న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రవీంద్ర జడేజాకు కోహ్లీ పెట్టిన కొత్త పేరు ఏంటో తెలుసా?

టెస్టుల్లో నెంబర్ వన్ ర్యాంకుకి చేరిన టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు కెప్టెన్ కోహ్లీ కొత్త పేరు పెట్టాడు. చివరి టెస్టు మ్యాచ్ కోసం భారత్, ఆస్ట్రేలియా జట్లు మంగళవారం ధర్మశాలకు బయర్దేరాయి.

By Nageshwara Rao

హైదరాబాద్: టెస్టుల్లో నెంబర్ వన్ ర్యాంకుకి చేరిన టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు కెప్టెన్ కోహ్లీ కొత్త పేరు పెట్టాడు. చివరి టెస్టు మ్యాచ్ కోసం భారత్, ఆస్ట్రేలియా జట్లు మంగళవారం ధర్మశాలకు బయర్దేరాయి. ఈ విషయాన్ని చెబుతూ కోహ్లీ ఒక ఫొటోను ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకున్నాడు.

<strong>అశ్విన్‌ను అధిగమించాడు: టెస్టుల్లో నెంబర్ వన్ బౌలర్‌గా జడేజా</strong>అశ్విన్‌ను అధిగమించాడు: టెస్టుల్లో నెంబర్ వన్ బౌలర్‌గా జడేజా

చివరి టెస్టు కోసం భారత బౌలింగ్‌ మిషన్‌ రవీంద్ర జడేజాతో ధర్మశాలకు పయనమైనట్లు చెబుతూ.. ఇద్దరూ కలిసి విమానంలో ఉన్న ఫొటోను షేర్‌ చేశాడు. ధర్మశాలలో జరగబోయే చివరి టెస్టుపై టీమిండియా కెప్టెన్ కోహ్లీ దృష్టి సారించాడు. రాంచీ టెస్టు ముగిసిన అనంతరం ఇరు జట్లు ధర్మశాలకు బయల్దేరాయి.

India Vs Australia: Virat Kohli renames Ravindra Jadeja as 'bowling machine'

నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా చివరి టెస్టు ధర్మశాలలో మార్చి 25న ప్రారంభం కానుంది. నాలుగు టెస్టుల సిరిస్‌లో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచి 1-1తో సమానంగా ఉన్నాయి. కాగా, రాంచీలో జరిగిన మూడో టెస్టు డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. దీంతో ధర్మశాలలో జరిగే నాలుగో టెస్టు ఈ సిరిస్‌కు డిసైడింగ్ టెస్టుగా మారింది.

ఇదిలా ఉంటే మంగళవారం ఐసీసీ ప్రకటించిన టెస్టు బౌలర్ల ర్యాంకుల్లో టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా నెంబర్ వన్ స్ధానంలో నిలిచాడు. రాంచీ టెస్టు ముందు వరకు నెంబర్ వన్ స్ధానంలో కొనసాగుతున్న రవిచంద్రన్ అశ్విన్ రెండో స్ధానానికి పరిమితమయ్యాడు.

జడేజా తన కెరీర్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవడం ఇదే తొలిసారి. ఈ టెస్టులో జడేజా మొత్తం 9 వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన జడేజా, ఇక రెండో ఇన్నింగ్స్‌లో 52 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీశాడు. అదే సమయంలో రవిచంద్రన్‌ అశ్విన్‌ రాంచీ టెస్టులో రాణించలేకపోయాడు.

రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి అశ్విన్‌కి దక్కినవి కేవలం రెండు వికెట్లు మాత్రమే. దీంతో 99 రేటింగ్ పాయింట్లతో జడేజా నెంబర్ వన్ స్ధానంలో కొనసాగుతున్నాడు. రాంచీ టెస్టులో కేవలం రెండు వికెట్లు మాత్రమే తీసుకున్న అశ్విన్ 37 రేటింగ్ పాయింట్లు కోల్పోయి 862 రేటింగ్ పాయింట్లతో రెండో స్ధానంలో కొనసాగుతున్నాడు.

ఐసీసీ టెస్టు బౌలర్ల జాబితాలో నెంబర్ వన్ బౌలర్‌గా నిలిచిన మూడో భారత క్రికెటర్‌గా జడేజా అరుదైన గుర్తింపు పొందాడు. జడేజాకు ముందు బిషన్ సింగ్ బేడీ, రవిచంద్రన్ అశ్విన్‌లు నెంబర్ వన్ స్ధానాన్ని దక్కించుకున్నారు.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X