న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

హైదరాబాద్ టెస్టు, డే 3: ధీటుగా బదులిస్తోన్న బంగ్లా 322/6

ఉప్పల్ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్ ఆడుతున్న బంగ్లాదేశ్ లంచ్ విరామ సమయానికి 4 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది. 

By Nageshwara Rao

హైదరాబాద్: భారత్‌తో ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న ఏకైక టెస్టులో బంగ్లాదేశ్ నిలకడగా ఆడుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 104 ఓవర్లు ఆడిన బంగ్లాదేశ్ 6 వికెట్లు కోల్పోయి 322 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ కెప్టెన్ ముస్ఫికర్ రహీమ్ భారత బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నాడు.

దీంతో మూడో రోజు క్రీజులో ముస్ఫికర్ రహీమ్ 81, మెహిదీ హాసన్ 51 పరుగులతో ఉన్నారు. 41/1 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఆటను కొనసాగించిన బంగ్లాదేశ్‌ను భారత బౌలర్లు ఆదిలోనే దెబ్బతీశారు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చి షకిబ్.. రహీమ్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు.

వీరిద్దరూ కలిసి 107 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన షబ్బీర్ 16 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రవీంద్ర జడేజా బౌలింగ్‌లో ఎల్‌బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మెహిదీ హాసన్, కెప్టెన్‌తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు.

వీరిద్దరూ నిలకడగా ఆడుతూ జట్టు స్కోరుని 300 పరుగులకు పైగా దాటించారు. వీరిద్దరూ కలిసి ఏడో వికెట్‌కు 87 పరుగుల భాగస్వామ్యాని నెలకొల్పారు. ఇక భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్ 2, జడేజా, అశ్విన్, ఇషాంత్ శర్మ తలో వికెట్ తీసుకున్నారు.


మూడో రోజు ఆట సాగిందిలా:

టీ విరామానికి బంగ్లాదేశ్ 246/6
ఉప్పల్ స్టేడియంలో భారత్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో టీ విరామానికి బంగ్లాదేశ్ ఆరు వికెట్లు కోల్పోయి 246 పరుగులు చేసింది. ముస్ఫికర్ రహీమ్ 47, మెహిది హ‌స‌న్ 9 పరుగులతో క్రీజులో ఉన్నారు. బంగ్లాదేశ్ ఇంకా త‌న తొలి ఇన్నింగ్స్‌లో 441 ప‌రుగులు వెన‌క‌బ‌డి ఉంది. ఐదో వికెట్‌కు ష‌కీబ్‌, ముస్ఫికర్‌లు 107 పరుగులు జోడించారు. బంగ్లా ఆటగాడు షకీబ్ శరవేగంగా 82 పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. భార‌త బౌల‌ర్ల‌లో ఉమేశ్ యాద‌వ్ రెండు వికెట్లు తీసుకోగా, అశ్విన్‌, జ‌డేజాలు చెరో ఒక వికెట్ తీసుకున్నారు.

అర్ధసెంచరీ చేసిన షకీబ్ ఉల్ హాసన్
ఉప్పల్ స్టేడియంలో భారత్‌తో జరుగుతున్న ఏకైక టెస్టులో బంగ్లాదేశ్ ఆటగాడు షకీబ్ ఉల్ హాసన్ అర్ధసెంచరీ పూర్తి చేశాడు. 69 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో షకీబ్ అర్థ సెంచరీ సాధించాడు. 41/1 ఓవర్ నైట్ స్కోరుతో శనివారం తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన బంగ్లాదేశ్ ఆరంభంలోనే కీలక వికెట్లను నష్టపోయింది.

మూడో రోజు ఆటలో భాగంగా తమిమ్ ఇక్బాల్ వికెట్‌ను రనౌట్ రూపంలో బంగ్లాదేశ్ కోల్పోయింది. ఆ తర్వాత మోమినుల్ హక్ (12), మొహ్ముదుల్లా(28)ల వికెట్లను కోల్పోయింది. ఈ తరుణంలో షకీబ్ ఉల్ హాసన్, కెప్టెన్ రహీమ్‌లు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే షకీబ్ అర్ధ సెంచరీ సాధించాడు.

ఎదురీదుతున్న బంగ్లాదేశ్
ఉప్పల్ స్టేడియంలో భారత్‌తో జరుగుతున్న ఏకైక టెస్టులో బంగ్లాదేశ్‌ ఎదురీదుతోంది. మూడో రోజైన శనివారం బౌలర్లు సత్తా చాటుతున్నారు. భారత బౌలర్ల ధాటికి పరుగులు చేయడానికి బంగ్లా బ్యాట్స్ మెన్ నానా తంటాలు పడుతున్నారు. ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ 24 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రనౌట్ అయ్యాడు. అనంతరం, మోమినుల్ హక్ 12 పరుగులు చేసి ఉమేష్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.

లంచ్ విరామానికి బంగ్లాదేశ్ 125/4
ఉప్పల్ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్ ఆడుతున్న బంగ్లాదేశ్ లంచ్ విరామ సమయానికి 4 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది. 41/1 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఆటను కొనసాగించిన బంగ్లా లంచ్ విరామ సమయానికి ముందే 3 వికెట్లను కోల్పోయింది.

బంగ్లాదేశ్ ఆటగాళ్లు సౌమ్య సర్కార్ 15, మోమినుల్ హక్ 12, మహ్మదుల్లా 29 స్వలస్కోరుకే పెవిలియన్‌కు చేరారు. ప్రస్తుతం షకీబ్ ఉల్ హాసన్ 29, కెప్టెన్ ముస్ఫికర్ రహీమ్ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ ఇంకా 562 పరుగుల వెనుకబడి ఉంది.

భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్ 2 వికెట్లు తీసుకోగా, ఇషాంత్ శర్మకు ఒక వికెట్ లభించింది. భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్ రెండో రోజైన శుక్రవారం ప్రారంభమైంది. 41/1 ఓవర్ నైట్ స్కోరుతో బంగ్లాదేశ్ మూడో రోజు ఆటను ప్రారంభించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లా వికెట్ నష్టానికి 41 పరుగులు చేసింది.

India vs Bangladesh Test Day 3: India pick regular wickets before Lunch against Bangladesh

డే 2, నమోదైన రికార్డులివే: భారత్ 687 డిక్లేర్డ్, బంగ్లా 41/1

కాగా, తొలి ఇన్నింగ్స్‌ను 687 పరుగుల వద్ద డిక్లేర్డ్ చేసింది. కెప్టెన్ కోహ్లీ డబుల్ సెంచరీ చేయగా, మురళీ విజయ్, సాహా సెంచరీలు నమోదు చేశారు. ఇక పుజారా 83, రహానే 82, జడేజా 60, అశ్విన్ 34 పరుగులు నమోదు చేశారు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X