ఆరో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా

పూణె వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ఆరో వికెట్ కోల్పోయింది. 20 పరుగులు చేసిన వేడ్‌ను ఉమేష్ యాదవ్ పెవిలియన్‌కు పంపాడు. మరో ఎండ్‌లో స్మిత్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతూ సెంచరీకి చేరువయ్యాడు. ప్రస్తుతం ఆసీస్ 66 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. స్మిత్ 85 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఆసీస్ 359 పరుగుల ఆధిక్యంలో ఉంది.

నిలకడగా ఆడుతున్న స్మిత్

143/4 ఓవర్ నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆసీస్ జట్టులో స్మిత్ నిలకడగా ఆడుతున్నాడు. 59 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ కొనసాగించిన స్మిత్, భారత బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొటూ ఆసీస్ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 400 పరుగులకు పైగా ఆధిక్యంలో కొనసాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌కు 155 పరుగుల ఆధిక్యం లభించింది.

భారీ ఆధిక్యం దిశగా ఆస్ట్రేలియా

భారత్‌తో జరుగుతున్న మొదటి టెస్ట్‌లో ఆస్ట్రేలియా భారీ స్కోరు దిశగా దూసుకెళ్తొంది. రెండో ఇన్నింగ్స్‌లో 143/4 ఓవర్‌నైట్‌ స్కోరుతో మూడో రోజు ఆట ప్రారంభించిన ఆసీస్‌.. మరో 26 పరుగులు జోడించి జడేజా బౌలింగ్‌లో కీపర్‌ సాహా క్యాచ్‌ పట్టడంతో షాన్‌ మార్ష్‌(31పరుగులు) ఔటయ్యాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 60 ఓవర్లలో అయిదు వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. ఆసీస్‌ కెప్టెన్‌ స్మిత్‌ 80 పరుగులు, మాథ్యూ వేడ్‌ 5 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్‌లో 260 పరుగులు, భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 105 పరుగులకు ఆలౌటైన విషయం విదితమే.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X